WOMENS WORLD CUP IND W VS SA W LIVE SCORE UPDATES SOUTH AFRICA WOMEN WON BY 3 WICKETS SRD
Women's World Cup - IND W vs SA W : అయ్యో కొంపముంచిన నో బాల్.. ఉత్కంఠపోరులో ఓడిన మిథాలీ సేన.. ఇక, ఇంటికే..
Photo Credit : Twitter
Women's World Cup - IND W vs SA W : వాటే మ్యాచ్.. వాటే మ్యాచ్.. మహిళల ప్రపంచకప్ లో భాగంగా జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో విజయం కోసం టీమిండియా, సౌతాఫ్రికా హోరాహోరీగా తలపడ్డాయ్. అయితే, సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ చేతులేత్తేసింది.
వాటే మ్యాచ్.. వాటే మ్యాచ్.. మహిళల ప్రపంచకప్ లో భాగంగా జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో విజయం కోసం టీమిండియా, సౌతాఫ్రికా హోరాహోరీగా తలపడ్డాయ్. మ్యాచ్ విజయం కోసం ఆఖరి వరకు ఇరు జట్లు పోరాడాయ్. అయితే, సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ చేతులేత్తేసింది. హోరాహోరీగా సాగిన పోరులో ఆఖరి ఓవర్ లో ఏడు పరుగులు అవసరమవ్వగా.. దీప్తి శర్మ అద్భుతంగానే బౌలింగ్ వేసింది. ఫస్ట్ నాలుగు బంతులకు నాలుగు పరుగులు ఇచ్చింది దీప్తి. అయితే, ఐదో బంతికి డుప్రిజ్ ఔటైంది. కానీ, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆ బంతి, నో బాల్ వేయడంతో టీమిండియాకు విజయం దూరమైంది. దీంతో, సౌతాఫ్రికా ఏడు వికెట్లతో సత్తా చాటింది. ఇక, అంతకుముందు స్మృతి మంధాన డుప్రిజ్ క్యాచ్ కూడా మిస్ చేయడం టీమిండియా ఓటమికి ఒక కారణంగా చెప్పొచ్చు.
ఈ ఓటమితో టీమిండియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో లారా వోల్వర్డ్ (79 బంతుల్లో 80 పరుగులు), డుప్రిజ్ (63 బంతుల్లో 52 పరుగులు నాటౌట్) అద్భుతంగా రాణించారు. టీమిండియా బౌలర్లలో హర్మన్ ప్రీత్, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు తీశారు.
275 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ లిజెలీ లీ వికెట్ రనౌట్ రూపంలో పెవిలియన్ బాట పట్టింది. దీంతో 14 పరుగులకే ఓ వికెట్ కోల్పోయింది. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ లారా వొల్వార్డ్తో అర్ధ శతకంతో రాణించింది. వన్‌డౌన్‌లో వచ్చిన లారా ఆమెకు సహకారం అందిస్తూ ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 125 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే.. 125 పరుగుల భాగస్వామ్యానికి రాజేశ్వరి గైక్వాడ్ బ్రేక్ వేసింది. లారా గుడాల్ (49 పరుగులు) స్టౌంప్ ఔట్ రూపంలో పెవిలియన్‌కు చేరింది.
ఆ వెంటనే వొల్వార్డ్ రూపంలో దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరింది. దీంతో.. 145 పరుగులకు మూడో వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. ఆ తర్వాత కాసేపు.. టీమిండియా బౌలర్లను సునే లూస్, డుప్రిజ్ సమర్దవంతగా ఎదుర్కొన్నారు. అయితే, 22 పరుగులు చేసిన సునే లూస్.. హర్మాన్ ప్రీత్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన కాప్ తనదైన హిట్టింగ్ తో భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టింది. వేగంగా పరుగులు చేసింది.
అయితే, 30 బంతుల్లో 32 పరుగులు చేసిన కాప్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరింది. అయితే, ఆఖర్లో డుప్రిజ్, ట్రయాన్ మెరుపు బ్యాటింగ్ చేశారు. అయితే, 9 బంతుల్లో 17 పరుగులు చేసిన ట్రయాన్ ని రాజేశ్వరి గైక్వాడ్ పెవిలియన్ కు పంపింది. ఇంకా, ఆఖరి ఓవర్ లో ఏడు పరుగులు కావాల్సిన సమయంలో త్రిషా రనౌట్ అయింది. ఆఖరి ఓవర్ ని దీప్తి శర్మ బౌలింగ్ వేసింది. కానీ, ఏడు పరుగుల్ని కంట్రో చేయడం కష్టమవ్వడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.
అంతకుముందు.. సెమీస్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేన భారీ స్కోరు సాధించింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో ఓపెనర్లు స్మృతి మంధాన(71), షఫాలీ వర్మ(53) శుభారంభం అందించగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(68) సైతం అర్ధ సెంచరీతో మెరిసింది. ఇక , వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ 48 పరుగులతో రాణించింది.దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ప్రత్యర్థికి గట్టి సవాల్ విసిరింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్‌కు రెండు, అయబోంగా ఖాకు ఒకటి, ట్రియాన్కు ఒకటి, మసబాట క్లాస్‌కు రెండు వికెట్లు దక్కాయి.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.