Home /News /sports /

WOMENST20CHALLENGE SUPERNOVAS VS VELOCITY SPN SCORES 126 RUNS SK

Womens T20 Challenge: అదరగొట్టిన ఆటపట్టు.. వెలాసిటీ టార్గెట్ ఎంతంటే..?

చమారి ఆటపట్టు (Image:IPL)

చమారి ఆటపట్టు (Image:IPL)

Womens T20 Challenge: మొదట బ్యాటింగ్‌కు దిగిన సూపర్ నోవాస్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఓపెనర్ చమారి ఆటపట్టు అదరగొట్టింది.

    Womens T20 Challenge: ఉమెన్స్ టీ20 టోర్నీలో ఇవాళ (మహిళల ఐపీఎల్)తొలి మ్యాచ్ జరుగుతోంది. షార్జా వేదికగా  తొలి పోరులో సూపర్ నోవాస్, వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సూపర్ నోవాస్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఓపెనర్  చమారి ఆటపట్టు అదరగొట్టింది. 39 బంతుల్లో 44 పరుగులు చేసింది.  ఇందులో 2 సిక్స్‌లు, 2 ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా బాధ్యతాయుత ఇన్సింగ్ ఆడింది. 27 బంతుల్లో 37 రన్స్ చేసింది. ఇందులో 2 సిక్స్‌లు, 1 ఫోర్ ఉన్నాయి.

    ప్రియా పునియా 11, జెమీమా రోడ్రిగ్స్ 7, శశికల సిరివర్దనే 31, పూజా వస్త్రాకర్ 0, రాధా యాదవ్ 2, షకీరా సల్మాన్ 5 పరుగులు మాత్రమే చేశారు. వెలాసిటీ బౌలర్లలో ఏక్తా బిష్త్ అద్భుతగా బౌలింగ్ చేసింది. 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. జహానర ఆలం, లీహ్ కాస్పెరిక్ చెరో రెండు వికెట్లు సాధించారు.

    యూఏఈలోని షార్జాలో మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీ జరుగుతోంది.  నవంబరు 4 నుంచి 9 వరకు జరగనున్న టోర్నమెంట్‌లో.. మొత్తం నాలుగు మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో సూపర్‌‌నోవాస్, వెలాసిటీ, ట్రైల్‌బ్లేజర్స్ పాల్గొంటున్నాయి. సూపర్‌ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ట్రెయిల్‌ బ్లేజర్స్‌కు స్మృతీ మంధాన, వెలాసిటీకి మిధాలీరాజ్‌ల కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత తొలిసారి భారత క్రీడాకారినులు మైదానంలోకి దిగారు. ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌‌తో క్రికెటర్లు కూడా టోర్నీలో పాల్గొంటున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, IPL 2020, Women's Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు