హోమ్ /వార్తలు /క్రీడలు /

Women's World Cup 2022 - INDW vs PAKW : చిరకాల ప్రత్యర్థితో తొలి మ్యాచ్.. మన అమ్మాయిలు రెడీ.. రికార్డులు ఏం చెబుతున్నాయ్..?

Women's World Cup 2022 - INDW vs PAKW : చిరకాల ప్రత్యర్థితో తొలి మ్యాచ్.. మన అమ్మాయిలు రెడీ.. రికార్డులు ఏం చెబుతున్నాయ్..?

Women's World Cup 2022 - INDW vs PAKW : భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందంటే రోడ్ల మీద షాపులు మూత పడాల్సిందే... ఇంట్లో టీవీ సెట్లు ఆన్ కావాల్సిందే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానుల్లో అంత క్రేజ్ అన్నమాట.

Women's World Cup 2022 - INDW vs PAKW : భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందంటే రోడ్ల మీద షాపులు మూత పడాల్సిందే... ఇంట్లో టీవీ సెట్లు ఆన్ కావాల్సిందే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానుల్లో అంత క్రేజ్ అన్నమాట.

Women's World Cup 2022 - INDW vs PAKW : భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందంటే రోడ్ల మీద షాపులు మూత పడాల్సిందే... ఇంట్లో టీవీ సెట్లు ఆన్ కావాల్సిందే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానుల్లో అంత క్రేజ్ అన్నమాట.

  భారత పురుషుల‌ క్రికెట్‌ (Team India)‌ టీమ్‌‌ ఇప్పటికే రెండు వన్డే వరల్డ్ కప్స్‌‌ గెలిచింది. పలువురు లెజెండ్స్‌‌, స్టార్‌‌ ప్లేయర్లు వరల్డ్‌‌ కప్‌‌ను అందుకున్నారు. కానీ, మహిళల‌ జట్టు‌ (Indian Womens Team) మాత్రం ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ప్రపంచకప్ (Women's World Cup) అందుకోలేకపోయింది. దశాబ్దాలుగా పోరాడుతున్న మిథాలీ రాజ్‌ (Mithali Raj)‌, జులన్‌‌ గోస్వామి వంటి లెజెండ్స్‌‌.. స్మతి మంధాన (Smriti Mandhana), హర్మన్‌‌ప్రీత్‌‌ వంటి స్టార్స్‌‌కు ప్రపంచ కప్‌‌ ఓ కలగానే మిగిలింది. గత ఐదారేళ్లలో అమ్మాయిల క్రికెట్‌‌కు ఆదరణ పెరిగింది. మన టీమ్‌‌ ఆట మెరుగైంది. అయితే, 2017 వన్డే వరల్డ్‌‌కప్‌‌తో పాటు 2020 టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో ఫైనల్‌‌ దాకా వచ్చిన అమ్మాయిలు.. కప్పు నెగ్గలేకపోయారు.

  ఈ నేపథ్యంలో తమ కలను నెరవేర్చుకోవడమే లక్ష్యంగా మిథాలీరాజ్‌‌ కెప్టెన్సీలోని భారత జట్టు మరోసారి వరల్డ్ వార్‌‌కు రెడీ అయింది. న్యూజిలాండ్ గడ్డపై నిన్నటి నుంచి మొదలైన వరల్డ్‌‌కప్‌‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. టీమ్‌‌లో అత్యంత సీనియర్లు మిథాలీ రాజ్‌‌, జులన్‌‌ గోస్వామికి వయసు దృష్ట్యా ఇదే చివరి వరల్డ్‌‌ కప్‌‌ కానుంది. ఇక, ఆదివారం పాకిస్థాన్ మహిళల జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది టీమిండియా. ఈ నేపథ్యంలో టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు, బలాబలాలపై ఓ లుక్కేద్దాం.

  ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ గడ్డపై అడుగు పెట్టిన భారత్.. ఫేవరేట్ కాకున్నా గట్టి పోటీదారేనని అనడంలో సందేహం లేదు. అయితే కరోనా మహమ్మారి కారణంగా చాలా రోజులు ఆటకు దూరమై.. తిరిగి మొదలెట్టాక భారత్ వరుస వైఫల్యాలను ఎదుర్కొంది. సరైన ప్రాక్టీస్‌ లేని భారత్‌.. సొంతగడ్డపై సౌతాఫ్రికాకు సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ సిరీస్‌లను చేజార్చుకుంది.

  ప్రపంచకప్‌ ముంగిట తాజాగా న్యూజిలాండ్ పర్యటనలోనూ ఓటమిపాలైంది. 1-4తో సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ ప్రదర్శన కచ్చితంగా జట్టుపై అంచనాలను గణనీయంగా తగ్గించింది. అయితే ఓడిపోయినా.. ఆ సిరీస్‌లో 250+ స్కోర్లు సాధించడం సానుకూలాంశం. ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌ (పాకిస్థాన్‌తో)కు ముందు ఫామ్‌ను అందుకుని, రెండు సన్నాహక మ్యాచ్‌ల్లో గెలవడం మిథాలీ బృందం ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. అసలు టోర్నీలో ఎలా రాణిస్తారో చూడాలి.

  ఇది కూడా చదవండి : రాక రాక అతిథులు వచ్చారు.. కానీ ఇంతలోనే ఇలా జరిగింది.. భయం గుప్పిట్లో ఆస్ట్రేలియా జట్టు..!

  పేపర్‌పై చూస్తే భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. స్మృతి మంధాన రూపంలో స్టార్‌ ఓపెనర్‌ భారత్‌ సొంతం. ఆమె దూకుడుగా ఆడగలదు, అవసరమైతే సంయమనంతో బ్యాటింగ్‌ చేస్తూ ఎక్కువ సేపు క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను నిర్మించగలదు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో మెరుపు ఆరంభాలనిచ్చే యువ షెఫాలీ వర్మ కూడా జట్టులో ఉండడం భారత్‌కు బలం.

  ఇది కూడా చదవండి : సౌరవ్ గంగూలీపై సంచలన ఆరోపణలు.. అసలేంటి దాదా ఇలా ఎలా చేస్తావ్ ..!

  ఇక అత్యంత అనుభవజ్ఞురాలైన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సుదీర్ఘ ఇన్నింగ్స్‌తో జట్టుకు వెన్నెముకలా నిలుస్తుంది.21 ఏళ్ల యాస్తిక భాటియా కూడా బ్యాటుతో ఆశలు రేపుతోంది. మిడిల్‌ ఆర్డర్‌లో హర్మన్‌ప్రీత్‌ లాంటి బ్యాటర్‌ ఉండడం భారత్‌కు సానుకూలాంశమే. అనుభవజ్ఞురాలైన దీప్తి శర్మ, వికెట్‌కీపర్‌ రీచా ఘోష్‌ కూడా ఉన్న భారత బ్యాటింగ్‌ లైనప్‌కు జట్టు స్కోరును 270 దాటించే సత్తా ఉంది. ఈ బ్యాటింగ్‌ దళం సమష్టిగా రాణిస్తే ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవు.

  బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న భారత జట్టుకు సరైన ఫినిషర్స్‌ లేకపోవడమే బలహీనతగా మారింది . ఈ కారణం వల్లే గతంలో అనేక వన్డే మ్యాచ్‌ల్లో దెబ్బతింది కూడా. ఫినిషర్స్‌ లేకపోవడం వల్లే టాప్‌ ఆర్డర్‌ బలమైన పునాది వేస్తున్నా ఇతర జట్లలా 260-270 స్కోర్లను 300పై చిలుకు స్కోర్లుగా భారత్‌ చేయలేకపోతుంది. మరి ప్రపంచకప్‌లో ఈ సమస్యను భారత్‌ ఎలా అధిగమిస్తుందో చూడాలి.

  హెడ్ టు హెడ్ రికార్డులు :

  వన్డే ప్రపంచకప్పుల్లో భారత్, పాక్ మహిళల జట్లు రెండు సార్లు తలపడగా.. రెండు సార్లు మనదే పై చేయి. ఈ మెగా టోర్నీలో పాక్.. భారత్ ను ఇంతవరకు ఓడించలేదు. ఇక, రెండు దేశాల ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మ్యాచులు జరగడం లేదు. అయితే వన్డేల్లో పాక్ పై భారత మహిళలకు తిరుగులేని రికార్డు ఉంది. ఇంతవరకు.. ఈ ఫార్మాట్ లో పాక్ పై ఓడిపోలేదు. 10 వన్డేలు ఆడితే 10 వన్డేల్లోనూ టీమిండియా దుమ్మురేపింది.

  First published:

  Tags: India VS Pakistan, Mithali Raj, Smriti Mandhana, Women's Cricket, World cup

  ఉత్తమ కథలు