హోమ్ /వార్తలు /క్రీడలు /

Bumrah vs Sanjana: భార్య సంజనా చిలిపి ప్రశ్నలు..భర్త బుమ్రా కొంటె సమాధానాలు..వైరల్ వీడియో..

Bumrah vs Sanjana: భార్య సంజనా చిలిపి ప్రశ్నలు..భర్త బుమ్రా కొంటె సమాధానాలు..వైరల్ వీడియో..

Photo Credit : ICC Twitter

Photo Credit : ICC Twitter

Bumrah vs Sanjana: ఇక, ఒకే ఒక రోజు.. క్రికెట్ ఫ్యాన్స్ కు అసలు సిసలు మజా ఇవ్వడానికి WTC Final రెడీ అవుతోంది. ఇప్పటికే ఇరు జట్లు ఈ ఫైట్ కోసం తమ వ్యూహాల్ని రెడీ చేసుకుంటున్నాయ్. ఇక, ఈ మెగా ఫైట్ లో టీమిండియాకు స్పీడ్ స్టార్ జస్‌ప్రీత్‌ బుమ్రా కీలక బౌలర్ గా ఉన్న సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా మార్చి 15న ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...

  ఇక, ఒకే ఒక రోజు.. క్రికెట్ ఫ్యాన్స్ కు అసలు సిసలు మజా ఇవ్వడానికి WTC Final రెడీ అవుతోంది. ఇప్పటికే ఇరు జట్లు ఈ ఫైట్ కోసం తమ వ్యూహాల్ని రెడీ చేసుకుంటున్నాయ్. ఇక, ఈ మెగా ఫైట్ లో టీమిండియాకు స్పీడ్ స్టార్ జస్‌ప్రీత్‌ బుమ్రా కీలక బౌలర్ గా ఉన్న సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా మార్చి 15న ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. స్టార్ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, మోడల్ సంజనా గణేశన్‌ను అతడు ప్రేమించి పెళ్లాడాడు. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గోవా వేదికగా వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అయ్యేవరకు పూర్తి వివరాలు గోప్యంగా ఉంచిన బుమ్రా.. ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఎంత సీక్రెట్ మెయింటేన్ చేశారంటే.. బుమ్రా, సంజన షేర్ చేసేవరకు వారి పెళ్లి ఫొటోలు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అసలు వీరికి వివాహం జరుగుతుందనే ఎవరూ ఊహించలేదు. అయితే, లేటెస్ట్ గా బుమ్రాను తన భార్య సంజనా గణేషన్‌ ఇంటర్య్వూ చేసిన వీడియోను ఐసీసీ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియో తెగ వైరలవుతోంది.ఈ వీడియోలో తన చిన్ననాటి విషయాలతో పాటు పెళ్లి తర్వాత తన జీవితంలో జరిగిన మార్పుల గురించి చెప్పుకొచ్చాడు. చిన్నప్పుడు చెల్లితో క్రికెట్‌ ఆడడం.. ఆ తర్వాత స్కూల్‌ దశలో ఆడిన రోజులను ఎప్పటికి మరిచిపోను. పెళ్లి తర్వాత మరో కొత్త జీవితం మొదలైందని బుమ్రా చెప్పాడు.

  అంతకుముందు ఇంట‌ర్వ్యూకి వ‌స్తున్న స‌మ‌యంలో అక్క‌డ రెడీగా ఉన్న సంజనా గణేశన్‌ను చూసిన జస్ప్రీత్ బుమ్రా.. ఇంత‌కుముందు నిన్నెక్క‌డో చూశానే అని అంటాడు. దానికి ఆమె నేను ఎప్పుడూ ఇక్క‌డే ఉంటాను అని సరదాగా చెప్పింది. ఇంట‌ర్వ్యూలో ఎలా మాట్లాడాలి, త‌న‌ను తాను ఎలా ప‌రిచ‌యం చేసుకోవాలో కూడా బుమ్రాకు సంజనానే వివ‌రిస్తుంది. ఆ త‌ర్వాత తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మ‌రుపురాని ఫొటోలను బుమ్రాకు చూపిస్తూ.. వాటి గురించి చెప్పాల‌ని సంజ‌న అడుగుతుంది.

  తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మ‌రుపురాని ఫొటోలను భారత పేసర్ బుమ్రాకు చూపిస్తూ వాటి గురించి చెప్పాల‌ని సంజనా అడిగింది. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీతో ఉన్న ఫొటో, తాను గిటార్ వాయిస్తున్న ఫొటో, సంజ‌న‌తో పెళ్లి ఫొటోల గురించి బుమ్రా వివరించాడు. త‌న పెళ్లి ఫొటోను చూస్తూ.. ఇది త‌న జీవితంలో మ‌రుపురాని రోజు అని, ఈ మ‌ధ్యే ఈ అద్భుతం జ‌రిగింద‌ని సంజనతో యార్కర్ కింగ్ చెప్పుకొచ్చాడు.పెళ్లి తర్వాత జస్ప్రీత్ బుమ్రా, సంజనా గణేశన్‌లు తమతమ పనుల్లో బిజీ అయ్యారు. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ప్రస్తుతం ఇద్దరూ లండన్‌లో ఉన్నారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: India vs newzealand, Jasprit Bumrah, Sanjana Ganesan, WTC Final

  ఉత్తమ కథలు