ఏవో ప్రెడిక్షన్ టేబుల్స్ వేసుకోని కాలం గడపడం ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు ప్రతీ ఏడాది మోస్ట్ కమాన్ థింగ్‌గా మారిపోయింది.. ప్రతీసారీ కప్ కొట్టాలని భావించడం... చివరకు బోల్తా పడడం.. అభిమానులు నెక్ట్స్ సాలా కప్ నమదే అని ఫిల్ అవ్వడం గత 15సంవత్సరాలుగా పురుషుల ఐపీఎల్‌లో చూస్తూనే ఉన్నాం కదా.. ఇప్పుడు మహిళల ఆర్‌సీబీ తలరాత కూడా అంతేనని అర్థమయ్యింది.. తొలిసారి జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీ ప్లే ఆఫ్‌కు కూడా చేరలేకపోయింది..3 వికెట్ల తేడాతో గుజరాత్‌పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన యూపీ.. అటు బెంగళూరుతో పాటు, ఇటు జెయింట్స్‌ను ఇంటికి పంపించేసింది. ఈ మ్యాచ్ విజయంతో యూపీ వారియర్స్ విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ప్లేఆఫ్‌కు దూసుకెళ్లింది.
జెయింట్స్, ఆర్‌సీబీ ఖేల్‌ఖతం:
బ్రాబౌర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 178పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. హేమలత(57), గార్డినర్(60) అర్ధసెంచరీలతో రాణించారు. గైక్వాడ్, పార్శవి చోప్రాకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో యూపీ వారియర్స్ జట్టు 19.5ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 181పరుగులు చేసి విజయం సాధించింది. మెక్‌గ్రాత్(57), హర్రీస్(72)కి తోడు ఎక్లేస్టోన్(19) బ్యాటింగ్‌లో రాణించారు. కిమ్ గరాత్‌కు రెండు, మోనిక, గార్డినర్, కన్వర్, రాణాకు ఒక్కో వికెట్ దక్కాయి. ఈ ఓటమితో గుజరాత్ ప్లే ఆఫ్ ఆశలు దారులు మూసుకుపోయాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గ్రేస్ హర్రీస్‌కు లభించింది. 8పాయింట్లతో మూడోస్థానంలో నిలిచిన యూపీ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే-ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
ముంబైకి ఢిల్లీ షాక్:
లీగ్ ఆరంభంలో వరుసగా ఐదు విజయాలతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన ముంబై ఇండియన్స్.. వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం మూటగట్టుకుంది. టేబుల్ టాప్ కోసం జరిగిన పోరులో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. పూజ వస్ర్తాకర్ (26), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (23), వాంగ్ (23) తలా కొన్ని పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో మరినె కాప్, శిఖ పాండే, జెస్ జాన్సన్ తలా రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే లీగ్‌లో తన ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న భారత యువ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌లతో కట్టిపడేసింది. తర్వాత లక్ష్యఛేదనలో ఢిల్లీ 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 110 రన్స్ చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (32 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), షఫాలీ వర్మ (33; 6 ఫోర్లు, ఒక సిక్సర్), అలీసా కాప్సీ (38 నాటౌట్; ఒక ఫోర్, 5 సిక్సర్లు) దంచికొట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat Giants, IPL 2023, Mumbai Indians, RCB, WPL 2023