WTC Final : అయిపాయ్..తొలి WTC టైటిల్ కివీస్ దే..ఆఖరి రోజు చేతులేత్తేసిన కోహ్లీసేన..

Photo Credit : ICC

WTC Final : ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కివీస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఎప్పుట్నుంచో ఊరిస్తోన్న ఐసీసీ టైటిల్ ను మొదటి సారి ముద్దాడింది న్యూజిల్యాండ్ టీమ్. 139 పరుగుల టార్గెట్ ను ఆ జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది.

  • Share this:
    ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కివీస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఎప్పుట్నుంచో ఊరిస్తోన్న ఐసీసీ టైటిల్ ను మొదటి సారి ముద్దాడింది న్యూజిల్యాండ్ టీమ్. 139 పరుగుల టార్గెట్ ను ఆ జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. మొదట్లో తడబడ్డ.. ఆ జట్టు సీనియర్ బ్యాట్స్ మెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ అండతో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ మొదటి టైటిల్ ను ఎగరేసుకుపోయింది. స్వీయ తప్పిదాలతో కోహ్లీసేన భారీ మూల్యం చెల్లించుకుంది. 8 వికెట్ల తేడాతో కోహ్లీసేనను చిత్తు చేసింది. కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. రాస్ టేలర్ అతనికి మంచి సహాకారం అందించాడు. కేన్ విలియమ్సన్ 52 పరుగులతో సత్తా చాటగా.. రాస్ టేలర్ 47 పరుగులతో రాణించాడు. 39 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ ఆదిలో తడబడింది. 44 పరుగులకే కివీస్ ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు. ఈ ఇద్దరి వికెట్లు రవి చంద్రన్ అశ్విన్ కే దక్కాయ్. అయితే, ఆ తర్వాత కేన్ తో కలిసిన సీనియర్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా టీమిండియా బౌలింగ్ ను ఎదుర్కొన్నాడు. అంతకు ముందు, మ్యాచ్ రిజర్వ్ డే అయిన ఆరో రోజు న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 73 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్ 32 పరుగుల ఆధిక్యం తీసేయగా.. కివీస్ ముందు 139 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. భారత ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్(41), రోహిత్ శర్మ(30) టాప్ స్కోరర్లుగా నిలవగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(13), పుజారా(15), రహానే (15), జడేజా(16), అశ్విన్(7) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ నాలుగు, ట్రెంట్ బౌల్ట్ మూడు, కైల్ జెమీసన్ రెండు వికెట్లు తీయగా.. నీల్ వాగ్నర్‌కు ఓ వికెట్ దక్కింది.

    64/2 ఓవర్‌‌‌నైట్ స్కోర్‌తో రిజర్వ్ డే సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో బౌలింగ్ చేసిన జెమీసన్ మరోసారి భారత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. వరుస ఓవర్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(13), చతేశ్వర్ పుజారా(15)ను పెవిలియన్‌కు చేర్చాడు. జెమీసన్ ధాటికి ఓవర్‌నైట్ స్కోర్‌‌కు కోహ్లీ 5 పరుగులే జత చేయగా.. పుజారా ఒక పరుగు మాత్రమే చేసి పేవిలియన్ చేరారు. ఆ వెంటనే పంత్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. జెమీసన్ బౌలింగ్‌లో అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్లిప్‌లో సౌథీ వదిలేశాడు.


    ఈ పరిస్థితులో వైస్ కెప్టెన్ రహానే(15) బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 37 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని బౌల్ట్ వీడదీసాడు. లెగ్ స్టంప్‌కు వేసిన బంతిని ఆడే ప్రయత్నంలో రహానే కీపర్ క్యాచ్ వెనుదిరిగాడు. దాంతో భారత్ 130/5 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత జడేజా(16)ను నీల్ వాగ్నర్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్‌తో పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ట్రెంట్ బౌల్ట్.. ఈ ఇద్దరిని ఓకే ఓవర్‌లో ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు. చివర్లో షమీ(13) మూడు బౌండరీలు బాదడంతో 170 పరుగులు చేయగలిగింది. ఇక దూకుడు కనబర్చిన షమీని, జస్‌ప్రీత్ బుమ్రా(0)ను సౌథీ ఔట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
    Published by:Sridhar Reddy
    First published: