World Cup 2019 : సఫారీలపై కివీస్ విజయం.. సౌతాఫ్రికాకు సెమీస్ ఛాన్స్ లేనట్టే!

తాజా విజయంతో పాయింట్ల పట్టికలో కివీస్ అగ్ర స్థానానికి దూసుకెళ్లగా దక్షిణాఫ్రికా మరింత దిగువకు పడిపోయింది. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు కివీస్ 5 మ్యాచ్‌లు ఆడగా నాలుగింటిలో నెగ్గింది.

news18-telugu
Updated: June 20, 2019, 7:34 AM IST
World Cup 2019 : సఫారీలపై కివీస్ విజయం.. సౌతాఫ్రికాకు సెమీస్ ఛాన్స్ లేనట్టే!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దక్షిణాఫ్రికాను వరల్డ్ కప్ ఫోబియా ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈసారైనా వరల్డ్ కప్‌లో సఫారీల తీరు మారుతుందా? అన్న సందేహాలకు ఏమాత్రం అనుమానం అక్కర్లేదని ఆ జట్టు ప్రదర్శన చూస్తే అర్థమవుతుంది. వరుస ఓటములతో సెమీస్‌కు వెళ్లే అవకాశాలను సఫారీ జట్టు దాదాపుగా దూరం చేసుకుంది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమిని మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో మరింత దిగువ స్థానానికి పడిపోయింది.

ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో న్యూజిలాండ్ Vs దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో కివీస్ విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా.. తొలుత సఫారీ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. హషీం ఆమ్లా (55),డుసెన్ (67*) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది.

అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ మన్రో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్, టామ్ లూథమ్ కూడా వెనువెంటనే ఔటయ్యారు. మరో ఓపెనర్ గప్టిల్(35) కూడా త్వరగానే ఔట్ అవడంతో.. 80 పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌106*(138 బంతుల్లో 9 ఫోర్లు,సిక్సర్), గ్రాండ్‌హోమ్ 60(5 ఫోర్లు, 2 సిక్సర్లతో) రాణించడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే కివీస్ విజయం సాధించింది. సెంచరీతో కివీస్‌ను గెలిపించిన విలియమ్స్‌ను 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.


గ్రాండ్‌హోమ్ పెవిలియన్ చేరిన తర్వాత మ్యాచ్ కాస్త ఉత్కంఠను తలపించినప్పటికీ.. విలియమ్సన్ కివీస్‌ను సునాయసంగా విజయ తీరాలకు చేర్చాడు.తాజా విజయంతో పాయింట్ల పట్టికలో కివీస్ అగ్ర స్థానానికి దూసుకెళ్లగా దక్షిణాఫ్రికా మరింత దిగువకు పడిపోయింది. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు కివీస్ 5 మ్యాచ్‌లు ఆడగా నాలుగింటిలో నెగ్గింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. ఇక దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది. దీంతో ఆ జట్టు సెమీస్‌ అవకాశాలకు దాదాపుగా గండిపడినట్టే అంటున్నారు.

Published by: Srinivas Mittapalli
First published: June 20, 2019, 7:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading