• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • YOUNG CRICKETERS PLAYED FOR RR RCB TARGERT IS GETABLE JNK

IPL 2021 : రాజస్థాన్ యువ క్రికెటర్లే నిలబెట్టారు.. తెవాతియా సూపర్ హిట్టింగ్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

IPL 2021 : రాజస్థాన్ యువ క్రికెటర్లే నిలబెట్టారు.. తెవాతియా సూపర్ హిట్టింగ్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

ఆర్సీబీ బౌలర్ల ధాటికి టాపార్డర్ కూలినా.. రాజస్థాన్ టార్గెట్ భారీగానే ఇచ్చింది

  • Share this:
    రాజస్థాన్ రాయల్స్ టాపార్డర్ మరో సారి విఫలం అయ్యింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సరైన ఆరంభం లభించలేదు. ఆర్సీబీ బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో కేవలం 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. జాస్ బట్లర్ (8), మన్నన్ ఓహ్రా (7), డేవిడ్ మిల్లర్ (0) వంటి టాప్ రేటెడ్ బ్యాట్స్‌మెన్ పవర్ ప్లే‌లోపే చాప చుట్టేశారు. తొలి మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ సంజూ శాంసన్ (21) కాసేపు నిలబడినా త్వరగానే వికెట్ కోల్పోయాడు. దీంతో 43 పరుగులకే రాజస్థాన్ కీలకమైన 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత యువ క్రికెటర్లు శివమ్ దూబే(46), రియాన్ పరాగ్ (25) కలసి రాజస్థాన్ స్కోర్‌ను పెంచారు. వీరిద్దరూ కలసి అర్ద సెంచరీ భాగస్వామ్యం అందించారు.

    దూకుడుగా ఆడుతున్న రియాన్ పరాగ్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడటంతో యజువేంద్ర చాహల్ క్యాచ్ చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రాహుత్ తెవాతియా (40) ఒక దూకుడైన ఇన్నింగ్స్ ఆడాడు. శివమ్ దూబే, క్రిస్ మోరీస్ (10) అవుటైనా తన దైన శైలిలో ఆడిన రాహుల్ తెవాతియా రాజస్థాన్ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు.

    అయితే సిరాజ్ బౌలింగ్‌లో రాహుల్ తెవాతియా అవుటైన తర్వాత టెయిలెండర్లు పరుగులు రాబట్టలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేశారు. వాంఖడే వంటి స్టేడియంలో 178 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇవ్వడం తక్కువే అని విశ్లేషకులు చెబుతున్నారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 220 పరుగుల టార్గెట్‌ను కేకేఆర్ దాదాపు ఛేదించే స్థితికి చేరుకున్న విషయాన్ని అభిమానులు కూడా గుర్తు చేస్తున్నారు.





    రాజస్థాన్ రాయల్స్ : 177/9

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టార్గెట్ : 178
    Published by:John Naveen Kora
    First published: