హోమ్ /వార్తలు /క్రీడలు /

Women's World Cup - IND W vs NZ W : హర్మన్ ప్రీత్ ఒంటరి పోరాటం వృధా.. మిథాలీ సేనకు తప్పని ఓటమి..

Women's World Cup - IND W vs NZ W : హర్మన్ ప్రీత్ ఒంటరి పోరాటం వృధా.. మిథాలీ సేనకు తప్పని ఓటమి..

Women's World Cup - IND W vs NZ W : వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఓటమి పాలైంది. 261పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 62 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.

ఇంకా చదవండి ...

  వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఓటమి పాలైంది. 261పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 62 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. హర్మన్ ప్రీత్ కౌర్ (63 బంతుల్లో 71 పరుగులు ; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసింది. మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేదు. లియా తహుహు మూడు వికెట్లు, అమీలా కెర్ర్ మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. మెగాటోర్నీలో టీమిండియాకు ఇది తొలి పరాజయం. న్యూజిలాండ్ కు వరుసగా రెండో విక్టరీ.261 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టుకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఆరు పరుగులు చేసిన మంధాన కెర్‌ బౌలింగ్‌లో బేట్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత దీప్తి శర్మ(5) రూపంలో టీమిండియా ఉమెన్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. తహుహు బౌలింగ్‌లో దీప్తి శర్మ ఎల్బీగా వెనుదిరిగింది.

  భారత్ ఏ దశలోనూ టార్గెట్ దిశగా సాగలేదు. ఓపెనర్‌గా వచ్చిన యషికా భాటియా 59 బంతుల్లో 2 ఫోర్లతో 28 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో 24 ఓవర్లు ముగిసే సరికే ఐదు మెయిడిన్లు వచ్చాయి. కెప్టెన్ మిథాలీ రాజ్ తన స్టైల్‌లో నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించడానికే ప్రాధాన్యం ఇచ్చింది.

  28 పరుగులు చేసిన యస్తికా బాటియా తాహుహు బౌలింగ్‌లో మెకేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపు పోరాడిన మిథాలీ రాజ్‌కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. మిథాలీ (33), రిచా ఘోష్‌(0) వెనువెంటనే ఒకే ఓవర్లో ఔటయ్యారు. ఈ రెండు వికెట్లు అమిలియా కెర్‌ ఖాతాలోకి వెళ్లాయి. స్నేహ్ రాణా కాసేపు ప్రతిఘటించినా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. 18 పరుగులు చేసిన స్నేహ్ తహిహు బౌలింగ్ లో వికెట్ కీపర్ కేటీ మార్టిన్ కు క్యాచ్ ఇచ్చి ఔటైంది.

  ఆ తర్వాత పూజా వస్త్రాకర్ (6) పరుగులు చేసి హన్నా రోవ్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టింది. ఆఖర్లో హర్మన్ ప్రీత్ కౌర్ మెరుపులు తప్ప టీమిండియా ఇన్నింగ్స్ లో చెప్పుకోదగ్గ విశేషం లేదు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది హర్మన్. అయితే... ఆఖర్లో భారీ షాట్ కు యత్నించిన హర్మన్ అమీలా కేర్ బౌలింగ్ లో బౌండరీ మీద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టింది. ఇక, ఆఖర్లో జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్ హేలీ జాన్సెన్ బౌలింగ్ లో వరుస బంతుల్లో ఔటయ్యారు. దీంతో, టీమిండియా 62 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.

  ఇక, అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ టీమిండియా ముందు టఫ్ టార్గెట్ సెట్ చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్స్ సాటర్త్‌వైట్(84 బంతుల్లో 9 ఫోర్లతో 75), అమెలి కెర్(64 బంతుల్లో 5 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ (4/34) నాలుగు వికెట్లతో సత్తా చాటగా రాజేశ్వరీ గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టింది. జులాన్ గోస్వామి, దీప్తి శర్మలకు చెరొక వికెట్ దక్కింది.

  First published:

  Tags: India vs newzealand, Mithali Raj, Smriti Mandhana, Women's Cricket, World cup

  ఉత్తమ కథలు