కరోనా టీకా (Corona Vaccine) తీసుకోనందుకు ఆ క్రీడాకారుడి కలచెదిరిపోయేలా ఉంది. ప్రపంచ నంబర్.1గా ఎదిగినా.. టీకా తీసుకోనందుకు అతన్ని ఈవెంట్‌లో ఆడనివ్వకుండా వీసా రద్దు చేసింది ప్రభుత్వం. ఆ క్రీడాకారుడు ఎవరో కాదు నొవాక్ జకోవిచ్. ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేందుకు సిద్ధం అయిన వేళ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ (Australian Open) గెలవాలని ఎంతో పట్టుదలగా ఉన్న జకోవిచ్‌కు కరోనా టీకా తీసుకోకపోవడం పెద్ద దెబ్బగా మారింది. అతని వీసాను ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ అంశంపై అతను కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా.. తీర్పు అతనికి అనుకూలంగా వచ్చే అవకాశం లేదని న్యాయా నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి అలెక్స్ హాక్ ప్రత్యేక అధికారాలను ఉపయోగించి అతడి వీసాను రద్దు చేశారు. అంటే అతడికి మరో మూడేళ్ల వరకు ఆస్ట్రేలియాలో ప్రవేశం లేనట్టే! కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వం అనుమతించొచ్చు.
ప్రత్యేక చట్టం ఆధారంగా రద్దు..
ఆస్ట్రేలియా వలస చట్టంలోని 133C(3) సెక్షన్ ప్రకారం నేనీ రోజు ప్రత్యేక అధికారాలను జకోవిచ్‌పై ఉపయోగించారు. దేశంలో ప్రజల ప్రయోజనార్థం నొవాక్ జకోవిచ్ వీసాను రద్దు చేశామని ఆస్ట్రేలియా (Australia) విదేశాంగ మంత్రి అలెక్స్ హాక్ స్పష్టం చేశారు. అయితే జకోవిచ్‌కు సంబంధించి మొదటి సారి వీసాను ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై అతను కోర్టుకు వెళ్లాడు. అక్కడి ఫెడరల్ కోర్టు వీసా రద్దును కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం ఆస్ట్రేలియా సరిహద్దు దళం, హోం మంత్రిత్వ శాఖ సమాచారం పరిగణనలోకి తీసుకొని.. ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి అలెక్స్ హాక్ వెల్లడించారు.
మొదటిసారి స్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ అధికారులు జకోవిచ్‌ను విమానాశ్రమంలో నిలిపివేశారు. అతడికి మద్దతుగా అభిమానులు, సెర్బియా ప్రభుత్వం నిలిచింది. ప్రపంచ నంబర్ వన్‌ను అవమానిస్తారా అంటూ విమర్శించింది. ఈ లోపు జకోవిచ్ కోర్టుకు వెళ్లి ఊరట తెచ్చుకున్నాడు. తిరిగి ప్రభుత్వం మరోసారి వీసాను రద్దు చేసింది.
తిరుగులేని రికార్డు..
ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఓపెన్‌ను జకోవిచ్ తొమ్మిదిసార్లు గెలిచాడు. మరోసారి గ్రాండ్‌స్లామ్ గెలిచి అత్యధిక సార్లు గెలిచిన అరుదైన రికార్డును సాధిద్దాం అనుకొన్నాడు. అంతేకాకుండా చాలా కాలంగా ఊరిస్తున్న 21వ గ్రాండ్‌స్లామ్ సాధించాలని కలలు కన్నాడు. కానీ టీకా తీసుకోకపోవడం వల్లే జకోవిచ్ కల చెదిరిపోయేలా ఉంది.
ఆస్ట్రేలియాలో కఠిన ఆంక్షలు..
ఆస్ట్రేలియాలో కొవిడ్ ఆంక్షలు (Covid 19 Restrictions) కఠినంగా అమలు చేస్తోంది. గతంలో క్రికెట్ ఆడడానికి టీమ్‌ఇండియా సైతం అక్కడ పర్యటించింది. ఆ సమయంలో ఆటగాళ్లు క్వారంటైన్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అస్సలు మినహాయింపులే ఇవ్వలేదు. అయితే పాజిటివ్ వచ్చిన వాళ్లు వైద్య ధ్రువీకరణ పత్రం చూపిస్తే దేశంలోని అనుమతి ఇస్తున్నారు. కానీ జకోవిచ్ అలాంటి పత్రం ఇవ్వలేదు. అతడికి అవమానం జరిగిందటూ సొంత దేశం సెర్బియా సహా మిగతా ప్రపంచమూ అతడికి వంత పాడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.