Home /News /sports /

రీ ఎంట్రీలో నిరాశపరిచిన యువరాజ్ సింగ్...25 బంతులు ఎదుర్కొని 14 పరుగులే...

రీ ఎంట్రీలో నిరాశపరిచిన యువరాజ్ సింగ్...25 బంతులు ఎదుర్కొని 14 పరుగులే...

గ్లోబల్ టీ20 టోర్నీతో క్రిస్ గేల్, యువరాజ్ (twitter)

గ్లోబల్ టీ20 టోర్నీతో క్రిస్ గేల్, యువరాజ్ (twitter)

టోరంటో తరపున బ్యాటింగ్ కు దిగిన యువరాజ్ సింగ్ 27 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

    కెనడాలో జరుగుతున్న గ్లోబల్ టీ 20 టోర్నీ ద్వారా క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్ తొలి మ్యాచ్ లో తీవ్రంగా నిరాశపరిచాడు. రిటైర్‌మెంట్ తర్వాత గ్లోబల్ టీ20 టోర్నీలో టోరంటో నేషనల్స్ తరపున కెప్టెన్ గా యువరాజ్ సింగ్ బరిలోకి దిగాడు. టోర్నీలో తొలి మ్యాచ్ లో టోరంట్ నేషనల్స్ జట్టు వాంకోవర్ నైట్స్ తో తలపడింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన టోరంటో థామస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అయితే టోరంటో తరపున బ్యాటింగ్ కు దిగిన యువరాజ్ సింగ్ 27 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తర్వాత 160 పరుగుల టార్గెట్ ను చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన వాంకోవర్ నైట్స్ కేవలం 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని నమోదు చేసింది.
    First published:

    Tags: Cricket, Sports, T20, Yuvaraj singh, Yuvraj Singh

    తదుపరి వార్తలు