హోమ్ /వార్తలు /క్రీడలు /

WTC Final : కోహ్లీ, పుజారా, రహానే ఔట్.. కష్టాల్లో భారత్..లంచ్ విరామానికి భారత్ స్కోరు వివరాలు..

WTC Final : కోహ్లీ, పుజారా, రహానే ఔట్.. కష్టాల్లో భారత్..లంచ్ విరామానికి భారత్ స్కోరు వివరాలు..

Photo Credit : BCCI

Photo Credit : BCCI

WTC Final : కివీస్ తో జరుగుతున్న మెగా ఫైట్ లో టీమిండియా కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో టీమిండియా సగం జట్టు పెవిలియన్ బాట పట్టింది.

  న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆరో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్లు కోహ్లీ(13), పుజారా(15)లు పరుగు వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. వీరిద్దరిని కైల్‌ జేమీసన్‌ బోల్తా కొట్టించాడు. కోహ్లీ వికెట్‌ కీపర్‌ వాట్లింగ్‌కు క్యాచ్‌ అందించి ఔట్‌ కాగా, పుజారా.. రాస్‌ టేలర్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ బాట పట్టాడు. కైల్ జేమిసన్ మ‌రో సారి త‌న బౌలింగ్ లైన్‌తో టీమిండియాను ఇబ్బంది పెడుతున్నాడు. ఇక, బౌల్ట్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది జోరుమీదున్నట్లు కనిపించిన రహానే 15 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. లెగ్‌ గ్లాన్స్‌ చేసే ప్రయత్నంలో వాట్లింగ్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో 109 పరుగుల స్కోర్‌ వద్ద టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. కివీస్‌ బౌలర్లలో జేమీసన్‌, సౌథీ చెరో రెండు వికెట్లు, బౌల్ట్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. దీంతో లంచ్ విరామానికి ఐదు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.

  అంతకుముందు 64/2 ఓవర్‌‌‌నైట్ స్కోర్‌తో రిజర్వ్ డే సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో బౌలింగ్ చేసిన జెమీసన్ మరోసారి భారత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. అప్పటి వరకు ఇన్‌సైడ్ స్వింగర్స్ వేసి ఒత్తిడి పెంచిన అతను ఆ తర్వాత ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసి ఫలితం రాబట్టాడు. అతను వేసిన 37 ఓవర్ ఐదో బంతికి కోహ్లీ ఔటవ్వగా.. 38వ ఓవర్ మూడో బంతికి పుజారా అదే తరహా ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను ఆడి వెనుదిరిగాడు. ఓవర్‌నైట్ స్కోర్‌‌కు కోహ్లీ 5 పరుగులే జత చేయగా.. పుజారా ఒక పరుగు మాత్రమే చేసి పేలవ షాట్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఫస్ట్ సెషన్ ఫస్ట్ అవర్‌లోనే టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడి నెలకొంది.

  క్రీజులోకి వచ్చిన పంత్ వచ్చి రావడంతోనే తనదైన బౌండరీతో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కానీ అదే జోరులో జెమీసన్ బౌలింగ్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్లిప్‌లో సౌథీ జారవిడచడంతో పంత్‌తో పాటు భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. భారత్ ఆశలన్నీ పంత్, జడేజాపైనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 98 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. 200 + లీడ్ సాధిస్తే భారత్ ఓటమి తప్పించుకుంటుంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: India vs newzealand, Kane Williamson, Ravindra Jadeja, Rishabh Pant, Virat kohli, WTC Final

  ఉత్తమ కథలు