మహిళల వన్డే ప్రపంచకప్ (Women's World Cup 2022) టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు (Indian Womens Team)కు మెరుపు ఆరంభం అందింది. లేడి సెహ్వాగ్ షెఫాలీ వర్మ (Shafali Verma) తనదైన స్టైల్ లో మెరుపులు మెరిపించింది. ముఖ్యంగా షబ్నమ్ ఇస్మాయిల్ బౌలింగ్ ను టార్గెట్ చేసుకుని బౌండరీలు బాదింది. ఈ క్రమంలో 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. మరో ఎండ్ లో స్మృతి కూడా చెత్త బంతుల్ని బౌండరీలు తరలించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరి ధాటికి 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. మెరుపు ఆరంభం దక్కింది.. ఇక రెచ్చిపోవడమే తరువాయి అనుకున్న సమయంలో టీమిండియా జోరుకు బ్రేకులు పడ్డాయ్. 46 బంతుల్లో 53 పరుగులు చేసి మంచి టచ్ లో కన్పించిన షెఫాలీ వర్మ రనౌట్‌తో పెవిలియన్‌కు చేరింది. ఇందులో స్మృతి, షెఫాలీల ఇద్దరి తప్పు ఉంది. ఆ తర్వాత మంచి ఫామ్ లో ఉన్న యస్తికను దురదృష్టం వెంటాడింది. లెగ్ సైడ్ వైడ్ బంతిని వెంటాడిన యస్తిక కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ట్రయాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో 96 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. క్రీజులో స్మృతి మంధాన (40 పరుగులు), మిథాలీ (12 పరుగులు) ఉన్నారు. వీరిద్దరూ రాణిస్తే టీమిండియా మంచి స్కోరు సాధించడం ఖాయం.మహిళల ప్రపంచకప్ లో టీమిండియాను బ్యాటింగ్ సమస్య ప్రధానంగా వేధిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో ఒక్క వెస్టిండీస్ జట్టుపైనే మన బ్యాటర్లు చెలరేగారు. మిగిలిన మ్యాచ్ ల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేకపోయారు.
𝐒𝐡𝐨𝐰𝐢𝐧𝐠 𝐡𝐞𝐫 𝐟𝐮𝐥𝐥 𝐫𝐚𝐧𝐠𝐞!@TheShafaliVerma brings up her maiden World Cup 𝟱𝟬 in 40 balls with the help of 8 boundaries. 👏🏾 #TeamIndia 83-0 in 13.3 overs.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి మేటి జట్లపై అయితే మరీ ఘోరంగా ఆడారు. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి జట్లపై ఓ మోస్తరుగా ఆడారు. జట్టులో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి స్టార్ బ్యాటర్లకు కొదవలేదు. కానీ, అవసరమైన చోటు వీరు తమ బ్యాట్లను ఝుళిపించలేకపోతున్నారు. అయితే, ఈ మ్యాచులో షెఫాలీ సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు :
సౌతాఫ్రికాతో వన్డేల్లో ముఖాముఖి పోరులో టీమిండియాదే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 27 మ్యాచ్ లు ఆడగా... అందులో భారత్ 15 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. సఫారీ టీం 11 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మిగిలిన ఒక మ్యాచ్ రద్దయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.