హోమ్ /వార్తలు /క్రీడలు /

WTC Final : కోహ్లీ ప్రవర్తనపై నెటిజన్ల ఆగ్రహం.. రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలంటూ డిమాండ్..

WTC Final : కోహ్లీ ప్రవర్తనపై నెటిజన్ల ఆగ్రహం.. రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలంటూ డిమాండ్..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

WTC Final : మరోసారి కోహ్లీ కెప్టెన్సీ హాట్ టాపిక్ గా మారింది. కోహ్లీ కెప్టెన్సీ తీరుపై నెట్టింట్లో రచ్చ నడుస్తోంది. కోహ్లీ వద్దు..రోహిత్ శర్మ ముద్దంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అసలు కోహ్లీ కెప్టెన్సీపై ఇంతలా నెటిజన్లు రియాక్ట్ అవ్వడానికి కారణమెంటో తెలుసా..?

ఇంకా చదవండి ...

న్యూజిల్యాండ్​లో జరుగుతున్న ఐసీసీ వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్ మ్యాచ్​లో టీమిండియా కెప్టెన్​ ప్రవర్తనపై విమర్శలొస్తున్నాయి. తన సహచర ఆటగాళ్లపై కొహ్లీ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు, కొహ్లీ తన కెప్టెన్సీ నుంచి తప్పుకొని రోహిత్​ శర్మకు బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. ఈ మేరకు రోహిత్​ శర్మకు నెటిజన్ల నుంచి మద్ధతు పెరుగుతోంది. కొహ్లీ ప్రవర్తనను గుర్తు చేయడానికి మ్యాచ్​లోని ఒక ఫోటోను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఫోటోను నిశితంగా పరిశీలిస్తే.. అంతా ఆశలు పెట్టుకున్న బుమ్రా బౌలింగ్​లో రాణించలేకపోవడంతో, కొహ్లీ అసహనానికి లోనయ్యాడు. అతని వైపు కోపంగా చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, కొహ్లీ వెనకాలే ఉన్న రోహిత్​ శర్మ మాత్రం బుమ్రాపై ఏ మాత్రం అసహనం వ్యక్తం చేయకుండా.. చప్పట్లు కొడుతూ ప్రోత్సహించాడు. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్​లో భిన్న ప్రవర్తనతో కనిపించడంతో నెటిజన్లు ఈ ఫోటోను వైరల్​ చేస్తున్నారు. కొహ్లీకి, రోహిత్​ శర్మకు మధ్య ఉన్న తేడా ఇదేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సందర్భమేదైనా కెప్టెన్​ సహనం కోల్పోకుండా ఆటగాళ్లను ఎంకరేజ్​ చేయాలని, అయితే, కెప్టెన్​ కొహ్లీలో మాత్రం ఏ మాత్రం ఆ లక్షణాలు కన్పించలేదని నెటిజన్లు అంటున్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు కెప్టెన్​గా కొహ్లీ అన్​ఫిట్​ అని చెప్పడానికి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

మైక్రోబ్లాగింగ్​ సైట్​ ట్విట్టర్​లో ఈ ఫోటో తెగ వైరల్​ అవుతోంది. నెటిజన్లు కొహ్లీకి వ్యతిరేకంగా, రోహిత్​ శర్మకు అనుకూలంగా కామెంట్స్​ చేస్తున్నారు. ఒక నెటిజన్​ స్పందిస్తూ ‘‘ఒకే ఫోటోలో గొప్ప కెప్టెన్​, చెత్త కెప్టెన్​ ఇద్దర్నీ చూడవచ్చు” అంటూ కొహ్లీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరో నెటిజన్ దీనిపై ఫన్నీగా స్పందించాడు. ఒక పరీక్షలో 100 మార్కులకు 37​ మార్కులు వస్తే అమ్మ చప్పట్లు కొడుతూ ఇంకా బాగా తెచ్చుకోవాలని ప్రోత్సహిస్తుంది. కానీ నాన్న మాత్రం తిడుతూ డిజప్పాయింట్ చేస్తాడు” అంటూ ఫన్నీగా స్పందించాడు.

ట్విట్టర్​లో ఫోటో వైరల్​...

మరో నెటిజన్​ స్పందిస్తూ ‘‘కొహ్లీకి, రోహిత్​ శర్మ మధ్య ఉన్న తేడా చూడండి.. కొహ్లీ బౌలర్​ను బ్లేమ్​ చేస్తున్నాడు.. కానీ రియల్​ లీడర్​ రోహిత్​ శర్మ మాత్రం చప్పట్లతో ఎంకరేజ్​ చేస్తున్నాడు. ఇటువంటి కెప్టెన్​ మనకు కావాలి” అంటూ వ్యాఖ్యానించాడు. మరికొందరు కొహ్లీపై సెటైరికల్​ మీమ్స్ షేర్​ చేస్తున్నారు. అయితే, కొహ్లీకి కొంతమంది నెటిజన్లు మద్ధతు తెలుపుతున్నారు. ఎలాగైనా తన సారథ్యంలో టెస్ట్​ వరల్డ్ కప్​ గెలవాలనే ఆలోచనలో కొహ్లీ ఉన్నాడని.. అందుకే, కాస్త ఒత్తిడికి లోనై ఇలా జరిగిందని చెబుతున్నారు.

First published:

Tags: India vs newzealand, Jasprit Bumrah, Rohit sharma, Virat kohli, WTC Final

ఉత్తమ కథలు