హోమ్ /వార్తలు /క్రీడలు /

Memes on Bumrah : WTC ఫైనల్లో బుమ్రా మిస్ ఫైర్.. ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు..

Memes on Bumrah : WTC ఫైనల్లో బుమ్రా మిస్ ఫైర్.. ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Memes on Bumrah : సోషల్ మీడియాలో నెటిజన్లు భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై రకరకాల మీమ్స్ క్రియేట్ చేసి ఓ ఆటాడుకుంటున్నారు.

ఎన్నో అంచనాల నడుమ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో (WTC Final) తలపడిన భారత్ కు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నెటిజన్లు భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కనీసం ఒక్క వికెట్ కూడా తీయకపోవడంపై ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. సౌథాంప్టన్ టెస్టులో ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి చెరో ఏడు వికెట్లు తీయగా.. బుమ్రా మాత్రం ఎలాంటి వికెట్ తీయలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో బుమ్రా ప్రదర్శనపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్, వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో బుమ్రా ప్రదర్శనను పోలుస్తూ హాస్యాస్పదంగా చలోక్తులు విసురుతున్నారు. దీనికి సంబంధించిన జోక్స్, మీమ్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నోబాల్స్ ఎక్కువగా వేస్తేనే వికెట్లు తీయగలడని ఒకరు పోస్ట్ చేయగా.. ప్రతి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో బుమ్రాకు సహజంగానే ఈ అలవాటు ఉంటుందని ఇంకొకరు స్పందించారు. బుమ్రా సూర్యుడు లాంటి వాడని ఇంగ్లాండ్ లో ప్రకాశించడని వేరొరకు కామెంట్ పెట్టారు.

జెర్సీ కూడా కారణమా?

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఇండియా అని ఆంగ్ల అక్షరాలతో ఉన్న జెర్సీని టీమిండియా ఆటగాళ్లు ధరించారు. బుమ్రా ఈ మ్యాచ్ లో మొదట స్పాన్సర్ పేరున్న జెర్సీని ధరించి బౌలింగ్ వేశాడు. అనంతరం డ్రెస్సింగ్ రూంకి వెళ్లి జెర్సీని మార్చుకొని వచ్చాడు. జెర్సీ మారినప్పటికీ బుమ్రా ప్రదర్శన మాత్రం మారలేదని.. అతడి జెర్సీపై కూడా నెటిజన్లు కామెంట్లు పెట్టారు. నిబంధనల ప్రకారం ఐసీసీ ఈవెంట్లో దేశం పేరు జెర్సీ మధ్యభాగంలో ఉండాలి.

ఇంగ్లాండ్ సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. రిజర్వ్ డే అయిన బుధవారం నాడు 8 వికెట్లు చేతిలో ఉండి 32 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా రెండు సెషన్లు ఆడి మ్యాచ్ ను డ్రా చేసుకుంటుందనుకుంటే.. రెండో సెషన్ మధ్యలోనే ఆలౌట్ అయింది. ఫలితంగా 139 పరుగుల లక్ష్యాన్ని కివీస్ సులభంగా ఛేదించి విజేతగా నిలిచింది. కేన్ విలియమ్సన్(52), రాస్ టేలర్ (47) నిలకడగా ఆడి, కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భారత్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Bcci, India vs newzealand, Jasprit Bumrah, Virat kohli, WTC Final

ఉత్తమ కథలు