ఏం పట్టాడ్రా ఆ క్యాచ్... వృద్ధిమాన్ సాహాకు సాహో...

Wriddhiman Saha catch video : పుణెలో ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్ నాలుగో రోజున... ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో... డిబ్రుయిన్ బంతిని... వెనక్కు పంపగా... వృద్ధిమాన్ సాహా లెఫ్ట్ వైపునకు మెరుపులా ఎగిరి... సింగిల్ హ్యాండ్‌తో బంతిని పట్టుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

news18-telugu
Updated: October 14, 2019, 9:53 AM IST
ఏం పట్టాడ్రా ఆ క్యాచ్... వృద్ధిమాన్ సాహాకు సాహో...
వృద్ధిమాన్ సాహా (credit - Twitter - HAFEEZ PARDESI)
  • Share this:
Wriddhiman Saha catch video : ఇండియా, సౌతాఫ్రికా టెస్టుల్లో వృద్దిమాన్ సాహా... గాయం కారణంగా... బ్యాటింగ్ చేసే ఛాన్స్ దక్కించుకోలేకపోయినా... ఆటలో తన మార్క్ మాత్రం చూపించాడు. పుణెలో రెండో టెస్ట్ మ్యాచ్‌లో స్టంప్స్ వెనక అద్వితీయమైన ఆట తీరును చూపించాడు. పుణె టెస్టులో మూడో రోజు... బ్రిలియంట్ డైవింగ్ క్యాచ్ పట్టుకున్న సాహా... నాలుగో రోజు లెగ్ సైడ్‌లో అద్భుతమైన డైవింగ్ చేశాడు. మొదట.. ఉమేష్‌ బౌలింగ్‌లో డిబ్రుయిన్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఎడమవైపు ఇంతెత్తున గాల్లోకి ఎగిరి పట్టుకొన్నాడు సాహా. అలాగే అశ్విన్‌ వేసిన బంతి సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ ప్యాడ్‌ను టచ్ చేస్తూ వెళ్లగా.... సాహా క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. రెండోసారీ ప్రయత్నించి ఫెయిలయ్యాడు. మూడోసారీ వీలు కాలేదు. నాలుగోసారి మాత్రం ముందుకు డైవ్‌ చేసి పట్టేశాడు.


ఉమేష్‌ యాదవ్ బౌలింగ్‌లో ఫిలాండర్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఎడమవైపు గాల్లో ఎగిరి పట్టుకున్న తీరు ప్రేక్షకుల హృదయాల్ని టచ్ చేసింది. మూడోరోజు ఆటలో ఉమేష్‌ బౌలింగ్‌లో డిబ్రుయిన్‌ బ్యాట్‌ను తాకుతూ వచ్చిన బంతిని కుడివైపు ఎగిరి సాహా అందుకున్న క్యాచ్‌ మర్చిపోలేనిది. ఇలా... సాహా తనకు ఇచ్చిన ఛాన్స్‌ని చక్కగా ఉపయోగించుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్న మాటల్ని నిజం చేశాడు సాహా. ప్రపంచంలో బెస్ట్ కీపర్ సాహా అని విరాట్ మ్యాచ్‌కి ముందే మెచ్చుకున్నాడు. ఇలా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని సాహా నిలబెట్టుకున్నాడు. ముఖ్యంగా స్టంప్స్ వెనక మెరుపులా కదులుతూ... ఆ ప్లేస్‌లో తనే బెస్ట్ అని నిరూపించుకున్నాడు.

క్రిక్ విజ్ ఎనాలసిస్ ప్రకారం... మూడేళ్లుగా వృద్ధిమాన్ సాహా ఫేస్ బౌలర్లను ఎదుర్కోవడంలో 96.9 శాతం సమర్థంగా ఆడాడు. 2017 నుంచీ 10 కంటే ఎక్కువ క్యాచ్‌లతో మిగతా కీపర్ల కంటే మెరుగ్గా ఉన్నాడు. సాహా తర్వాతి స్థానంలో శ్రీలంక ఆటగాడు నిర్సోహాన్ డిక్వెల్లా... 95.5 శాతం సక్సెస్ రేటుతో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్సౌ (95.2 శాతం) నిలిచాడు. రిషబ్ పత్... సక్సెస్ రేటు 91.6 శాతంగా ఉంది. అతని కంటే బంగ్లాదేశ్‌కి చెందిన లిటన్ దాస్, వెస్టిండీస్‌ ప్లేయర్ షేన్ డౌరిచ్ అతన్ని బీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


Pics : క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న సుష్మరాజ్ఇవి కూడా చదవండి :

తాగొచ్చిన భర్తను చావగొట్టిన భార్య... ఆ తర్వాత...

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ... దాదాపు ఖరారు

ఏపీలో 1,448 ఆలయాల్లో పాలక మండళ్ల భర్తీ... నోటిఫికేషన్లు జారీ

ఉత్తమ్‌‌కుమార్‌కి ఉద్వాసన... హుజూర్‌నగర్ ఎన్నిక తర్వాతే ముహూర్తం

ఇంకెంతమంది చనిపోవాలి... సీఎం కేసీఆర్‌పై భగ్గుమంటున్న ఆర్టీసీ కార్మికులు
Published by: Krishna Kumar N
First published: October 14, 2019, 9:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading