• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • WORLD TEST CHAMPIONSHIP FINAL MOVED FROM LORDS TO SOUTHAMPTON SAYS SOURAV GANGULY BA

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వేదిక మారింది.. కొత్త స్టేడియం కన్ ఫాం చేసిన గంగూలీ

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వేదిక మారింది.. కొత్త స్టేడియం కన్ ఫాం చేసిన గంగూలీ

సౌరవ్ గంగూలీ (ఫైల్ ఫోటో)

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వేదిక మారింది. న్యూజిలాండ్ తో భారత్ తలపడే మ్యాచ్ వేదిక లార్డ్స్ నుంచి మారింది. సౌతాంప్టన్‌లోని ఏజిల్ బౌల్ స్టేడియంకు వేదిక మార్చినట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధ్రువీకరించారు.

  • Share this:
    ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వేదిక మారింది. న్యూజిలాండ్ తో భారత్ తలపడే మ్యాచ్ వేదిక లార్డ్స్ నుంచి మారింది. సౌతాంప్టన్‌లోని ఏజిల్ బౌల్ స్టేడియంకు వేదిక మార్చినట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధ్రువీకరించారు. ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 మధ్య భారత్ - న్యూజిలాండ్ తలపడనున్నాయి. మొదట ఈ మ్యాచ్ లార్డ్స్ మైదానంలో నిర్వహించాలని భావించారు. అయితే, సౌతాంప్టన్‌ స్టేడియంలో ఫైవ్ స్టార్ సౌకర్యాలు ఉన్నాయని, ఆటగాళ్ల బయో బబుల్ కోసం అనువైనదిగా గుర్తించారు. దీని వల్ల అటు ఐసీసీ, ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుకు కూడా లాభదాయకంగా ఉండడంతో సౌతాంప్టన్ స్టేడియంను ఓకే చేశారు. ‘ఔను. ఫైనల్స్ సౌతాంప్టన్‌లో జరుగుతుంది.’ అని గంగూలీ పీటీఐ వార్తా సంస్థకు ధ్రువీకరించారు.

    ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ జయభేరి మోగించింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-1తో గెలుచుకుంది. మొదటి టెస్టులో ఓడిపోయినా కూడా మిగిలిన మూడు టెస్టుల్లోనూ వరుసగా విజయాలు నమోదు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లను బెంబేలెత్తించింది.

    ఈ మ్యాచ్ చూసేందుకు గంగూలీ కూడా యూకే వెళ్లనున్నారు. ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ చూడడానికి నేను కూడా వెళ్తా. మనం న్యూజిలాండ్‌ను ఓడిస్తామని అనుకుంటున్నా. కివీస్ మన కంటే ముందే వస్తుంది. ఇంగ్లండ్ తో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది.’ అని గంగూలీ చెప్పారు. సౌతాంప్టన్ పిచ్ బాగా స్లోగా ఉంటుంది. దీనిపై ఇండియన్ ప్లేయర్లు ఎలా ఆడతారో చూడాలి. ఇటీవల ఇంగ్లండ్ తో సిరీస్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన టీమ్‌ను గంగూలీ అభినందించారు. ‘అబ్బా.. ఏం గెలుపు అది. ఈ మధ్య కాలంలో కరోనా కారణంగా బయో బబుల్స్ మధ్య కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ఐపీఎల్ నుంచి ఇప్పటి వరకు కూడా వారి ఆటతీరు అమోఘం.’ అని గంగూలీ అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: