హోమ్ /వార్తలు /క్రీడలు /

WTC 2021-23: ఇంగ్లండ్ సిరీస్ తో ప్రారంభం..టీమిండియా షెడ్యూల్ ఇదే..

WTC 2021-23: ఇంగ్లండ్ సిరీస్ తో ప్రారంభం..టీమిండియా షెడ్యూల్ ఇదే..

Team India

Team India

WTC 2021-23 : వచ్చే రెండేళ్ల పాటు జరిగే సెకండ్ ఎడిషన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌(2021-23) పోటీలకు టీమిండియా షెడ్యూల్‌ ఖరారైంది. గతంలో మాదిరే ఈసారి కూడా మూడు విదేశీ పర్యటనలు, మూడు స్వదేశీ సిరీస్‌లు ఉండనున్నాయి.

  వచ్చే రెండేళ్ల పాటు జరిగే సెకండ్ ఎడిషన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌(2021-23) పోటీలకు టీమిండియా షెడ్యూల్‌ ఖరారైంది. గతంలో మాదిరే ఈసారి కూడా మూడు విదేశీ పర్యటనలు, మూడు స్వదేశీ సిరీస్‌లు ఉండనున్నాయి. అయితే దీన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 144 ఏళ్ల టెస్ట్ చరిత్రలో తొలిసారి ఐసీసీ నిర్వహించిన ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను టీమిండియా తృటిలో చేజార్చుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మెగా ఫైనల్లో చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో 8 వికెట్ల తేడాతో ఓడి రన్నరప్‌గా నిలిచింది. రెండేళ్లపాటు జరిగిన ఈ మెగా టోర్నీలో ఆసాంతరం అదరగొట్టిన కోహ్లీసేన.. కీలక ఫైనల్లో మాత్రం తడబడింది. విలియమ్సన్ సేన అసాధారణ ప్రదర్శన ముందు చేతులేత్తేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఆతిథ్య జట్టుతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. అయితే, మరో రెండేళ్ల పాటు జరిగే సెకండ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఇదే తొలిసిరీస్‌ కావడం విశేషం. ఈ సిరీస్ కోసం టీమిండియా అన్ని విధాలుగా సమాయత్తం కానుంది. ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్న ఆటగాళ్లు.. బయో బబుల్ వీడి ఇంగ్లండ్ పరిసరాలను ఆస్వాదించనున్నారు. జూలై రెండో వారంలో మళ్లీ బయో బబుల్‌లో చేరి ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు సిద్దం కానున్నారు.

  టీమిండియా 2021-23 WTC షెడ్యూల్‌ :

  ఇండియా టూర్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ 2021 :

  ఆగ‌స్ట్ 4-8 తొలి టెస్ట్‌, ఆగ‌స్ట్ 12-16 రెండో టెస్ట్‌, ఆగ‌స్ట్ 25-29 మూడో టెస్ట్, సెప్టెంబ‌ర్ 2-6 నాలుగో టెస్ట్‌, సెప్టెంబ‌ర్ 10-14 ఐదో టెస్ట్‌.

  న్యూజిలాండ్ టూర్ ఆఫ్‌ ఇండియా 2021 :

  తొలి డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్ ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో భారత్‌కు రానుంది. విలియమ్సన్‌ సేన రెండు టెస్ట్‌ల సిరీస్‌ కోసం భారత్‌కు రానుంది.

  ఇండియా టూర్ ఆఫ్‌ సౌతాఫ్రికా 2021-22

  భారత్‌ ఇప్ప‌టి వ‌ర‌కు టెస్ట్ సిరీస్ గెల‌వ‌ని దేశం ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే. ఈసారి ఆ ముచ్చ‌ట కూడా తీర్చుకునే అవ‌కాశం టీమిండియాకు దక్కనుంది. మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత్‌ ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. టెస్ట్ చాంపియన్‌షిప్‌ పోటీల్లో భాగంగా అక్కడ డిసెంబర్‌-జనవరి నెలల్లో మూడు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ తేదీలు కూడా ఇంకా ప్రకటించలేదు.

  శ్రీలంక టూర్ ఆఫ్‌ ఇండియా 2022

  ఐపీఎల్‌ 15వ సీజన్‌కు ముందు శ్రీలంక భారత పర్యటనకు రానుంది. 2022 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇరు జట్లూ మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి.

  ఆస్ట్రేలియా టూర్‌ ఆఫ్‌ ఇండియా 2022

  2022 అక్టోబ‌ర్‌-న‌వంబ‌ర్‌ నెలల్లో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ నిమిత్తం ఆస్ట్రేలియా భారత్‌కు రానుంది. బోర్డర్ గ్రావస్కర్ ట్రోఫిలో భాగంగా ఇరు జట్లు నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనున్నాయ్.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: India vs australia, India vs bangladesh, India vs england, India vs newzealand, India vs South Africa, Team India, WTC Final