• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • YUSUF PATHANS MOTHER KEPT A LETTER SAFLY TILL DATE IRFAN REVEALD THE SECRET JNK

Pathan Brothers : యూసుఫ్ పఠాన్‌కు వచ్చిన ఆ లెటర్ ఇప్పటికీ భద్రంగా దాచిన అమ్మ.. అసలు ఏమిటా లెటర్?

Pathan Brothers : యూసుఫ్ పఠాన్‌కు వచ్చిన ఆ లెటర్ ఇప్పటికీ భద్రంగా దాచిన అమ్మ.. అసలు ఏమిటా లెటర్?

Irfan Revealed a secret about yusuf

  • Share this:
    టీమ్ ఇండియాకు (Team India) ఒకే సమయంలో ప్రాతినిథ్యం వహించిన అన్నదమ్ములు పఠాన్ బ్రదర్స్. యూసుఫ్ పఠాన్ (Yusuf Pathan), ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) టీమ్ ఇండియా తరపున ఎన్నో చిరస్మరణీయమైన మ్యాచ్‌లు ఆడారు. మామూలుగా జాతీయ జట్టులో స్థానం సంపాదించడమంటేనే చాలా కష్టం. అలాంటిది ఒకే ఇంటి నుంచి ఇద్దరు జాతీయ జట్టుకు ఆడటం అంటే ఎంత కష్టమే ఊహించండి. వీరిద్దరూ నేషనల్ టీమ్‌ తరపున ఆడే సమయంలో ఎంతో మంది ఫాన్ ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్‌కు అమ్మాయిల దగ్గర నుంచి ఎన్నో లవ్ లెటర్స్ వస్తుండేవి. ఇక అన్న యూసుఫ్ పఠాన్ మాత్రం చాలా సిగ్గరి. బయటి వ్యక్తులతో పెద్దగా మాట్లాడేవాడు కాదంటా. అమ్మాయిల విషయంలో అయితే ఆమడ దూరం ఉండేవాడు. అలాంటి యూసుఫ్‌కు ఒక రోజు ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని వాళ్ల అమ్మ అందుకొని విప్పి చూసింది. ఒక అమ్మాయి ఎంతో ప్రేమతో రాసిన లవ్ లెటర్ అది.

    యూసుఫ్‌కు వచ్చిన లెటర్ చూసి వెంటనే ఇంట్లో ఉన్న వాళ్లందరినీ పిలిచింది. తన పెద్ద కొడుకుకు మొదటి సారి లవ్ లెటర్ వచ్చిందంటూ సందడి చేసిందంటా. కొడుకుకు ఎవరైనా లవ్ లెటర్ రాస్తే కోపగించుకునే తల్లులు ఉంటారు. కానీ యూసుఫ్ తల్లి మాత్రం ఏదో పెద్ద ఉద్యోగం కోసం అపాయింట్‌మెంట్ లెటర్ వచ్చినంత సంబరపడిందట. ఈ విషయాన్ని తమ్ముడు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అన్నయ్య యూసుఫ్ జాతీయ జట్టుకు సెలెక్ట్ అయినప్పుడు కూడా అమ్మ ఇంత సంతోషించలేదని.. ఇప్పటికీ అమ్మదగ్గర ఆ లెటర్ భద్రంగా ఉందని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. ఇంట్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్దలు ఉండవని.. మేమిద్దరం గొడవపడటం ఎప్పుడూ జరగలేదని ఇర్ఫాన్ అన్నాడు.





    ఇక యూసుఫ్ పఠాన్ బయటి వ్యక్తులతో మాట్లాడకపోయినా.. జంతువులతో బాగా స్నేహం చేస్తుంటాడు. అతి ఫామ్‌హౌస్‌లో గుర్రాలు, మేకలు, కోళ్లుతో పాటు 300 రకాల పక్షులు ఉన్నాయంటా. క్రికెట్ సాదన ముగించిన తర్వాత ఆ ఫామ్‌హౌస్‌లో ఉన్న జంతువులతో గడుపుతుంటాడు. ప్రస్తుతం ఇద్దరు అన్నదమ్ములు నోయిడాలో ఒక అంతర్జాతీయ స్థాయి క్రికెట్ అకాడమీని నడుపుతున్నారు. పేద విద్యార్థులతో పాటు కశ్మీర్ కుర్రాళ్లకు క్రికెట్ పాఠాలు బోధిస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్ వ్యాఖ్యాతగా కూడా పని చేస్తున్నారు. ఇటీవల రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడిన తర్వాత కరోనా బారిన పడి కోలుకుంటున్నారు.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు