ఐసీసీ వరల్డ్ కప్ టీమ్స్ ఎప్పుడు ప్రకటిస్తారు... టైమ్ లైన్ ఇదిగో...

ICC World Cup 2019 : ఏప్రిల్ 23న వరల్డ్ కప్ జట్టు సభ్యులను ప్రకటిస్తారు. ఇండియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా ఇప్పటికే డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 16, 2019, 6:54 PM IST
ఐసీసీ వరల్డ్ కప్ టీమ్స్ ఎప్పుడు ప్రకటిస్తారు... టైమ్ లైన్ ఇదిగో...
టీంఇండియా (Image : Twitter)
  • Share this:
ఏప్రిల్ వచ్చి అప్పుడే పది రోజులు అయిపోయాయి. వచ్చే నెలలోనే వరల్డ్ కప్ జరగబోతోంది. జట్టులో సభ్యత్వం కోసం ఇప్పటి నుంచే ఆటగాళ్లు తమ పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచుకుంటున్నారు. ఏప్రిల్ 23న ప్రతీ జట్టూ తమ సభ్యులను ప్రకటించాల్సి ఉంది. ఐతే... ఐపీఎల్ కారణంగా ఇంకా తమ జట్టు సభ్యులను సెలెక్ట్ చేసుకోలేనదని టీమ్స్ చెబుతుండటంతో... మే 23 వరకూ టైమ్ ఇచ్చింది ICC. ఈలోగా ఆటగాళ్లను రెడీ చేసుకొని... ఎలాంటి గాయాలూ లేకుండా సిద్ధం చేసుకోవాలని ఐసీసీ కోరింది. మే 30న టీమ్స్ ఈవెంట్ జరుగుతుంది. ఇప్పటివరకూ న్యూజిలాండ్ మాత్రమే తమ జట్టు సభ్యుల్ని ప్రకటించింది.

ప్రపంచకప్ లీడింగ్ టీమ్స్‍లో ఒకటైన ఇండియా.. ఏప్రిల్ 15న తన జట్టు సభ్యుల్ని ప్రకటించబోతోంది. ఇండియాతోపాటూ... పాకిస్థాన్, దక్షిణ ఆఫ్రికా కూడా తమ జట్టును ఎప్పుడు రివీల్ చేసేదీ తెలిపాయి. సౌతాఫ్రికా ఏప్రిల్ 18న తమ జట్టును ప్రకటించనుంది. మే 12న క్యాంపును ప్రారంభించబోతోంది.

2017 ఛాంపియన్స్ ట్రోపీ గెలిచిన పాకిస్థాన్... ఏప్రిల్ 23న తమ జట్టును పరిచయం చెయ్యబోతోంది. పాకిస్థాన్ ఈ వరల్డ్ కప్ కోసం మొత్తం 23 మంది ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. తాము కూనలు కాదనీ... అవసరమైతే చెలరేగిపోగలమని నిరూపిస్తున్న బంగ్లాదేశ్... ఏప్రిల్ 15 నుంచీ 20 మధ్య జట్టును ప్రకటిస్తుందని తెలిసింది. ఆఫ్ఘనిస్థాన్‌కి చెందిన 23 మంది ప్లేయర్లు... సౌతాఫ్రికాలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆరు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాక జట్టు సభ్యుల్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఐతే... ఆ మ్యాచ్‌ల డేట్స్ ఇంకా తేలలేదు.


ఇక వరల్డ్ కప్‌ని నిర్వహించే ఇంగ్లాండ్... ఆతిథ్య జట్టును ప్రకటించలేదు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతోపాటూ... వెస్టిండీస్, శ్రీలంక కూడా తమ టీమ్స్‌ని ఎప్పుడు ప్రకటించేందీ ఇంకా తేల్చలేదు. 

ఇవి కూడా చదవండి :

మిస్సింగ్ అయిన జపాన్ F-35 ఫైటర్ జెట్... పసిఫిక్ సముద్రంలో కూలిపోయిందా...ఇంటర్నెట్ ఓటింగ్ తెచ్చేదెప్పుడు... ఎంతసేపూ పాత పద్ధతేనా... మనోళ్లు మారరా...

ఓటుకు రూ.500 నుంచీ రూ.5000... ఎక్కడిదీ డబ్బు... మనదే కదా...

ఆ థాయ్‌ల్యాండ్ బీచ్‌లో ఫొటోలు తీసుకుంటే... ఉరి తీస్తారు... ఎందుకో తెలుసా...
First published: April 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>