ఈ డ్యాన్సర్స్‌కు పేరు పెట్టండి

Rekulapally Saichand
Updated: July 10, 2020, 2:41 PM IST
ఈ డ్యాన్సర్స్‌కు పేరు పెట్టండి
ముత్తయ్య మురళీధరన్(File Photo)
  • Share this:
ఇనాళ్ళు టిక్ టాక్‌తో అభిమానులను అలరించిన అస్ట్రేలియా బాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు దాన్ని బ్యాన్ చేయడంతో మరో మార్గా్న్ని ఎంచుకున్నారు. తాజాగా సన్‌రైజ్ ఆటగాళ్ళు డాన్స్‌లు చేస్తున్న వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో శ్రీలంక మాజీ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌, భారత్ జట్టు ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌లు సరాదగా డ్యాన్స్‌ చేశారు. 'ఈ ఇద్దరు డాన్సర్‌లకు పేరు పెట్టండి’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు వార్నర్

 
 

View this post on Instagram
 

Name these two dancers???? #throwback @sunrisershyd


A post shared by David Warner (@davidwarner31) on


అయితే ఈ వీడియోపై సరదాగా కామెంట్ చేశారు యువరాజ్‌ సింగ్‌. నాకు ఆశిష్‌ నెహ్రా డ్యాన్స్‌ కావాలి’ అంటూ చమత్కరించారు. సమయం దొరికినప్పుడల్లా సామాజిక మాధ్యమాల్లో తమదైన హాస్యంతో అలరించే యువీ ఈ సారి వార్నర్ వీడియోపై స్పందించారు. నెహ్రాను సరదాగా టీజ్‌ చేస్తూ ఆట పట్టించాడు. ఇక వార్నర్ లాక్‌డౌన్‌లో ఫ్యామీలితో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోలను తరచూ టిక్ టాక్‌లో పోస్ట్ చేస్తుండేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా టిక్ టాక్‌తో పాటు 59 చైనా యాప్స్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు వార్నర్ ఇన్‌స్ట్రాగామ్ ఎంచుకున్నారు.
Published by: Rekulapally Saichand
First published: July 10, 2020, 2:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading