WORLD NO1 PLAYER ASHLEIGH BARTY ANNOUNCED HER SHOCK RETIREMENT FROM PROFESSIONAL TENNIS AT THE AGE OF JUST 25 SRD
Ashleigh Barty : 25 ఏళ్ల వయస్సులోనే వరల్డ్ నెం.1 ప్లేయర్ సంచలన నిర్ణయం..
Ashleigh Barty
Ashleigh Barty : యాష్లే బార్టీ కెరీర్ విషయానికొస్తే.. 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్ విజేతగా నిలిచింది.ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను గెలిచిన బార్టీ తద్వారా కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ సాధించింది.
ఆస్ట్రేలియా (Australia) టెన్నిస్ స్టార్.. వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ యాష్లే బార్టీ (Ashleigh Barty) సంచలన నిర్ణయం తీసుకుంది. టెన్నిస్ స్టార్ నిర్ణయంతో ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ కు గుడ్ బై చెప్పింది. రిటైర్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేసింది. "ఈ రోజు నేను తీసుకున్న కఠిన నిర్ణయం వల్ల నా మనసు భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నా. నిజానికి ఈ విషయం మీతో ఎలా పంచుకోవాలో నాకు అర్థంకాలేదు. అందుకే నా ఫ్రెండ్ సాయం తీసుకున్నాను. నాకు అన్ని రకాల సంతోషాలు అందించిన ఆటకు సదా రుణపడి ఉంటా. అదే విధంగా నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నా.ఈ ప్రయాణంలో మీరు నాకు అందించిన మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. ఓ వ్యక్తిగా నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇక ఆటకు గుడ్ బై చెప్పడానికి ఇదే సరైన సమయం. నాకున్న మిగతా కలల్ని కూడా నెరవేర్చుకోవాలి" అని బార్టీ ఉద్వేగపూరితంగా మాట్లాడింది.
అయితే, 25 ఏళ్ల వయస్సులోనే, కెరీర్ టాప్ పీక్స్ లో ఉన్న సమయంలో బార్టీ రిటైర్మెంట్ ప్రకటన అభిమానులను షాక్‌కు గురి చేసింది.
ఇక యాష్లే బార్టీ కెరీర్ విషయానికొస్తే.. 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్ విజేతగా నిలిచింది.ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను గెలిచిన బార్టీ తద్వారా కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ సాధించింది.
Ashleigh Barty
అంతేగాక.. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సాధించిన రెండో మహిళా ప్లేయర్(ఆస్ట్రేలియన్)గా బార్టీ రికార్డు సృష్టించింది. కష్టపడితే అందుకు తగ్గ ప్రతిఫలం లభిస్తోందని నిరూపించింది ఈ భామ. యాష్లే బార్టీ టెన్నిస్ ప్లేయరే కాకుండా ఓ ప్రోఫెషనల్ క్రికెటర్ కూడా.
2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2015-2016లో బిగ్‌బాష్ మహిళల టీ20 క్రికెట్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది. 10 మ్యాచ్‌లు ఆడిన యాష్లే బార్టీ.. అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఓ మ్యాచ్‌లో అత్యధికంగా 39 పరుగులు చేసింది. అయితే క్రికెటర్‌గా అంతగా సఫలం కాకపోవడంతో బార్టీ 2016లో టెన్నిస్‌లో పునరాగమనం చేసింది. 2019లో ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకున్న ఈ ఆసీస్ అమ్మాయి.. తాజాగా వింబుల్డన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో మార్గరెట్ కోర్ట్ స్మిత్ (1963, 1965, 1970), ఇవోన్ గూలాగాంగ్ (1971, 1980) ఈ ఘనత సాధించారు. ప్రొఫెషనల్ క్రికెటర్ అయిన బార్టీ టెన్నిస్‌లోనూ బ్యాటింగ్ తరహా ట్రిక్స్‌తో ప్రత్యర్థులకు చెక్ పెట్టింది. తన జీవితంలో క్రికెటర్‌గా కొనసాగిన క్షణాలను తాను మరిచిపోలేనని బార్టీ చెప్పుకొచ్చింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.