హోమ్ /వార్తలు /క్రీడలు /

World Athletics Championships : Neeraj Chopra సత్తా.. 19ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం

World Athletics Championships : Neeraj Chopra సత్తా.. 19ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం

ప్రపంచ అథ్లెటిక్స్​  లో నీరజ్ చోప్రాకు పతకం

ప్రపంచ అథ్లెటిక్స్​ లో నీరజ్ చోప్రాకు పతకం

స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్ లో భాగంగా ఆదివారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్ లో భారత తేజం నీరజ్​ చోప్రా రెండో స్థానంలో నిలిచి వెండి పతకం సొంతం చేసుకున్నాడు.

ఇంకా చదవండి ...

విశ్వక్రీడల్లో భారత్ కు గర్వకారణంగా నిలిచిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra)మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్ (World Athletics Championships 2022) లో భాగంగా ఆదివారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్ లో భారత తేజం నీరజ్​ చోప్రా రెండో స్థానంలో నిలిచి వెండి పతకం సొంతం చేసుకున్నాడు. తద్వారా 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత తరఫున అథ్లెట్ ప్రపంచ ఛాంపియన్ షిప్స్ లో మెడల్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్ జావెలిన్ త్రో విభాగంలో డిఫెండింగ్​ ఛాంపియన్​, గ్రెనెడాకు చెందిన అండర్సన్​ పీటర్స్​ మరోసారి విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. పీటర్స్​ తన తొలి ప్రయత్నంలోనే 90.46 మీటర్ల దూరం బల్లెం విసరి అగ్రస్థానంలో నిలిచాడు. మిగతా ఎవరూ ఆ మార్కును అందుకోలేదు.

తొలి ప్రయత్నంలో విఫలమైన నీరజ్​.. తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఐదో ప్రయత్నంలోనూ నీరజ్​ ఫౌల్​ చేశాడు. వద్లెచ్​ 88.09 మీటర్ల దూరం బల్లెం విసిరి మూడో స్థానానంతో కాంస్య పతకం గెలుచుకున్నాడు.

నీరజ్ చోప్రా వెండి పతకం సాధించగా, మరో భారత జావెలిన్​ త్రోయర్​ రోహిత్​ యాదవ్​ ఆకట్టుకోలేకపోయాడు. మూడు రౌండ్ల తర్వాత పదో స్థానంలో నిలిచి నిష్క్రమించాడు.ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో పతకం గెల్చిన రెండో భారత అథ్లెట్​గా నిలిచాడు నీరజ్​ చోప్రా. అంతకుముందు 2003లో పారిస్​ వేదికగా జరిగిన వరల్డ్​ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో లాంగ్​ జంప్​ విభాగంలో కాంస్యం గెల్చుకుంది అంజు బాబి జార్జ్​. ఇప్పుడు నీరజ్​ ఆమె కంటే మెరుగైన ప్రదర్శన చేశాడు.

Published by:Madhu Kota
First published:

Tags: India, Neeraj chopra

ఉత్తమ కథలు