• HOME
 • »
 • NEWS
 • »
 • SPORTS
 • »
 • WTC FINAL WHAT HAPPENS IF INDIA VS NEWZEALAND MATCH ENDS IN A DRAW OR TIE SRD

WTC Final : భారత్, కివీస్ మ్యాచ్ ఒక వేళ డ్రా అయితే పరిస్థితేంటి..? విజేత ఎవరు..?

WTC Final : భారత్, కివీస్ మ్యాచ్ ఒక వేళ డ్రా అయితే పరిస్థితేంటి..? విజేత ఎవరు..?

WTC Final : భారత్, కివీస్ మ్యాచ్ ఒక వేళ డ్రా అయితే పరిస్థితేంటి..? విజేత ఎవరు..?

WTC Final : టెస్ట్ క్రికెట్ కు ఆదరణ పెంచాలనే లక్ష్యంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ముందుకు తీసుకువచ్చింది. అలాంటి WTC అన్ని ఆటంకాలను ఎదుర్కొని ఆఖరి అంకానికి చేరుకుంది. వచ్చే నెల 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది.

 • Share this:
  జెంటిల్ మేన్ గేమ్ లో ఏ ఫార్మాట్ బెస్ట్ అంటే ఆ జనరేషన్ నుంచి ఇప్పటి నయా జనరేషన్ వరకు ప్రతి ఒక్కరు టెస్ట్ క్రికెట్ అని బల్లగుద్ది మరి చెబుతారు. ఐదు రోజులు సాగే.. ఈ ఆటకు ధనాధన్ గేమ్ వెలుగులోకి వచ్చినాక ఆదరణ తగ్గిందన్నది వాస్తవం. టీ-20 ఫార్మాట్ మోజులో పడి..ఈ తరం క్రికెటర్లు టెస్ట్ క్రికెట్ పై దృష్టి ఎక్కువ పెట్టడం లేదు. అలాగే, అభిమానుల్లో ఎక్కువమంది ధనా ధన్ క్రికెట్ వైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో.. తిరిగి టెస్ట్ క్రికెట్ కు ఆదరణ పెంచాలనే లక్ష్యంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ముందుకు తీసుకువచ్చింది. అలాంటి WTC అన్ని ఆటంకాలను ఎదుర్కొని ఆఖరి అంకానికి చేరుకుంది. వచ్చే నెల 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. టెస్టు హోదాను కలిగి ఉన్న మొత్తం 9 దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లతో ఈ టోర్నీని ప్లాన్ చేశారు. ఇందులో పాల్గొనే మొత్తం తొమ్మిది జట్ల మధ్య 27 ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించి విజేతను నిర్ణయించాలనుకున్నారు.ఈ మెగా టెస్ట్ టో‌ర్నీలో భాగంగా జరిగే ఒక్కో ద్వైపాక్షిక సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయించారు. ఒక సిరీస్‌లో ఐదు టెస్టులు ఆడితే ప్రతీ మ్యాచ్‌కు 24 పాయింట్లను గెలిచిన టీమ్‌కు కేటాయించారు. రెండు టెస్టుల సిరీస్‌లో ఒక్కో మ్యాచ్‌కు 60 పాయింట్లు ఇచ్చారు. ఈ పాయింట్ల పద్దతిపై అప్పట్లో తీవ్ర దుమారమే రేగింది.

  మ్యాచ్‌ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల లాభం ఏంటనే ప్రశ్న తలెత్తింది. అయితే సజావుగా సాగుతున్న ఈ డబ్ల్యూటీసీ టోర్నీపై కరోనా దెబ్బ పడింది. ఈ మహమ్మారి కారణంగా క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణ కష్టంగా మారడం, దాదాపు అయిదారు నెలలు ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు జరగలేదు. దీంతో ఐసీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ రూల్స్‌లో మార్పులు తీసుకొచ్చింది.కరోనా కారణంగా మొత్తం ఆరు టెస్ట్ సిరీస్‌ల‌ను ర‌ద్దు చేయాల్సి వచ్చింది. రద్దు చేసిన సిరీస్‌లను డ్రాగా పరిగణించిన ఐసీసీ.. విజయాల శాతాన్ని ప్రవేశపెట్టింది. ఆడిన మ్యాచ్‌లు.. గెలిచినవి లెక్కగట్టి ర్యాంకులు కెటాయించింది. దాంతో ఈ టోర్నీలో భాగంగా 6 సిరీస్‌ల్లో 16 మ్యాచ్‌లు ఆడిన భారత్ 12 విజయాలు, 4 ఓటములతో 520 పాయింట్లు సాధించి మెరుగైన విన్నింగ్ పర్సెంటేజ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు 5 సిరీస్‌లు ఆడిన న్యూజిలాండ్ 7 విజయాలు, 4 ఓటములతో 420 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి భారత్‌తో ఫైనల్‌కు రెడీ అయింది.

  అన్ని ఆటంకాలను దాటుకొని ముగింపు చేరుకున్న ఈ మెగా టోర్నీలో మరో సందేహం అభిమానులను వెంటాడుతుంది. మాములుగా టెస్ట్‌ మ్యాచ్‌లంటేనే ఫలితం తేలవు. విజయాల కన్నా డ్రాలే ఎక్కువ అవుతుంటాయి. మరీ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కూడా డ్రా అయితే పరిస్థితి ఏందనే ప్రశ్న ప్రతీ క్రికెట్ అభిమాని మదిలో మెదులుతుంది. అయితే ఐసీసీ మాత్రం డ్రాకు సంబంధించిన ఫార్మూలను పేర్కొనలేదు. దీన్ని బట్టి మ్యాచ్ టై అయితే ఇరు జట్లను విజేతగా ప్రకటించనున్నారు. కాకపోతే ఈ మెగా మ్యాచ్‌కు మాత్రం రిజర్వ్ డే కేటాయించారు. ఈ ఐదు రోజుల ఆటలో వాతావారణం అనుకూలించకనో లేక బ్యాడ్ లైట్ కారణంగానే పూర్తి కోటా ఓవర్లు పూర్తి కాకుండా మ్యాచ్ ఎండ్ అయితే.. రిజర్వ్ డేలో ఆ ఓవర్లన్నీ ఆడవచ్చు.

  మళ్లీ ఫలితం తేలేవరకు ఆడటానికి వీలు లేదు. ఆటంకం కలిగిన ఓవర్లను మాత్రం ఆడిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. మరోవైపు, మాజీ క్రికెటర్లు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజేతను ప్రకటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే రంజీ, కౌంటీలు, ఆస్ట్రేలియా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ల్లో ఈ ఫార్ములానే వాడుతున్నారు. మరి, ఐసీసీ మదిలో ఏముందో వేచి చూడాల్సిందే.
  Published by:Sridhar Reddy
  First published: