WPL 2023 : దేశంలో మహిళల క్రికెట్ కు మరింత ప్రాచూర్యం కలిగించే ఉద్దేశంతో ఈ ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI) సిద్దమైంది. దీనికి వుమెన్ ప్రీమియర్ లీగ్ (Women Premier Legue) అని కూడా నామకరణం చేసింది. మొత్తం 5 జట్లు ఈ లీగ్ లో ఉంటాయి. ఇందుకు సంబంధించిన ఐదు టీమ్స్ ను కూడా బీసీసీఐ ఇప్పటికే ప్రకటించేసింది. అహ్మదాబాద్, ముంబై, బెంళూరు, ఢిల్లీ, లక్నో జట్లు మహిళల ఐపీఎల్ లో పాల్గొననున్నాయి. జట్లను ప్రకటించడంతో ఇప్పుడు ప్లేయర్ల వేలంపై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్లేయర్లను ఫిబ్రవరి 13 న వేలం నిర్వహించనున్నారు.
వేలం రూల్స్ ఇవే
ఐదు జట్లకు కూడా రూ. 12 కోట్ల మనీ పర్సు ఉంటుంది. అంటే వేలంలో ప్రతి జట్టు కూడా రూ. 12 కోట్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. పురుషుల వేలంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇక ప్రతి జట్టు కూడా వేలంలో 15 మందికి తగ్గకుండా 18 మందికి మించకుండా ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం రూ. 12 కోట్ల వరకు ఖర్చు పెట్టవచ్చు. క్యాప్డ్ ప్లేయర్స్ ను మూడు కేటగిరీలుగా విభజించారు. రూ. 50 లక్షలు, రూ. 40 లక్షలు, రూ. 30 లక్షలుగా కనీస ధరను నిర్ణయించారు. ఇక అన్ క్యాప్డ్ జాబితాను రెండు బేస్ ప్రైజ్ లు గా విభజించారు. రూ. 20, రూ. 10 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.
ఫార్మాట్
మహిళల తొలి ఎడిషన్ మార్చి మొదటి వారంలో ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఐదు జట్లు కూడా గ్రూప్ దశలో ఒక జట్టు మిగిలిన నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్ లను ఆడే అవకాశం ఉంది. అనంతరం లీగ్ టాపర్ నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. 2, 3 స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫయర్ మ్యాచ్ ను ఆడే అవకాశం ఉంది. క్వాలిఫయర్ లో నెగ్గిన మ్యాచ్ ఫైనల్లో లీగ్ టాపర్ తో టైటిల్ కోసం పోటీ పడుతుంది. వేలం పూర్తయ్యాక బీసీసీఐ వుమెన్ ప్రీమియర్ లీగ్ కు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది.
బీసీసీఐకి భారీ ఆదాయం
వుమెన్ ప్రీమియర్ లీగ్ లో ఫ్రాంచైజీల కోసం జనవరి 23 వరకు బీసీసీఐ బిడ్లను ఆహ్వానించింది. ఈ క్రమంలో బడా వ్యాపారవేత్తలు వుమెన్ ఐపీఎల్ కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఐదు ఫ్రాంచైజీలకు కలిపి బీసీసీఐకి దాదాపుగా 4,669.99 కోట్లు ఆదాయం లభించింది.అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ. 1,289 కోట్లకు ఆదానీ స్పోర్ట్స్ లైన్ సొంతం చేసుకుంది. ముంబై జట్టును రిలయన్స్ కు చెందిన ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.912.99 కోట్లు వెచ్చించింది. బెంగళూరును రూ.901 కోట్లకు రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్.. ఢిల్లీ జట్టును రూ.810 కోట్లకు జేఎస్ డబ్ల్యూ, జీఎంఆర్ సంస్థ.. లక్నో జట్టును రూ. 757 కోట్లకు క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ సొంతం చేసుకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ahmedabad, Bengaluru, IPL, Lucknow, Mumbai Indians, Royal Challengers Bangalore, Smriti Mandhana, WPL 2023