Home /News /sports /

WORLD NO1 ASHLEIGH BARTY KNOCKED OUT BY SHELBY ROGERS IN 3RD ROUND OF US OPEN JNK

US Open: యూఎస్ ఓపెన్ నుంచి ఆష్ బార్టీ అవుట్.. వరల్డ్ నెంబర్ 1కు షాకిచ్చిన అన్‌సీడెడ్ షెల్బీ రోజర్స్

యూఎస్ ఓపెన్‌లో ఆష్ బార్టీకి షాకిచ్చిన షెల్బీ రోజర్స్ (PC: US Open/Twitter)

యూఎస్ ఓపెన్‌లో ఆష్ బార్టీకి షాకిచ్చిన షెల్బీ రోజర్స్ (PC: US Open/Twitter)

యూఎస్ ఓపెన్‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ నయోమీ ఒసాకా ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తాజాగా వరల్డ్ నెంబర్ 1 ఆష్ బార్టీ అన్‌సీడెడ్ షెల్బీ రోజర్స్ చేతిలో ఓటమిపాలయ్యింది.

    యూఎస్ ఓపెన్‌లో (US Open) టెన్నిస్ (Tennis) చాంపియన్‌షిప్‌లో మరో సంచలనం నమోదయ్యింది. డిఫెండింగ్ చాంపియన్ నయోమీ ఒసాకా (Naomi Osaka) యూఎస్ ఓపెన్‌లో ఓడిపోయి 24 గంటల గడవక ముందే వరల్డ్ నెంబర్ 1 ఆష్ బార్టీ (Ash Barty) కూడా నిష్క్రమించింది. ఆర్థర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆష్ బార్టీ 2-6, 6-1, 6-7(5/7) తేడాతో అమెరికాకు చెందిన షెల్బీ రోజర్స్ చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది వింబుల్డన్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న బార్టీ.. క్యాలెండర్ చివరి గ్రాండ్‌స్లామ్ అయిన యూఎస్ ఓపెన్ కూడా తన ఖాతాలో వేసుకోవాలని భావించింది. డిఫెండింగ్ చాంపియన్ నయోమీ ఒసాకా కూడా ఓడిపోవడంతో బార్టీ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ ప్లేయర్ రోజర్స్ ఆమెను ఖంగుతినిపించింది. తొలి సెట్‌లోనే బార్టీకి మూడు చెరువుల నీళ్లు తాగిపించిన రోజర్స్.. రెండో సెట్‌లో చేతులెత్తేసింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌ టై బ్రేకర్‌కు దారితీసింది. ఇందులో రోజర్స్ కష్టపడి నెగ్గి బార్టీకి షాకిచ్చింది.

    ఇక వరల్డ్ నెంబర్ 4 కరోలినా ప్లిస్కోవా 6-3, 6-2 తేడాతో అన్‌సీడెడ్ క్రీడాకారిణి అజ్లా టామ్‌జోనోవిక్‌పై గెలిచి ప్రీక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నది. 7వ సీడ్ ఇగ ష్వామ్‌టెక్ 6-3, 4-6, 6-3 తేడాతో 28వ సీడ్ అనెట్ కొంతావిట్‌పై గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్ చేరింది. మరో మ్యాచ్‌లో ఎమ్మా రాడకాను 6-0, 6-1 తేడాతో సారా సోరిబెస్‌పై 3వ రౌండ్‌లో విజయం సాధించింది.











    పురుషుల సింగిల్స్‌లో 21వ సీడ్ కరత్సేవ్ 2-6, 6-3, 6-2, 3-6, 3-6 తేడాతో జేసన్ బ్రూక్స్‌బీపై ఓడిపోయాడు. యూఎస్ ఓపెన్ 4వ రౌండ్ చేరిన అతి చిన్న వయసు టెన్నిస్ ప్లేయర్‌గా జేసన్ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 2002లో ఆండీ రాడిక్ ఈ ఘనత సాధించాడు. 7వ సీడ్ షపలోవ్ 4-6, 4-6, 4-6 తేడాతో ఎల్ హారీస్‌పై ఓడిపోయాడు. హారీస్ గ్రాండ్‌స్లామ్స్‌లో 4వ రౌండ్ చేరడం ఇదే తొలిసారి. 22వ సీడ్ ఓపెల్కా 7-6 (7/5), 6-3, 6-4 తేడాతో బాసిలష్విపై గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు.

    T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌కు స్టార్ ప్లేయర్ అనుమానమే.. అదే జరిగితే ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పవు


     

    Published by:John Naveen Kora
    First published:

    Tags: Tennis

    తదుపరి వార్తలు