హోమ్ /వార్తలు /క్రీడలు /

WTC Final Day 5 : మహ్మద్ షమీ అదుర్స్..కివీస్ బెదుర్స్ ..లంచ్ సమయానికి స్కోరు ఎంతంటే..

WTC Final Day 5 : మహ్మద్ షమీ అదుర్స్..కివీస్ బెదుర్స్ ..లంచ్ సమయానికి స్కోరు ఎంతంటే..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

WTC Final Day 5 : వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ తిరిగి పుంజుకుంటోంది. న్యూజిలాండ్ టీమ్ వరుసగా కీలక వికెట్లను చేజార్చుకుంది.

  వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ తిరిగి పుంజుకుంటోంది. న్యూజిలాండ్ టీమ్ వరుసగా కీలక వికెట్లను చేజార్చుకుంది. మొదటగా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ప్లాన్.. మహమ్మద్ షమీ సూపర్ బౌలింగ్.. శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో టీమిండియా ఎట్టకేలకు రాస్ టేలర్(11) వికెట్ సాధించింది. 101/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్‌పై భారత్ బౌలర్లు ఎదురు దాడికి దిగారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందుకుంటు ఇబ్బంది పెట్టారు. బుమ్రా, షమీ, ఇషాంత్ ఇలా ముగ్గురు ప్రత్యర్థికి పరుగులివ్వకుండా కట్టడి చేశారు. ఇక, ఆ తర్వాత హెన్రీ నికోలస్ వికెట్ ను ఇషాంత్ దక్కించుకోగా..మరో అద్భుత డెలివరీతో వాట్లింగ్ వికెట్ తీసి..కివీస్ ను దెబ్బ కొట్టాడు మహ్మద్ షమీ. 101/2 ఓవర్ నైట్ స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ సైతం ధీటుగా ఎదుర్కొన్నారు. పక్కా వ్యూహంతో పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమయ్యారు. దాదాపు 13 ఓవర్ల పాటు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ విసుగుతెప్పించారు. 13 ఓవర్లలో న్యూజిలాండ్ చేసింది కేవలం 16 పరుగులు మాత్రమే అంటే వారి బ్యాటింగ్ ఎంత జిడ్డుగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 117/2 డ్రింక్ బ్రేక్‌ తీసుకోగా.. ఈ విరామం భారత్‌కు కలిసొచ్చింది.

  ఈ బ్రేక్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మహమ్మద్ షమీకి బంతినందిస్తూ కొన్ని సూచనలు చేశాడు. అటాకింగ్ ఫీల్డింగ్‌తో పాటు షాట్ ఆడేలా బంతి వేయాలని చెప్పాడు. ఇక కోహ్లీ చెప్పినట్లుగానే బాల్ వేసిన షమీ.. శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్‌తో వికెట్ రాబట్టి భారత శిభిరంలో ఉత్సాహాన్ని నింపాడు. అతను వేసిన 64 ఓవర్ తొలి బంతిని ఫుల్లర్‌గా వేయగా.. రాస్ టేలర్ కవర్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్‌కు కనెక్ట్ అయినా.. షార్ట్ కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ సూపర్ డైవ్‌తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇషాంత్ బౌలింగ్ లో హెన్రీ నికోలస్.. డ్రైవ్ ఆడబోయి రోహిత్ శర్మ చేతికి చిక్కాడు. రోహిత్ కూడా అద్భుత క్యాచ్ అందుకున్నాడు.

  ఆ తర్వాత మహ్మద్ షమీ..అద్భుత ఔట్ స్వింగర్ తో విజే వాట్లింగ్ వికెట్ ను తీసి..భారత శిబిరంలో ఆనందం నింపాడు. దీంతో ఐదో రోజు లంచ్ సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్, కొలిన్ డి గ్రాండ్ హోమ్ ఉన్నారు. కేన్ విలియమ్సన్ తన రాక్ సాలిడ్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. విలియమ్సన్ వికెట్ తీస్తే..టీమిండియా మ్యాచ్ మీద పట్టు నిలుపుకోవచ్చు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: India vs newzealand, Kane Williamson, Mohammed Shami, Virat kohli, WTC Final

  ఉత్తమ కథలు