Home /News /sports /

YEAR ENDER 2021 INDIAN TEAM LOST 2 ICC TROPHIES LOST TO PAKISTAN FIRST TIMES IN WORLD CUP JNK

Team India: టీమ్ ఇండియాకు కలసి రాని 2021.. కానీ ఆ ఒక్క మ్యాచ్ గెలిస్తే మాత్రం రికార్డే..!

టీమ్ ఇండియాకు కలసి రాని 2021.. ఆ ఒక్క మ్యాచ్ గెలిస్తే మాత్రం..

టీమ్ ఇండియాకు కలసి రాని 2021.. ఆ ఒక్క మ్యాచ్ గెలిస్తే మాత్రం..

Year Ender 2021: టీమ్ ఇండియాకు 2021 పెద్దగా కలసి రాలేదనే చెప్పాలి. ఆడిన రెండు ఐసీసీ ట్రోపీలలో కూడా ఓడిపోయిన భారత జట్టు.. టెస్టుల్లో మాత్రం పర్వాలేదనిపించింది. అయితే ఈ ఏడాది మిగిలి ఉన్న టెస్టును కూడా గెలిస్తే పాకిస్తాన్‌ను వెనక్కు నెట్టే అవకాశం ఉన్నది.

ఇంకా చదవండి ...
    క్రికెట్ (Cricket) ఆడే దేశాల్లో బలమైన జట్లలో టీమ్ ఇండియా (Team India) ఒకటి. గత కొన్నేళ్లుగా నిలకడైన ప్రదర్శన చేస్తూ ఐసీసీ (ICC) ర్యాంకింగ్స్‌లో (Rankings) మంచి రేటింగ్స్‌ను కొనసాగిస్తున్నది. అయితే 2021 మాత్రం జట్టుకు పెద్దగా కలసి రాలేదనే చెప్పాలి. ఎన్నో దశాబ్దాల నుంచి కాపాడుకుంటున్న రికార్డులు చిత్తు కావడమే కాకుండా.. మెగా టోర్నీల్లో ఘోరంగా విఫలమవడం అభిమానులను కలవరపెట్టింది. ఇక ఏడాది చివర్లో కెప్టెన్సీ (Captaincy) విషయంలో వివాదాలు ముసురుకొని టీమ్ ఇండియా ప్రతిష్టను మసకబరిచాయి. అయితే 2021లో ఎన్నో గెలుపోటములు ఎదురైనా భారత జట్టు మాత్రం చాలా పటిష్టంగానే ఉంది. ఆటగాళ్లందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. భారత టెస్టు జట్టు ఇక ఈ ఏడాదికి చివరి సారిగా ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నది. అందులో కనుక విజయం సాధిస్తే ఒక అరుదైన రికార్డు సొంతం అవుతుంది.

    టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇండియాలో అడుగు పెట్టింది. అయితే ఐసీసీ ఈవెంట్లలో మాత్రం పూర్తిగా విఫలమైంది. ఈ ఏడాది రెండు ఐసీసీ ఈవెంట్లలో ఆడిన భారత జట్టు అభిమానులకు నిరాశను మిగిల్చింది. జూన్‌లో ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వేదికగా భారత జట్టు తొలి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడింది. అయితే న్యూజీలాండ్‌తో జరిగిన ఈ టెస్టు సిరీస్ రిజర్వ్ డేతో కలుపుకొని ఆరు రోజుల పాటు జరిగింది. వర్షం కారణంగా పలు మార్లు అంతరాయాలకు గురై చివరకు మ్యాచ్ ముగిసినా ఫలితం న్యూజీలాండ్‌కు దక్కింది. తొలి టెస్ట్ చాంపియన్‌గా నిలవాలన్న టీమ్ ఇండియా కలలకు న్యూజీలాండ్ గండి కొట్టింది.

    Team India: టీమ్ ఇండియాలో కెప్టెన్ల రగడ.. కోహ్లీ-రోహిత్ మధ్య భగ్గుమన్న విభేదాలు.. రంగంలోకి దిగిన బీసీసీఐ




    ఇక తాజాగా అక్టోబర్-నవంబర్ నెలల్లో యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో కనీసం నాకౌట్ దశకు కూడా చేరలేదు. వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఓడిపోని తిరుగులేని రికార్డు ఈ సారి బద్దలైపోయింది. పైగా న్యూజీలాండ్‌తో కూడా ఓడిపోయి గ్రూప్ స్టేజిలోనే తిరుగు ముఖం పట్టింది. మొత్తానికి 2013 నుంచి భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. ఈ ఏడాది వచ్చిన రెండు అవకాశాలను కూడా కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు చేజార్చుకున్నది.

    VVS Laxman: ఫ్యామిలీతో సహా బెంగళూరు షిఫ్ట్ అయిన వీవీఎస్ లక్ష్మణ్.. ఇకపై నో కామెంట్రీ.. నో సన్‌రైజర్స్ మెంటార్షిప్




    టీమ్ ఇండియా టెస్టు మ్యాచ్‌లలో మాత్రం మంచి ప్రతిభ కనపరిచింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 13 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఇండియా 7 మ్యాచ్‌లు గెలిచి మూడు ఓడిపోయి మూడింటిని డ్రాగా మలిచింది. గెలిచిన ఏడింటిలో మూడు విదేశాల్లో దక్కినవే ఉన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ ఈ ఏడాది 9 టెస్టులు ఆడి 7 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌లు ఓడిపోయింది. టెస్టు విజయాల పరంగా ఈ రెండు దేశాలు 7 మ్యాచ్‌లతో సమానంగా ఉన్నాయి. భారత జట్టు ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో ఒక టెస్టు ఆడాల్సి ఉన్నది. ఈ మ్యాచ్ కనుక గెలిస్తే ఈ ఏడది అత్యధిక టెస్టులు గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించే అవకాశం ఉన్నది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: Bcci, ICC, India VS Pakistan, T20 World Cup 2021, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు