క్రికెట్ నింపిన విషాదం.. బౌన్సర్ తగిలి అండర్-19 క్రికెటర్ మృతి

బౌన్సర్‌ను పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో గొంతు భాగంలో బంతి బలంగా తాకి అహ్మద్ వార్ కుప్పకూలాడాని జిల్లా స్పోర్ట్స్ అధికారి నూర్ మహమ్మద్ వెల్లడించారు.

news18-telugu
Updated: July 12, 2019, 12:19 PM IST
క్రికెట్ నింపిన విషాదం.. బౌన్సర్ తగిలి అండర్-19 క్రికెటర్ మృతి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 12, 2019, 12:19 PM IST
జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా.. బౌలర్ విసిరిన బౌన్సర్ తగిలి అహ్మద్ వార్(18) అనే అండర్-19 క్రికెటర్ మృతి చెందాడు. గొంతు భాగంలో బంతి బలంగా తాకడంతో అతను అక్కడికక్కడే కూలిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. నానిల్ గ్రామంలోని బిజ్‌బెహారా స్టేడియంలో బారాముల్లా-బుద్గాం జిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.బౌన్సర్‌ను పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో గొంతు భాగంలో బంతి బలంగా తాకి అహ్మద్ వార్ కుప్పకూలాడాని జిల్లా స్పోర్ట్స్ అధికారి నూర్ మహమ్మద్ వెల్లడించారు. అహ్మద్ వార్ గోష్‌బగ్‌లో 11వ తరగతి చదువుతున్నాడని తెలిపాడు. క్రికెటర్ అహ్మద్ వార్ మృతితో అతని కుటుంబం, సహచర ఆటగాళ్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడి కుటుంబానికి గవర్నర్ సత్యపాల్ మాలిక్ రూ.5లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు.

First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...