Home /News /sports /

YUVRAJ SINGH ASKS OSCAR NOMINATION FOR SACHIN TENDULKAR AND BRIAN LARAS ROAD SAFETY VIDEO SRD

Sachin - Lara : వీళ్లద్దరికీ ఆస్కార్ ఇవ్వాల్సిందే..సచిన్, లారా వీడియోపై యువీ కామెంట్..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Sachin - Lara : ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు చేతులు కలిపారు. రోడ్డు భద్రత గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్‌ ధరించాలని, సీటు బెల్టు పెట్టుకొవాలని ప్రభుత్వాలు అనేక చట్టాలు తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై , ఇప్పటికి చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు చేతులు కలిపారు. రోడ్డు భద్రత గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్‌ ధరించాలని, సీటు బెల్టు పెట్టుకొవాలని ప్రభుత్వాలు అనేక చట్టాలు తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై , ఇప్పటికి చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే, భారతమాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌, వెస్టిండీస్‌ ఆటగాడు బ్రియాన్‌ లారాతో కలిసి రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. రోడ్ సేఫ్టీ వ‌ర‌ల్డ్ సిరీస్‌లో భాగంగా చాలా ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఫీల్డ్‌లో క‌లిసి ఆడిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, విండీస్ దిగ్గ‌జ ప్లేయ‌ర్ బ్రియాన్ లారా ఆ రోడ్డు భ‌ద్ర‌త గురించి సందేశ‌మిచ్చే వీడియో ఇప్పుడు వైర‌ల్ అయింది. ఈ 49 సెక‌న్ల వీడియోలో హెల్మెట్ ధ‌రించ‌డం ఎంత ముఖ్య‌మో వివ‌రించాడు స‌చిన్ టెండూల్క‌ర్‌. క్రికెట్ ఫీల్డ్‌లో అయినా, బండి న‌డిపేట‌ప్పుడు అయినా హెల్మెట్ క‌చ్చితంగా ధరించాల‌ని స‌చిన్ పిలుపునిచ్చాడు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ వీడియోను స‌చిన్ ట్విట‌ర్‌లో షేర్ చేయ‌గా.. ఆస్కార్ నామినేష‌న్ అని కామెంట్ చేస్తూ దీనిని రీట్వీట్ చేశాడు యువ‌రాజ్‌సింగ్‌.

    ఇక, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 క్రికెట్ టోర్నీ కప్‌లో ఇండియా లెజెండ్స్ అదరగొట్టారు. రిటైర్డ్‌ క్రికెటర్లతో నిర్వహించిన రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టి20 క్రికెట్‌ టోర్నీ కప్‌లో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. సచిన్‌ టెండూల్కర్‌ కెప్టెన్సీలోని భారత జట్టు 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్‌ జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగుల భారీ స్కోరు చేసింది. యూసుఫ్‌ పఠాన్‌ (36 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు)... యువరాజ్‌ సింగ్‌ (41 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. సచిన్‌ టెండూల్కర్‌ (23 బంతుల్లో 30; 5 ఫోర్లు) రాణించాడు.


    ఆ తర్వాత శ్రీలంక 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 167 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ దిల్షాన్‌ (18 బంతుల్లో 21; 3 ఫోర్లు), జయసూర్య (43; 5 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించి శుభారంభం అందించారు.అయితే వీరిద్దరు అవుటయ్యాక లంక జోరు తగ్గింది. చివర్లో జయసింఘే (30 బంతుల్లో 40; ఫోర్, 2 సిక్స్‌లు), వీరరత్నే (15 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది.భారత స్పిన్నర్‌ యూసుఫ్‌ పఠాన్‌ రెండు వికెట్లు తీశాడు. చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బాఘేల్‌ చేతుల మీదుగా సచిన్‌ లెజెండ్స్‌ కప్‌ను అందుకున్నాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Brian Lara, Road Safety, Sachin Tendulkar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు