హోమ్ /వార్తలు /క్రీడలు /

Women's World Cup - IND W vs NZ W : ఆఖర్లో కివీస్ జోరుకు భారత బౌలర్లు బ్రేక్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..

Women's World Cup - IND W vs NZ W : ఆఖర్లో కివీస్ జోరుకు భారత బౌలర్లు బ్రేక్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..

IND W vs NZ W : న్యూజిలాండ్ తో కీలకపోరులో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. డెత్ బౌలింగ్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో కివీస్ జోరుకు బ్రేకులు పడింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లతో దుమ్మురేపింది. పూజా 10 ఓవర్లలో కేవలం 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది.

ఇంకా చదవండి ...

  మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా సెడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న లీగ్ మ్యాచులో భారత బౌలర్లు ఆఖర్లో అద్భుతంగా బౌలింగ్ వేశారు. దీంతో.. న్యూజిలాండ్ ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. అమి సాథర్‌వెయిట్‌ (84 బంతుల్లో 75 పరుగులు.. 9 ఫోర్లు), అమీలా కేర్ ( 64 బంతుల్లో 50 ఫోర్లు ; 5 ఫోర్లు), కేటీ మార్టిన్ ( 51 బంతుల్లో 41 పరుగులు ; 3 ఫోర్లు) సత్తా చాటారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లతో దుమ్మురేపింది. పూజా 10 ఓవర్లలో కేవలం 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లతో సత్తా చాటింది. దీప్తిశర్మ, జులన్ గోస్వామికి చెరో వికెట్ దక్కింది.టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. 2.1 ఓవర్ల వద్ద న్యూజిలాండ్‌ ఓపెనర్‌ సుజీ బెట్స్‌ ను భారత ఫీల్డర్‌ పూజా వస్త్రాకర్‌ రనౌట్ చేసింది. అయితే.. రెండో వికెట్ కు కివీస్ కు దూకుడైన పార్టనర్ షిప్ లభించింది. సోఫియా డివైన్‌ దూకుడైన బ్యాటింగ్ తో భారత బౌలర్ల మీద ఒత్తిడి పెట్టింది.

  అయితే.. ఇన్నింగ్స్‌ 11వ ఓవర్లో 35 పరుగులు చేసిన డివైన్‌ వస్త్రాకర్‌ బౌలింగ్‌లో రిచా ఘోష్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత అమిలియా కేర్, అమి సాథర్ వెయిట్ మూడో వికెట్ కు అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో అమిలియా కేర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. వీరిద్దరూ మూడో వికెట్ కు 67 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. అయితే.. 64 బంతుల్లో 50 పరుగులు చేసిన అమిలియా కెర్‌ రాజేశ్వరీ గైక్వాడ్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది.

  ఆ తర్వాత సాథర్ వెయిట్ మ్యాడీ గ్రీన్, కేటీ మార్టిన్ లతో కీలక భాగస్వామ్యాలు అందించింది. అయితే, ఓ దశలో కివీస్ దూకుడు చూస్తే 300 స్కోరు వచ్చేలా కన్పించింది. అయితే, ఆఖరి ఓవర్లలో భారత బౌలర్లు కమ్ బ్యాక్ ఇచ్చారు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి కివీస్ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు.ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక, ఈ మ్యాచులో లేడి సెహ్వాగ్ షెఫాలీ వర్మపై వేటు వేసింది టీమిండియా. ఆమె ప్లేస్ లో మరో యంగ్ ప్లేయర్ యష్తికా భాటియా జట్టులో చోటు దక్కించుకుంది. ఇక, న్యూజిలాండ్ బంగ్లాతో తలపడిన సేమ్ టీమ్ తోనే బరిలోకి దిగనుంది.

  హెడ్ టు హెడ్ రికార్డులు :

  అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళా జట్టు న్యూజిలాండ్‌తో ఇప్పటి వరకు 53 వన్డేలు ఆడింది. ఇందులో వైట్‌ ఫెర్న్స్‌ 32 విజయాలు సాధించగా... భారత్‌ ఇరవైంట మాత్రమే గెలుపొందింది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది.

  వరల్డ్‌కప్‌లో ముఖాముఖి రికార్డు

  ప్రపంచకప్‌ చరిత్రలోనూ భారత్‌పై న్యూజిలాండ్‌ జట్టుదే పైచేయి. ఇప్పటి వరకు ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌లో ఇరు జట్లు తొమ్మిదిసార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో తొమ్మిదింట వైట్‌ ఫెర్న్స్‌ జయకేతనం ఎగురవేయగా.. భారత్‌ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది.

  తుది జట్లు :

  టీమిండియా : స్మృతి మంధాన, యష్తికా భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రానా, పూజా వట్సేకర్, జులన్ గో స్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్

  న్యూజిలాండ్ : సోఫియా డివెన్ (కెప్టెన్), సుజీ బేట్స్, అమీలా కేర్, ఎమీ సథర్ వైట్, మ్యాడీ గ్రీన్, ఫ్రాన్సెస్ మ్యాకే, కేటీ మార్టిన్ ( వికెట్ కీపర్), హేలీ జాన్సెన్, లియా తహిహు, జెస్ కేర్, హన్నా రో

  First published:

  Tags: India vs newzealand, Mithali Raj, Smriti Mandhana, Women's Cricket, World cup