Home /News /sports /

XIAOMI INDIA MD MANUKUMAR JAIN ANNOUNCED HIGH END MOBILE PHONES AS GIFT TO INDIAN OLYMPICS MEDALISTS JNK

Olympics: ఒలింపిక్ పతక వీరులకు ఖరీదైన మొబైల్స్ బహుమతిగా ఇవ్వనున్న షావోమీ.. ఆ ఫోన్ విశేషాలు ఏంటో తెలుసా?

టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలకు షావోమీ నుంచి ఖరీదైన ఫోన్ గిఫ్ట్.. దాని విశేషాలు తెలుసా? (PC: Twitter/Sai Media/MI)

టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలకు షావోమీ నుంచి ఖరీదైన ఫోన్ గిఫ్ట్.. దాని విశేషాలు తెలుసా? (PC: Twitter/Sai Media/MI)

టోక్యోలో పతకాలు సాధించిన ప్రతీ భారత అథ్లెట్‌కు షావోమీ కంపెనీ నుంచి ఖరీదైన మొబైల్ ఫోన్లు బహుమతిగా అందనున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ ఇండియా ఎంపీ మను కుమార్ జైన్ ప్రకటించారు.

    ఒలింపిక్ చరిత్రలో (Olympics) తొలి సారిగా భారత క్రీడాకారులు 7 పతకాలు (Medalists) సాధించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 6 పతకాలు గెలిచిన తర్వాత అత్యధిక పతకాలు గెలవడం ఇదే తొలిసారి. ఇక భారత ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో నీరజ్ చోప్రా (Neeraj Chopra) సాధించిన స్వర్ణం సువర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భమే. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అందరికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించింది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా క్యాష్ రివార్డులు అందిస్తున్నాయి. ఇక చైనాకు చెందిన మొబైల్ ఫోన్ దిగ్గజ కంపెనీ షావోమీ (Xiaomi) ఒలింపిక్ పతక వీరులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 'టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన ప్రతీ భారత అథ్లెట్‌కు షావోమీ నుంచి ఎంఐ 11 అల్ట్రా ఫోన్ బహుమతిగా ఇస్తున్నాము. సూపర్ హీరోల కోసం సూపర్ ఫోన్' అని షావోమీ ఇండియా డైరెక్టర్ మను కుమార్ జైన్ ఆదివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా, రజత పతక విజేతలు మీరా చాను, రవి దహియా, కాంస్య పతక విజేతలు పీవీ సింధు, లవ్లీనా, దీపక్ పునియాకు ఈ అల్ట్రా ఫోన్లు లభించనున్నాయి. ఇక కాంస్య పతకం సాధించిన భారత పురుష హాకీ జట్టు సభ్యులు అందరికీ ఎంఐ 11 ఎక్స్ ఫోన్లు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    షావోమీ నుంచి వస్తున్న ఎంఐ 11 అల్ట్రా ఫ్లాగ్ షిప్ ఫోన్ ధర రూ. 69,999 గా కంపెనీ వెబ్ సైట్ పేర్కొన్నది. టాప్ మోడల్ అయిన ఇందులో అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ఎస్ఓసీ చిప్ సెట్ కలిగి ఉన్న ఈ ఫోన్ 6.67 ఇంచుల క్యూహెచ్‌డీ ప్లస్ అమెలెడ్ డిస్‌ప్లే కలిగి ఉన్నది. ఈ స్క్రీన్ 120Hz రీఫ్రెష్ రేట్ కలిగి ఉన్నది. ఈ ఫోన్ కెమేరాకు అత్యాధునిక సెన్సార్లు ఉన్నట్లు తెలుస్తున్నది. వెనుక వైపు మూడు కెమేరాలు ఉండగా... ఒకటి 50 మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమేరా, 48 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా, 48 మెగా పిక్సెల్ టెలీ ఫొటో కెమేరా విత్ 120ఎక్స్ జూమ్ కలిగి ఉన్నది. ఈ ఫోన్‌లో అత్యాధునిక ఫీచర్ ఏంటంటే.. రేర్ కెమేరాకు పక్కనే 1.1 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో డేట్, టైమ్‌తో పాటు నోటిఫికేషన్లు చెక్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తున్నది. దీనికి 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బాక్సులో 55 వాట్ల ఫాస్ట్ చార్జర్ కలిగి ఉన్నది.





    ఇక ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత హాకీ పురుషుల జట్టు సభ్యులు అందరికీ ఇవ్వనున్న షావోమీ ఎంఐ 11 ఎక్స్ ఫోన్ ఖరీదు రూ. 29,999. ఇందులో కూడా అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Hockey, Olympics, Pv sindhu, Tokyo Olympics, Xiomi

    తదుపరి వార్తలు