RCB vs DC Live Scores : లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ (Shafali Verma) రెచ్చిపోయింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరుగుతోన్న పోరులో షఫాలీ వర్మ ఫటాఫట్ ఇన్నింగ్స్ తో బౌలర్లను ఒక ఆట ఆడుకుంది. కేవలం 45 బంతుల్లోనే 84 పరుగులు చేసింది. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. ఈమెకు తోడు కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు) అర్ధ సెంచరీతో మెరిసింది. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన స్మృతి మంధాన ప్రత్యర్థిని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పిచ్ పై ఉన్న గ్రాస్ ను సద్వినియోగం చేసుకోవాలనే యోచనలో స్మృతి మంధాన ఈ పని చేసింది. అయితే అది ఎంత పెద్ద తప్పో తెలిసేందుకు ఆమెకు ఎంతోసేపు పట్టలేదు. ఆస్ట్రేలియాకు మిడిలార్డర్ లో ఆడే మెగ్ ల్యానింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు మాత్రం ఓపెనర్ గా వచ్చింది. షఫాలీ వర్మతో కలిసి జట్టుకు శుభారంభం చేసింది. వీరిద్దరూ ఎటువంటి తడబాడు లేకుండా పరుగులు సాధించారు. ఈ క్రమంలో ఇరువురు కూడా అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. వీరు తొలి వికెట్ కు రికార్డు స్థాయిలో 162 పరుగులు జోడించారు. పరుగు తేడాతో వీరిద్దరూ పెవిలియన్ కు చేరారు. అనంతరం మరిజానె క్యాప్ (17 బంతుల్లో39 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగ్స్ (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) ఢిల్లీకి సూపర్ ఫినిష్ ఇచ్చారు. వీరిద్దరూ అజేయమైన మూడో వికెట్ కు 70 పరుగులు జోడించడం విశేషం.
ఇటీవలె ముగిసిన మహిళల టి20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాను ప్రపంచ చాంపియన్ గా నిలిపిన ఘనత మెగ్ ల్యానింగ్ ది. కెప్టెన్సీ విషయంలో అనుభవం ఉన్న ప్లేయర్ ఢిల్లీ సొంతం. ఈ మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఢిల్లీ తరఫున తెలంగాణ అమ్మాయి అరుంధతి రెడ్డి బరిలోకి దిగనుంది.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్
మెగ్ ల్యానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానె క్యాప్, జెమీమా రోడ్రిగ్స్, అలైస్ క్యాస్పీ, జెస్ జొనాసెన్, తానియా భాటియా, అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్, టారా నోరిస్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, దిషా కసత్, ఎలీస్ పెర్రీ, రిచా ఘోష్, హీథర్ నైట్, కనిక అహుజ, ఆశా, మేగాన్ షుట్, రేణుక సింగ్, ప్రీతి బోస్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, Royal Challengers Bangalore, Smriti Mandhana, WPL 2023