వరల్డ్ కప్ వివాదం: ఐసీసీ బౌండరీ రూల్‌పై అమితాబ్ బచ్చన్ సెటైర్

తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఐసిసి నిబంధనలపై తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: July 17, 2019, 8:25 AM IST
వరల్డ్ కప్ వివాదం: ఐసీసీ బౌండరీ రూల్‌పై అమితాబ్ బచ్చన్ సెటైర్
అమితాబ్ బచ్చన్ (File/Photo)
  • Share this:
తాజాగా జరిగిన వరల్డ్ కప్ 2019 ఫైనల్లో విజేతనకు ఐసీసీ ప్రకటించిన విధానంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వరల్డ్ కప్ ఫైనల్లో బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ ను విజేతగా నిర్ణయించడంపై క్రికెట్ ప్రియులు, మాజీ క్రికెటర్లు, క్రికెటర్లే కాకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఐసిసిని తప్పుబడుతున్నారు. తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఐసిసి నిబంధనలపై తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు.
డబ్బులను ఉదాహరణగా చూపిస్తూ... ప్రపంచ కప్ ఫైనల్లో ఐసిసి అనుసరించి విధానాన్ని అమితాబ్ వివరించారు. '' మీ దగ్గర రూ.2000, నా దగ్గర కూడా ఓ రూ.2000 ఉన్నాయనుకొండి. మీ వద్ద రెండు వేల రూపాయల నోటు వుంటే నా దగ్గర మాత్రం నాలుగు రూ.500 నోట్లు వున్నాయి. అప్పుడు మనిద్దరిలో ఎవరు ధనవంతుడని ప్రశ్నిస్తే ఎక్కువ నోట్లున్నాయి కాబట్టి నేనే ధనవంతున్నని ఐసిసి నిర్ణయిస్తుంది. '' అంటూ అమితాబ్ ఐసిసిపై ట్విట్టర్ ద్వారా సెటైర్లు విసిరారు.ఈ మేరకు ఆయన ఓ హిందీలో ఓ పోస్టు పెట్టారు.

ఎన్నడూ లేనంతలా... ఈ సారి జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను తెరలేపింది. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచ కప్ 2019 ఫైనల్లో ఇరు జట్లు ఒకే స్కోరు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. ఈ సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్లు సమానంగా పరుగులు సాధించాయి. దీంతో ఐసిసి కొత్త నిబంధన ఒకటి బయటకు వచ్చింది. ఇలాంటి సమయంలో ఏ జట్టయితే అత్యధిక బౌండరీలు బాదిందో ఆ జట్టును విజేతలుగా ప్రకటించాలన్నది ఆ నిబంధన సారాంశం.

First published: July 17, 2019, 8:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading