హోమ్ /వార్తలు /క్రీడలు /

Smriti Mandhana : వావ్ స్మృతి .. నీలాగే నీ మనసు కూడా అందమైంది.. స్టార్ బ్యాటర్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..!

Smriti Mandhana : వావ్ స్మృతి .. నీలాగే నీ మనసు కూడా అందమైంది.. స్టార్ బ్యాటర్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..!

Smriti Mandhana (PC : BCCI)

Smriti Mandhana (PC : BCCI)

Smriti Mandhana : ఇక, ఈ మ్యాచ్ తర్వాత స్మృతి మంధాన చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. స్టార్ బ్యాటర్ లేడీ గంగూలీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. లవ్ యూ స్మృతి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ స్మృతి ఏం చేసిందో తెలుసా..?

  న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నీ (Womens World Cup 2022)లో భారత మహిళా జట్టు (Indian Womens Team) అదరగొట్టింది. మెగాటోర్నీలో రెండో విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవం తర్వాత భారత మహిళా జట్టు, భారీ విజయంతో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఫస్ట్ సీనియర్లు స్మృతి మంధాన (Smriti Mandhana), హర్మన్‌ప్రీత్ కౌర్ (HarmanPreet Kaur) అద్భుత సెంచరీలతో చెలరేగడంతో వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని పెట్టగలిగిన భారత జట్టు, బౌలర్లు అదరగొట్టడంతో 155 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకోగలిగింది. ఇక, ఈ మ్యాచ్ తర్వాత స్మృతి మంధాన చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. స్టార్ బ్యాటర్ లేడీ గంగూలీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. లవ్ యూ స్మృతి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ స్మృతి ఏం చేసిందో తెలుసా..?

  ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన(119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 123), హర్మన్‌ప్రీత్ కౌర్(107 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109)సెంచరీలతో కదం తొక్కారు. 78 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును ఈ ఇద్దరు ఆదుకున్నారు. సూపర్ బ్యాటింగ్‌తో నాలుగో వికెట్‌కు 184 పరుగులు జోడించి భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.

  అయితే, టీమిండియా విక్టరీ తర్వాత హయ్యెస్ట్ స్కోర్‌గా నిలిచిన స్మృతి మంధానకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించగా.. ఆమె దాన్ని హర్మన్‌ప్రీత్‌తో కలిసి పంచుకుంది. ఇతరుల క్రెడిట్‌ను తమదని చెప్పుకునే ఈ రోజుల్లో స్మృతి మంధాన తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను సహచర ప్లేయర్‌తో పంచుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంధాన గొప్ప మనసును కొనియాడుతున్నారు. ఇద్దరం కలిసే భారీ స్కోర్‌కు బాటలు వేసామని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇద్దరికి దక్కాలని ఈ సందర్భంగా స్మృతి మంధాన వ్యాఖ్యానించింది.

  " సెంచరీ చేసిన తర్వాత కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాకుంటే అది ఏ మాత్రం బావ్యం కాదనేది నా ఫీలింగ్. మా టీమ్ 300 ప్లస్ రన్స్ చేయడంలో మేం ఇద్దరం(హర్మన్ ప్రీత్) కీలక పాత్ర పోషించాం. సమానంగా రాణించాం. కాబట్టి ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇద్దరికి దక్కాలి. అందుకే ఈ ట్రోఫీని హర్మన్‌తో కలిసి పంచుకోవాలనుకుంటున్నా. మేం మా తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. మరోసారి వాటిని రిపీట్ చేయం. బ్యాటర్స్‌గా ఇద్దరం చేజింగ్, టార్గెట్‌లను సెట్ చేయడం బాగా ఇష్టపడుతాం. " అని మంధాన చెప్పుకొచ్చింది.

  ఇది కూడా చదవండి : కోహ్లీకి వర్తించిన రూల్స్ రోహిత్ శర్మకి వర్తించవా..? విరాట్ విషయంలో మరీ ఇంత అన్యాయమా..!

  టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. స్నేహ్ రాణా(3/22) బంతితో తీన్మార్ వేయడంతో 40.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.ఆ జట్టు ఓపెనర్లు డియాంద్ర డాటిన్(46 బంతుల్లో 10 ఫోర్లు సిక్స్‌తో 62), హేలే మాథ్యూస్(36 బంతుల్లో 6 ఫోర్లతో 43) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. కానీ, మిగతావారు రాణించకపోవడంతో భారీ ఓటమి తప్పలేదు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Smriti Mandhana, Team India, Women's Cricket, World cup

  ఉత్తమ కథలు