(బాలకృష్ణ,న్యూస్18 తెలుగు, హైదరాబాద్)
మహిళల ప్రీమియర్ లీగ్ (Women Premier League) వేలంలో తెలుగు అమ్మాయిలు మెరిశారు. సోమవారం జరిగిన వేలంలో హైదరాబాద్ (Hyderabad) క్రికెటర్లు ఎస్ యశశ్రీ (Yashasri), అరుంధతి రెడ్డి (Arundhati Reddy)కు వేలంలో మంచి ధర దక్కింది. అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా సభ్యురాలు యశశ్రీని.. యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. టి 20 ప్రపంచ కప్‌లలో జాతీయ జట్టులో భాగమైన క్రికెటర్ అరుంధతిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. మొదటి రౌండ్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన అరుంధతిని.. రెండో రౌండ్‌లో రూ. 30 లక్షలకు క్యాపిటల్స్ దక్కించుకుంది. ఢిల్లీ జట్టులో స్థానం దక్కినందుకు ఆనందంగా ఉందని అరుంధతి తెలిపారు.
'' మొదట నేను చాలా భయాందోళనకు గురయ్యాను. మొదటిసారి నన్ను తీసుకోనప్పుడు కలత చెందాను. రెండేళ్ల పాటు భారత జట్టుకు దూరమైన నాకు మరో అవకాశం వస్తుందని అనుకోలేదు. వేలం ఎలా జరుగుతుందో నాకు ఖచ్చితంగా తెలియదు. దేవుడి దయవల్ల నేను ఎంపికయ్యాను. చాలా సంతోషంగా ఉంది. '' అని అరుంధతి పేర్కొన్నారు.
25 ఏళ్ల ఈ యువతికి భారత్ తరఫున 26 టీ20లు ఆడిన అనుభవం ఉంది. WPL ద్వారా భారత జట్టులోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తారా? అని అడిగినప్పుడు ఆమె ఇలా చెప్పారు. ఏదైనా జట్టు కోసం ఆడే అవకాశం దొరికినప్పుడల్లా.. నేను బాగా ఆటడంపైనే దృష్టి పెడుతానని తెలిపారు. ఉమెన్ ప్రీమియర్ లీగ్.. భారత మహిళల క్రికెట్‌లో గేమ్ ఛేంజర్‌గా మారుతుందని అరుంధతి అభిప్రాయపడ్డారు. తిరిగి భారత జట్టులోకి వచ్చేందుకు కష్టపడతానని చెప్పారు.
19 ఏళ్ల యశశ్రీని వేలంలో దక్కించుకుంటారని కూడా అనుకోలేదు. వేలం మొదటి రౌండ్‌లో అమ్ముడుపోకపోవడంతో... యశశ్రీ జిమ్ సెషన్‌కు వెళ్లిందని ఆమె తల్లి చెప్పారు. కానీ సెకండ్ రైండ్‌లో యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. ఈ విషయం యశశ్రీకి తెలియదని.. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తోందని ఆమె తల్లి పేర్కొన్నారు. కానీ రెండో రౌండ్లో సెలెక్ట్ అయిన విషయం తెలిసి.. ఎంతో సంతోషపడిందని తెలిపారు.
Sania Mirza : టెన్నిస్ టు క్రికెట్.. RCB లోకి సానియా మీర్జా.. ఆ ఇద్దరు కలిస్తే రచ్చ రచ్చే!
'' WPLలో ఎంపిక అవుతానని ఆశించలేదు. కాబట్టి వేలం గురించి నేను భయపడలేదు. కానీ ఆ వార్త తెలియగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. జిమ్‌లో ఉండటం వల్ల, అందరి ముందు నా భావాన్ని చెప్పలేకపోయాను. కానీ లోపల చాలా గొప్పగా ఫీలయ్యాను. మన జట్టులోని మేటి క్రీడాకారిణులు, ఇతర దేశాల క్రికెటర్స్‌తో ఆడే అవకాశం వచ్చిందని.. వారి ద్వారా మరింత ఎక్కువ నేర్చుకుంటాను. అవకాశం దొరికినప్పుడల్లా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తా. మెరుగైన ఆటతీరు కనబరిచేందుకు మరింత కష్టపడతా. '' అని యశశ్రీ తెలిపారు.
అరుంధతి రెడ్డి, యశశ్రీకి ఇది చక్కటి అవకాశమన.. క్రికెట్‌లో మరింతగా ఉన్నత స్థానానిక ఈ టోర్నీ దోహదం చేస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. WPLలో కనబరిచే ఆట ఆదారంగా వారి భవిష్యత్ ఉండనుందని తెలిపారు. కాగా, అండర్-19 ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన చేసిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషని మాత్రం ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. 17 ఏళ్ల త్రిష.. తొలి అండర్ 19 టీ20 ప్రపంచకప్‌లో 7 మ్యాచ్‌ల్లో 116 పరుగులు చేసింది. అందులో స్కాట్లాండ్‌పై హాష్ సెంచరీ కూడా కొట్టింది. అవకాశం వచ్చిన ప్రతిసారి సత్తాచాటింది. కానీ రూ.10 లక్షల బేస్ ప్రైజ్‌కు తీసుకునేందుకు కూడా ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడం.. ఆశ్చర్యం కలిగించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Sports, Telangana