హోమ్ /వార్తలు /క్రీడలు /

Women's World Cup - IND W vs NZ W : టాస్ టీమిండియాదే.. లేడి సెహ్వాగ్ పై వేటు.. ఆమె స్థానంలో..

Women's World Cup - IND W vs NZ W : టాస్ టీమిండియాదే.. లేడి సెహ్వాగ్ పై వేటు.. ఆమె స్థానంలో..

IND W vs NZ W

IND W vs NZ W

IND W vs NZ W : స్మృతి మందాన , షెఫాలీ వర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలతో టీమిండియా స్ట్రాంగ్ గా ఉంది.. ప్రపంచకప్ వార్మప్ మ్యాచుల్లో ద‌క్షిణాఫ్రికా, విండీస్‌తో జ‌రిగిన మ్యాచుల్లో ఇండియా నెగ్గింది. పాకిస్థాన్‌తో జ‌రిగిన లీగ్ మ్యాచులోనూ దుమ్మురేపిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...

  మిథాలీ రాజ్ సారథ్యంలో భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌ (Women's World Cup 2022)లో శుభారంభం చేసింది. టీమిండియా తొలి మ్యాచులో పాకిస్థాన్‌ను 107 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు మరో పోరుకు సిద్ధమైంది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌-2022 ఎనిమిదో మ్యాచ్‌లో భాగంగా కాసేపట్లో భారత జట్టు ఆతిథ్య న్యూజిలాండ్‌తో తలపడనుంది. సెడాన్‌ పార్కు వేదికగా జరిగే మ్యాచ్‌లో వైట్‌ ఫెర్న్స్‌తో మిథాలీ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక, ఈ మ్యాచులో లేడి సెహ్వాగ్ షెఫాలీ వర్మపై వేటు వేసింది టీమిండియా. ఆమె ప్లేస్ లో మరో యంగ్ ప్లేయర్ యష్తికా భాటియా జట్టులో చోటు దక్కించుకుంది. ఇక, న్యూజిలాండ్ బంగ్లాతో తలపడిన సేమ్ టీమ్ తోనే బరిలోకి దిగనుంది.

  స్మృతి మందాన , హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలతో టీమిండియా స్ట్రాంగ్ గా ఉంది.. ప్రపంచకప్ వార్మప్ మ్యాచుల్లో ద‌క్షిణాఫ్రికా, విండీస్‌తో జ‌రిగిన మ్యాచుల్లో ఇండియా నెగ్గింది. పాకిస్థాన్‌తో జ‌రిగిన లీగ్ మ్యాచులోనూ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. భారత మహిళా జట్టు వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు న్యూజిలాండ్‌పై మంచి రికార్డు ఉంది.

  ఇరు జట్ల బ్యాటర్లతో పోలిస్తే ఆమే అందరి కంటే ఒక అడుగు ముందు ఉన్నారు. ఇప్పటివరకు ఈ వెటరన్‌ బ్యాటర్‌ 273 పరుగులు సాధించారు. ఇక ప్రపంచకప్‌ చరిత్రలోనూ ఇరు జట్లు పోటీ పడినపుడు మిథాలీ మాత్రమే సెంచరీ సాధించారు. 2017 వరల్డ్‌కప్‌లో మిథాలీ 109 పరుగులు చేశారు. దీంతో.. ఈ పోరులో కూడా రెచ్చిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

  హెడ్ టు హెడ్ రికార్డులు :

  అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళా జట్టు న్యూజిలాండ్‌తో ఇప్పటి వరకు 53 వన్డేలు ఆడింది. ఇందులో వైట్‌ ఫెర్న్స్‌ 32 విజయాలు సాధించగా... భారత్‌ ఇరవైంట మాత్రమే గెలుపొందింది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది.

  వరల్డ్‌కప్‌లో ముఖాముఖి రికార్డు

  ప్రపంచకప్‌ చరిత్రలోనూ భారత్‌పై న్యూజిలాండ్‌ జట్టుదే పైచేయి. ఇప్పటి వరకు ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌లో ఇరు జట్లు తొమ్మిదిసార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో తొమ్మిదింట వైట్‌ ఫెర్న్స్‌ జయకేతనం ఎగురవేయగా.. భారత్‌ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ప్రపంచకప్‌-2017లో న్యూజిలాండ్‌- భారత్‌ 2017లో చివరిసారిగా మెగా ఈవెంట్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మిథాలీ సేన 186 పరుగుల తేడాతో వైట్‌ ఫెర్న్స్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక 109 పరుగులు సాధించిన కెప్టెన్‌ మిథాలీరాజ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకుంది.

  తుది జట్లు :

  టీమిండియా : స్మృతి మంధాన, యష్తికా భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రానా, పూజా వట్సేకర్, జులన్ గో స్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్

  న్యూజిలాండ్ : సోఫియా డివెన్ (కెప్టెన్), సుజీ బేట్స్, అమీలా కేర్, ఎమీ సథర్ వైట్, మ్యాడీ గ్రీన్, ఫ్రాన్సెస్ మ్యాకే, కేటీ మార్టిన్ ( వికెట్ కీపర్), హేలీ జాన్సెన్, లియా తహిహు, జెస్ కేర్, హన్నా రో

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: India vs newzealand, Mithali Raj, Smriti Mandhana, Women's Cricket, World cup

  ఉత్తమ కథలు