హోమ్ /వార్తలు /క్రీడలు /

WTC Final : అభిమానుల ఆశలపై నీళ్లు..తొలి సెషన్ వరుణుడికే..టాస్ ఆలస్యం..

WTC Final : అభిమానుల ఆశలపై నీళ్లు..తొలి సెషన్ వరుణుడికే..టాస్ ఆలస్యం..

WTC Final : అభిమానులు ఎంతగానో చూస్తున్న ఈ మ్యాచ్‌పై వరుణుడు కన్నెర్ర చేశాడు. మ్యాచ్ జరుగుతున్న సౌతాంప్టన్‌లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యలో కొంత విరామం ఇచ్చినప్పటికీ- మళ్లీ మొదలైంది.

  అంతా అనుకున్నట్టే జరిగింది. అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ప్రతిష్టాత్మక వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) తుది సమరానికి భారత్, న్యూజిలాండ్‌ సన్నద్ధమయ్యాయి. శుక్రవారం నుంచి జరిగే ఈ ఫైనల్లో గెలిచిన జట్టు తొలి డబ్ల్యూటీసీ చాంపియన్‌గా నిలుస్తుంది. 2019-21 మధ్య కాలంలో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో సాధించిన పాయింట్లను బట్టి భారత్, కివీస్‌ ఫైనల్‌ చేరాయి. అయితే అభిమానులు ఎంతగానో చూస్తున్న ఈ మ్యాచ్‌పై వరుణుడు కన్నెర్ర చేశాడు. మ్యాచ్ జరుగుతున్న సౌతాంప్టన్‌లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యలో కొంత విరామం ఇచ్చినప్పటికీ- మళ్లీ మొదలైంది. దీంతో ఫస్ట్ డే తొలి సెషన్ ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఫస్ట్ సెషన్ ఆట జరగడం లేదని బీసీసీఐ ట్వీట్ చేసింది. అంతే కాకుండా, ఈ రోజు ఆట సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. సౌతాంప్టన్‌లో ప్రస్తుతం సుమారు అయిదు గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడు తెరపి ఇస్తోన్నప్పటికీ.. మేఘాలు పూర్తిగా తొలగిపోలేదు. గంటకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల ఏజెస్ బౌల్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. బురదమయమైంది. పిచ్‌ డ్యామేజ్ కాకుండా గ్రౌండ్ స్టాఫ్ దాన్ని కప్పి ఉంచారు. ఔట్ ఫీల్డ్‌లో వర్షపు నీళ్లు నిలిచాయి. వర్షం పూర్తిగా తొలగిపోతేనే మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అక్కడి పరిస్థితి చూస్తుంటే ఫస్ట్ డే ఆట జరగడం కష్టంగానే అనిపిస్తోంది. మరోవైపు టాస్ ఆలస్యంగా వేసే సూచనలు కన్పిస్తున్నాయ్.

  మరోవైపు, ఐసీసీపై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ కామెంట్స్, మీమ్స్‌తో ఐసీసీని ట్రోల్స్ చేస్తున్నారు.ఇంగ్లండ్‌లో జరిగిన ప్రతీ ఐసీసీ ఈవెంట్‌కు వర్షం అడ్డుపడుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా ఎదురు చూస్తోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ను వర్షాకాలంలో షెడ్యూల్ చేసినందుకు ఐసీసీకి బుద్ది లేదని భగ్గుమంటోన్నారు. అసలు ఇంగ్లండ్‌లో ఎవడ్రా మ్యాచ్‌లు పెట్టమన్నదని కూడా మండిపడుతున్నారు.

  ఐదు రోజుల్లో ఫలితం తేలకపోతే రిజర్వ్ డే గా ఆరో రోజును కేటాయించింది ఐసీసీ. అయితే, మ్యాచ్ ఆసాంతం వర్షం కురిసే సూచనలు కన్పిస్తున్నాయ్. దీంతో మ్యాచ్ సజావుగా జరగడం అనుమానంగానే కన్పిస్తోంది.

  First published:

  Tags: Bcci, ICC, India vs newzealand, Kane Williamson, Virat kohli, WTC Final

  ఉత్తమ కథలు