Home /News /sports /

WORLD CUP HOST QATAR USED EX CIA OFFICER TO SPY ON FIFA GH VB

FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణ కోసం ఖతార్‌ గూఢచర్యం.. వెలుగులోకి వాస్తవాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2022లో వల్డ్‌ కప్‌ నిర్వహించే అవకాశాన్ని ఖతార్‌ 2010లో పొందింది. అయితే ఇందుకు తమతో పోటీపడుతున్న ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలతో పాటు ఫెడరేషన్‌కు చెందిన కీలక అధికారులపై ఆ దేశం గూఢచర్యం నిర్వహించిందని అసోసియేటెడ్ ప్రెస్‌ దర్యాప్తులో తేలింది.

ఇంకా చదవండి ...
వచ్చే ఏడాది ఫిఫా వరల్డ్ కప్‌కు(FIFA World Cup) అతిథ్యమిస్తోంది చిన్న అరబ్‌ దేశమైన ఖతార్‌. ఈ అవకాశం పొందేందుకు ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌గా మారిన సీఐఏకు చెందిన మాజీ అధికారి కెవిన్‌ చాకర్‌ సేవలను ఖతార్‌ ఉపయోగించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికన్ న్యూస్ ఏజెన్సీ అసొసియేటెడ్‌ ప్రెస్‌ (Associated Press- AP) పరిశీలనలో ఈ విషయం తేలింది. 2022లో వల్డ్‌ కప్‌ నిర్వహించే అవకాశాన్ని ఖతార్‌ 2010లో పొందింది. అయితే ఇందుకు తమతో పోటీపడుతున్న ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలతో పాటు ఫెడరేషన్‌కు చెందిన కీలక అధికారులపై ఆ దేశం గూఢచర్యం నిర్వహించిందని అసోసియేటెడ్ ప్రెస్‌ దర్యాప్తులో తేలింది.

KL Rahul: లక్నో జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. పంజాబ్ కింగ్స్ నుంచి వెళ్లిపోతున్న స్టార్ బ్యాటర్.. భారీ ధర చెల్లించబోతున్న గోయెంకా

అంతే కాదు సాకర్‌ ప్రపంచంలో ఖతార్‌ను విమర్శించేవారిపై కూడా కెవిన్‌ కన్నేసినట్టు AP కనుగొంది. దీని కోసం కెవిన్‌ మాజీ సన్నిహితులు, కాంట్రాక్టులు, ఇన్వాయిసులు, ఈమెయిల్స్‌తో పాటు రకరకాల పత్రాలను AP పరిశోధించింది. మరో వైపు మానవ హక్కుల విషయంలో ప్రశ్నార్థకంగా నిలుస్తున్న దేశాలతో మాజీ నిఘా అధికారులు కలిసి పనిచేస్తుండటం అమెరికాను కలవరపరుస్తోంది. గల్ఫ్‌ డబ్బు అమెరికాలో విచ్చలవిడిగా ప్రవహిస్తోందని న్యూజెర్సీకి చెందిన డెమొక్రాట్‌ సభ్యుడు టామ్‌ మలినోవిస్కి అన్నారు. ఆ ఎర చాలా తీవ్రంగా ఉంటుందని, దానికి చిక్కుకోకుండా అమెరికన్లు ఉండటం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

Pro Kabaddi League: ప్రో కబడ్డీ లీగ్‌లో ఎన్ని జట్లు ఉన్నయో తెలుసా? వాటి యజమానుల వివరాలు ఇవిగో..

పెద్ద టోర్నీ కోసం గూఢచర్యం
సాకర్‌ వల్డ్‌ కప్‌ అంటే ఈ భూప్రపంచంలో చాలా మంది ఇష్టపడతారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన ఖతార్‌కు ప్రపంచ వేదికపై నిలిచేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. దీని కోసం ఏ అవకాశాన్ని ఖతార్‌ వదులుకోలేదని AP దర్యాప్తులో తేలింది. ఈ నిఘాలో ప్రత్యర్థి దేశం ఎత్తుగడలు తెలుసుకునేందుకు ఫొటో జర్నలిస్టులను ఉపయోగించినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఫేస్‌బుక్‌ను సైతం ఆ దేశం వాడుకున్నట్టు AP దర్యాప్తులో తేలింది. ఒక అందమైన అమ్మాయిగా ఒకరు నటించి లక్ష్యానికి దగ్గరైనట్టు రికార్డుల పరిశీలనలో గుర్తించారు.

Explained: ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు అంటే ఏంటి..? పబ్లిక్ క్రిప్టోల కంటే ఇవి ఎలా భిన్నంగా ఉంటాయి..?


చాల్కర్, పర్షియన్ గల్ఫ్ షేక్‌డమ్ కోసం పనిచేస్తున్నవాళ్లు 2010 నాటి ఓటింగ్‌కు ముందు ఒక FIFA అధికారి సెల్ ఫోన్ కాల్ డేటాను కోరినట్లు రికార్డులు గుర్తించాయి. ఫిఫా సంస్థలో మాటల ద్వారా విమర్శించే వారిని లక్ష్యం చేసుకొని విజయవంతంగా చొచ్చుకుపోవడం ద్వారా ప్రాజెక్టు మెర్సీలెస్‌ (Project MERCILESS) సాధించగలిగామని కెవిన్‌ చాకర్‌కు చెందిన కంపెనీ గ్లోబర్‌ రిస్క్ అడ్వైజర్స్‌ 2014 నాటి డాక్యుమెంట్‌లో వెల్లడించింది. తొమ్మిదేళ్ల పాటు సాగిన ప్రాజెక్టు కోసం $387 మిలియన్ల కనీస బడ్జెటును ప్రతిపాదించారు. అయితే చివరకు ఖతార్‌ ఎంత మొత్తం చెల్లించిదన్నది వెల్లడి కాలేదు.

Bhuvneshwar Kumar: భువీ ఇంటిలో 'లిటిల్ ఏంజెల్'.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భువీ భార్య నుపుర్ నగార్

జొర్డాన్‌ యువరాజు అలి బిన్‌-అల్‌ హుస్సేన్‌ను గెలిచేందుకు కంపెనీ చాలా కష్టపడిందని సంస్థకు చెందిన డాక్యుమెంట్లు చెబుతున్నాయి. 2015, 2016లో ఫిఫా ప్రెసిడెంట్‌ పదవి కోసం ఆయన పోటీ చేశారు. ప్రపంచ ఫుట్‌బాల్‌లో మంచి స్థానం సంపాదించేందుకు అలీ నిర్వహణలో ఉన్న సాకర్‌ అభివృద్ధి సంస్థకు డబ్బు ఇవ్వాలని గ్లోబల్‌ రిస్క్‌ అడ్వైజర్స్‌ సంస్థ ఖతార్‌కు సూచించింది.
జొర్డాన్‌ యువరాజుకు, ఖతార్‌ పాలకులకు మధ్య మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, ఆ బంధంలో సాయపడేందుకు కన్సల్టెంట్ల అవసరం లేదని అలీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

IND vs NZ: తొలి టెస్టుకు ముందు అశ్విన్‌ను ఊరిస్తున్న 3 రికార్డులు.. ఆ దిగ్గజాలను అధిగమించే అవకాశం

ఖతార్‌ కోసం కెవిన్ చాకర్‌కు చెందిన కంపెనీ ఏమేమి పనులు చేసిందనే విషయంలో స్పష్టత లేదు కానీ 2014- 2017 మధ్య కాలంలో చోటుచేసుకున్న అనేక ప్రతిపాదనలను AP పరిశీలించింది. అవి కేవలం వల్డ్‌ కప్‌తో నేరుగా ముడిపడి లేవని అందులో గుర్తించారు. ఇందులో ఖతార్‌లో పనిచేస్తున్న వలస కార్మికుల బయోమెట్రిక్స్‌, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి పిక్‌యాక్స్‌ కూడా ఉంది. అంతే కాదు, ఫాల్కాన్‌ ఐ పేరుతో ఉన్న ప్రాజెక్టు సరిహద్దుల నిర్వహణ, రేవుల్లో నిఘా కార్యకలాపాల కోసం డ్రోన్ల వినియోగంతో పాటు వలస కార్మికుల కేంద్రాల నియంత్రణ కూడా ఉంది.

Sad: వాళ్లిద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు కదా.. వాళ్లను చూసిన తర్వాత భార్యభర్తలు ఇలా ఉండొద్దని నేర్చుకుంటారు..


వలస కార్మికుల చరిత్ర, నేపథ్యాన్ని దీని ద్వారా ఖతార్‌ తెలుసుకుంటుంది. జాతీయ భధ్రతను పెంచడం, కీలకమైన నిఘా సమాచారం అందించేందుకు వైపర్‌ పేరుతో మరో ప్రాజెక్టు కూడా ఉంది. ఆన్‌ సైట్‌ లేదా సుదూర ప్రాంతం నుంచి మొబైల్‌ పరికరాల ద్వారా ఈ కార్యకలాపాలు చేపడతారని గ్లోబర్‌ రిస్క్ అడ్వైజర్స్‌ సంస్థ డాక్యుమెంట్లలో ఉంది. ఇలాంటి టెక్నాలజీలను గల్ఫ్‌ సహ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉపయోగిస్తున్నారు.

పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో గడిచిన దశాబ్ద కాలంగా ప్రైవేట్‌ నిఘా వ్యాపారం బాగా పెరిగింది. హ్యాకింగ్ ఆపరేషన్లు ఇక్కడ బాగా పెరిగాయి. DarkMatter అనే UAEకి చెందిన కంపెనీకి హ్యాకింగ్‌ సేవలు అందించినట్టు అమెరికాకు చెందిన ముగ్గురు మాజీ ఇంటెలిజెన్స్‌, సైనిక అధికారులు అంగీకరించారు. ఒప్పందం కారణంగా వీరిపై ప్రాసిక్యూషన్‌ను అమెరికా న్యాయ విభాగం వాయిదా వేసింది. ఖతార్‌ ఎమిర్‌, ఆయన సోదరుడు, ఫిఫా అధికారుల ఫోన్లు, కంప్యూటర్లను DarkMatter హ్యాక్‌ చేసిందని 2019లో రాయిటర్స్‌ నిర్వహించిన దర్యాప్తులో తెలిసింది.

Hyderabad Sisters: వారిద్దరు అక్కాచెల్లెళ్లు.. ఉదయం 5 గంటలకు నిద్రలేచి వాళ్లు ఏం చేస్తారో తెలుసా..


కెవిన్‌ చాకర్‌కు దోహాలో కార్యాలయం ఉంది. ఆయనకు ఖతార్‌ ప్రభుత్వ అధికారిక ఈమెయిల్‌ కూడా ఉంది. తాను కానీ, తన కంపెనీలు కూడా ఎటువంటి అక్రమ నిఘా కార్యకలాపాల్లో నిమగ్నం కామని కెవిన్‌ చాకర్‌ ప్రతినిధి స్పష్టం చేశారు. నిఘా పనులతో పాటు అనేక రకాల సేవలు ఖతార్‌కు అందించామని చాకర్‌ దగ్గర గతంలో పనిచేసిన వారు తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ, మిలటరీ, చట్టాన్ని అమలు చేసే యంత్రాంగానికి శిక్షణ, గూఢచర్య ఆధారిత సేవల్లో ప్రత్యేకత కలిగిన అంతర్జాతీయ వ్యూహాత్మక కన్సల్టెన్సీ సంస్థగా తనను తాను గ్లోబల్‌ రిస్క్‌ అడ్వైజర్స్‌ సంస్థ తెలియజేసుకుంటుంది. రోప్‌ ట్రెయినింగ్‌ కోర్సు నిర్వహణ వంటి చిన్న కాంట్రాక్టులను ఈ కంపెనీ FBI ద్వారా కూడా పొందింది. అంతే కాదు డెమొక్రాటిక్‌ నేషనల్‌ కమిటీ కోసం ఈ సంస్థ టెక్నాలజీ కన్సల్టెన్సీ పనులు కూడా చేసింది.

Painfull Incident: దారుణం.. అతడు ఆ పని చేశాడని.. పందిరి గుంజ కు 18 గంటల పాటు తాళ్లతో కట్టేసి చితకబాదారు..


ఖతార్‌ ప్రభుత్వం చేసే పనుల గురించి AP సంస్థ పంపిన ప్రశ్నలకు, ఇంటర్వ్యూ కోసం చేసిన విజ్ఞప్తిని కెవిన్‌ చాకర్‌ తిరస్కరించారు. అంతే కాదు AP పరిశీలించిన కొన్ని పత్రాలు నకిలీవని తెలిపారు. కెవిన్ కంపెనీలకు చెందిన వందలాది పత్రాలను AP పరిశీలించింది. ఇందులో 2013లో సాకర్‌ అధికారులతో చాకర్‌ కంపెనీ సిబ్బంది పాల్గొన్న సమావేశాల ఫొటోలు కూడా ఉన్నాయి.
APకి చాలా మంది ఈ పత్రాలు అందజేశారు. ఖతార్‌ కోసం కెవిన్‌ చేసిన పనుల కారణంగా తమకు ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి తమ పేర్లు బయటపెట్టవద్దని వారు కోరారు.

Sad Incident: ఆమె ఎన్నో ఆశలతో ఇంటర్ కాలేజీలో జాయిన్ అయింది.. అతడు చేసిన ఆ పనికి.. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది..


ఆ పత్రాల ప్రామాణికతను తెలుసుకునేందుకు AP అనేక చర్యలు తీసుకుంది. ఇందులో రకరకాల వ్యక్తులు సహ కెవిన్ చాకర్‌కు చెందిన మాజీ సన్నిహితులు, సాకర్‌ అధికారులు, వంటివి ఉన్నాయి. వాటితో పాటు బహిరంగంగా లభ్యమయ్యే వ్యాపార రికార్డులు, ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్ల మెటా డేటా, డిజిటల్‌ హిస్టరీ వంటి వాటి ద్వారా ఆ పత్రాలను నిర్ధారించుకునే ప్రయత్నం చేసింది.
Published by:Veera Babu
First published:

Tags: FIFA, Games

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు