Home /News /sports /

WOMENS WORLD CUP 2022 IND W VS SA W LIVE SCORE UPDATES INDIA WOMEN HAVE WON THE TOSS AND OPTED TO BAT FIRST SRD

Women's World Cup - IND W vs SA W : డూ ఆర్ డై మ్యాచులో టాస్ టీమిండియాదే.. కీ ఫైట్ కు జులన్ గోస్వామి దూరం..

IND W vs SA W

IND W vs SA W

Women's World Cup - IND W vs SA W : సౌతాఫ్రికాతో వన్డేల్లో ముఖాముఖి పోరులో టీమిండియాదే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 27 మ్యాచ్ లు ఆడగా... అందులో భారత్ 15 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.

    న్యూజిలాండ్ (New Zealand) వేదికగా జరుగుతోన్న మహిళల వన్డే ప్రపంచకప్ (World Cup)లో తాడో పేడో తేల్చుకోవడానికి టీమిండియా (Team India) సిద్ధమైంది. మిథాలీ రాజ్ (Mithali Raj) సారథ్యంలోని భారత (India) మహిళల జట్టు దక్షిణాఫ్రికా (South Africa) మహిళల జట్టుతో డూ ఆర్ డై పోరుకు సై అంటోంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తేనే సెమీఫైనల్లోకి అడుగుపెడుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం భారత్ సెమీస్ ఆశలు దాదాపుగా ముగిసిపోయినట్లే. ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. జులన్ గో స్వామి స్థానంలో మేఘ్నా సింగ్ బరిలోకి దిగనుంది. మరోవైపు, లెగ్ స్పిన్నర్ పునమ్ యాదవ్ ప్లేసులో దీప్తి శర్మ తిరిగి జట్టులో చోటు సంపాదించుకుంది. ఇక, సౌతాఫ్రికా కూడా తమ జట్టులో రెండు మార్పులు చేసింది. ఇక , సౌతాఫ్రికా అమ్మాయిలు ఇప్పటికే సెమీస్ చేరుకున్నారు.

    మహిళల ప్రపంచకప్ లో టీమిండియాను బ్యాటింగ్ సమస్య ప్రధానంగా వేధిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో ఒక్క వెస్టిండీస్ జట్టుపైనే మన బ్యాటర్లు చెలరేగారు. మిగిలిన మ్యాచ్ ల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేకపోయారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి మేటి జట్లపై అయితే మరీ ఘోరంగా ఆడారు. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి జట్లపై ఓ మోస్తరుగా ఆడారు. జట్టులో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి స్టార్ బ్యాటర్లకు కొదవలేదు. కానీ, అవసరమైన చోటు వీరు తమ బ్యాట్లను ఝుళిపించలేకపోతున్నారు.


    స్మృతి మంధాన, యస్తిక భాటియా మాత్రమే నిలకడగా రాణిస్తోండగా... వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రమే హర్మన్ ప్రీత్ కౌర్ సత్తా చాటింది. ఇక చివరి ప్రపంచకప్ ఆడుతోన్న మిథాలీ రాజ్ జట్టుకు భారంగా కనిపిస్తోంది. ఆమె పలుమార్లు అర్ధ సెంచరీలు సాధించినా అవి జట్టుకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఆమె మరీ నెమ్మదిగా ఆడుతోంది. 60 కంటే తక్కువ స్ట్రయిక్ రేట్ తో ఆమె పరుగులు సాధిస్తోంది. వన్డేల్లో ఈ స్ట్రయిక్ రేట్ సరిపోదు. ఇక బౌలింగ్ లో మాత్రం భారత్ ఫర్వాలేదనిపిస్తోంది. పూజా వస్త్రాకర్ తో పాటు యంగ్ స్నేహ్ రాణా చక్కగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికాపై భారత్ సమష్టి ప్రదర్శనతో గెలవాల్సి ఉంది.

    మరోవైపు, సౌతాఫ్రికా అమ్మాయిలు ఈ మెగాటోర్నీలో చెలరేగాడు. ఒక ఆస్ట్రేలియా మ్యాచ్ లో తప్ప.. మిగతా గేమ్స్ లో విజయ భేరి మోగించారు. దీంతో, ఆస్ట్రేలియా తర్వాత సెమీస్ చేరిన రెండో జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. కెప్టెన్ సున్ లీస్, మెగన్న్ డు ప్రీజ్, లారా వాల్వార్డ్, మరిజన్నా కాప్ సౌతాఫ్రికాలో డేంజరస్ ప్లేయర్లు. వీరిని నిలవరిస్తేనే టీమిండియా విజయం సాధించగలదు.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    సౌతాఫ్రికాతో వన్డేల్లో ముఖాముఖి పోరులో టీమిండియాదే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 27 మ్యాచ్ లు ఆడగా... అందులో భారత్ 15 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. సఫారీ టీం 11 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మిగిలిన ఒక మ్యాచ్ రద్దయింది.

    తుది జట్లు :

    టీమిండియా : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, పుజా వస్త్రాకర్, మేఘ్నా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్

    సౌతాఫ్రికా : లీజ్లీ లీ, లారా వాల్వార్డ్, లారా గుడాల్, సున్ లుస్ (కెప్టెన్), మెగన్న్ డు ప్రీజ్, మరిజన్నా కాప్, చోలె టాయాన్, త్రిషా చెట్టి (వికెట్ కీపర్), షబ్నిమ్ ఇస్మాయిల్, అయోబోంగా కాకా, మసాబాతా క్లాస్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: India vs South Africa, Mithali Raj, Smriti Mandhana, Team India, Women's Cricket, World cup

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు