హోమ్ /వార్తలు /క్రీడలు /

WTC Final: బౌన్సర్ ఆడలేక కింద పడ్డ విరాట్ కోహ్లీ..పంత్ సిక్సర్ల వర్షం..వైరల్ వీడియో..

WTC Final: బౌన్సర్ ఆడలేక కింద పడ్డ విరాట్ కోహ్లీ..పంత్ సిక్సర్ల వర్షం..వైరల్ వీడియో..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

WTC Final: టెస్ట్ క్రికెట్‌లో ఇరు జట్ల ముఖా ముఖి పోరు రికార్డులు గమనిస్తే కోహ్లీసేనదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 59 మ్యాచ్‌లు ఆడగా.. టీమిండియా 21 విజయాలు సాధించింది. న్యూజిలాండ్ 12 మ్యాచ్‌ల్లో గెలవగా.. 26 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

ఇంకా చదవండి ...

  ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా ఫైట్ నేపథ్యంలో టీమిండియా ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అనంతరం కొత్త జోష్‌తో కనిపిస్తుంది. టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో టీమిండియా తమ ప్రాక్టీస్‌ను మరింత పెంచింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌, అజింక్య రహానే నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చారు. దీనికి సంబంధించి బీసీసీఐ మంగళవారం ట్విటర్‌లో వీడియో రిలీజ్‌ చేసింది. ఈ వీడియోలో మొదట కోహ్లి తన క్లాసిక్‌ షాట్లను ఆడాడు. కవర్‌ డ్రైవ్‌, స్క్వేర్‌కట్‌లతో మురిపించిన కోహ్లి ఆ తర్వాత బౌన్సర్‌ ఆడడంలో విఫలమయ్యాడు. బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో పట్టుతప్పి కిందపడిపోయాడు. అనంతరం ప్రాక్టీస్‌కు వచ్చిన రిషబ్‌ పంత్‌ షమీ, ఇషాంత్‌లను ఎదుర్కొని భారీ షాట్లతో రెచ్చిపోయాడు. అనంతరం రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇక టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే కూడా ఇషాంత్‌, షమీ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ కళాత్మక షాట్లతో ఆకట్టుకున్నాడు.అంతకముందు జరిగిన ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌లో పంత్‌, శుబ్‌మన్‌ గిల్‌, జడేజా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్‌లు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పంత్‌ శతకంతో తన ఫామ్‌ను నిరూపించగా.. జడేజా,గిల్‌లు అర్థ శతకాలతో రాణించారు.

  ఇక, బౌలింగ్‌లో ఇషాంత్‌ 3 వికెట్లతో రాణించాడు. సౌతాంప్టన్‌ వేదికగా జూన్‌ 18 నుంచి 22 వరకు ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకొని జోరు మీద ఉంది. మరోవైపు , డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రూపొందించే పిచ్​ పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుందని ఏజెస్​ బౌల్​ క్యూరేటర్​ సైమన్​ లీ చెప్పడంతో టీమిండియా ఆ దిశగా ప్రిపేర్ అవుతోంది. న్యూజిలాండ్‌లో పొడగరి బౌలర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు బౌన్స్, షార్ట్ పిచ్ బంతులను ప్రాక్టీస్ చేస్తున్నారు టీమిండియా ఆటగాళ్లు.

  ముఖ్యంగా కోహ్లీ షార్ట్ పిచ్ బంతులపై దృష్టి పెట్టినట్లు కన్పిస్తోంది. గతేడాది న్యూజిలాండ్ పర్యటనలో కైల్ జెమీసన్ బౌలింగ్‌లో తడబడ్డ కోహ్లీ.. ఆ సమస్యను అధిగమించేందుకు సిద్దమవుతున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ భారత్ గెలవాలంటే.. విరాట్ కోహ్లీ రాణించడం చాలా ముఖ్యం. టెస్ట్ క్రికెట్‌లో ఇరు జట్ల ముఖా ముఖి పోరు రికార్డులు గమనిస్తే కోహ్లీసేనదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 59 మ్యాచ్‌లు ఆడగా.. టీమిండియా 21 విజయాలు సాధించింది. న్యూజిలాండ్ 12 మ్యాచ్‌ల్లో గెలవగా.. 26 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Bcci, India vs newzealand, Rishabh Pant, Virat kohli, WTC Final

  ఉత్తమ కథలు