Home /News /sports /

కనీవినీ ఎరుగని స్టన్నింగ్ క్యాచ్.. మహిళా క్రికెట్‌లో సంచలనం.. వైరల్ వీడియో

కనీవినీ ఎరుగని స్టన్నింగ్ క్యాచ్.. మహిళా క్రికెట్‌లో సంచలనం.. వైరల్ వీడియో

ఉమెన్ బిగ్ బాష్ లీగ్‌లో స్టన్నింగ్ క్యాచ్ (Image:Twitter)

ఉమెన్ బిగ్ బాష్ లీగ్‌లో స్టన్నింగ్ క్యాచ్ (Image:Twitter)

Womens Big Bash League 2020: ఆ స్టన్నింగ్ క్యాచ్‌ను చూసి బ్యాటర్ అమెలియా కేర్‌తో పాటు అందరూ ఆశ్యర్యపోయారు. ఆమె ఔట్ కావడంతో బ్రిస్బేన్ హీట్ స్కోర్ మందగించింది. చివరకు 18 పరుగుల తేడాతో ఓటమి పాలయింది.

    పురుషుల క్రికెట్‌తో పోల్చితే మహిళ క్రికెట్‌కు ఆదరణ తక్కువగా ఉంటుంది. ఎవరూ కాదనలేని నిజం ఇది. ఇప్పుడిప్పుడు మహిళా క్రికెట్‌కు ప్రోత్సాహం దక్కుతున్నా.. ఇంకా వెనకబడే ఉంది. మన దేశంలోనే కాదు.. అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. కానీ పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా రాణిస్తున్నారు మహిళా క్రికెటర్లు. తమను తాము సానబెట్టుకుంటూ.. అంచనాలకు మించి ఎన్నో సంచనాలు సృష్టిస్తూ.. వినోదాన్ని పంచుతున్నారు. ఇది మరోసారి రుజువయింది. పురుషుల కన్నా ఏ మాత్రం తక్కువ కాదని మహిళా క్రికెటర్లు నిరూపించారు. ఇందుకు మహిళల బిగ్‌బాష్ లీగ్ వేదికయింది. బ్రిస్బేన్ హీట్, అడిలైడ్ స్ట్రైకర్స్ ఉమెన్ మ్యాచ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

    శనివారం సిడ్నీ వేదికగా బ్రిస్బేన్‌ హీట్‌ ఉమెన్‌, అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ ఉమెన్‌ మధ్య మ్యాచ్ జరిగింది. బ్రిస్బేన్ హీట్ ఉమెన్ టీమ్ విజయానికి 17 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన తరుణంలో గ్రౌండ్‌లో అద్భుతం చోటుచేసుకుంది. అడిలైడ్‌ స్పిన్నర్‌ అమంద వెల్లింగ్టన్‌ విసిరిన ఫుల్‌టాస్‌​ బాల్‌ను అమెలియా కేర్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్ కొట్టింది. అది ఖచ్చితంగా బౌండరీ వెళ్తుందని అందరూ భావించారు. కానీ గాల్లో వెళ్తున్న ఆ బంతిని మ్యాడీ పెన్ని క్యాచ్ పట్టే ప్ర‌య‌త్నం చేసింది. ఆమె చేతులను తాకుతూ బంతి అమాంతం పైకి లేచి.. కొంత దూరంలో కిందపడపోయింది. ఐతే పెన్నాకు బ్యాకప్‌గా వచ్చిన తాహిలా మెక్‌గ్రాత్‌ కళ్లు చెదిరేలా డైవ్ చేస్తూ బాల్‌ను పట్టుకుంది.

    ఆ స్టన్నింగ్ క్యాచ్‌ను చూసి బ్యాటర్ అమెలియా కేర్‌తో పాటు అందరూ ఆశ్యర్యపోయారు. ఆమె ఔట్ కావడంతో బ్రిస్బేన్ హీట్ స్కోర్ మందగించింది. చివరకు 18 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ప్రస్తుతం ఆ క్యాచ్ వీడియోను అడిలైడ్ స్ట్రైకర్స్ టీమ్ ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.


    కాగా, ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్‌ ఉమెన్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. కేటీ మ్యాక్ 50 పరుగులతో అదరగొట్టింది. వోల్వార్ట్ 46 రన్స్‌తో రాణించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బేన్ హీట్ ఉమెన్.. టార్గెట్‌ను చేధించలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయలగలిగారు. దాంతో అడిలైట్ స్ట్రయికర్స్ ఉమెన్ టీమ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, Women's Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు