హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs PAK W : తడబడి నిలబడ్డ అమ్మాయిలు.. పాక్ ముందు టఫ్ టార్గెట్.. పుజా, స్నేహ్ రాణా అదుర్స్..

IND W vs PAK W : తడబడి నిలబడ్డ అమ్మాయిలు.. పాక్ ముందు టఫ్ టార్గెట్.. పుజా, స్నేహ్ రాణా అదుర్స్..

IND W vs PAK W : 114 పరుగులకే ఆరు వికెట్లు.. ఈ దశలో టీమిండియా స్కోరు 150 ఐనా దాటుతుందా అన్న అనుమానం. కానీ, పూజా, స్నేహ్ రాణా అదిరిపోయే పోరాటంతో టీమిండియాకు మంచి స్కోరు అందించారు.

IND W vs PAK W : 114 పరుగులకే ఆరు వికెట్లు.. ఈ దశలో టీమిండియా స్కోరు 150 ఐనా దాటుతుందా అన్న అనుమానం. కానీ, పూజా, స్నేహ్ రాణా అదిరిపోయే పోరాటంతో టీమిండియాకు మంచి స్కోరు అందించారు.

IND W vs PAK W : 114 పరుగులకే ఆరు వికెట్లు.. ఈ దశలో టీమిండియా స్కోరు 150 ఐనా దాటుతుందా అన్న అనుమానం. కానీ, పూజా, స్నేహ్ రాణా అదిరిపోయే పోరాటంతో టీమిండియాకు మంచి స్కోరు అందించారు.

  మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫస్ట్ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ముందు తడబడి ఆఖర్లో నిలబడింది. ఫలితంగా దాయాది పాక్ ముందు టఫ్ టార్గెట్ ను సెట్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. 114 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన భారత్.. ఆఖర్లో పుజా, స్నేహ్ రాణాలతో పోరాటంతో మంచి స్కోరును సాధించింది. పుజా వట్సేకర్ (59 బంతుల్లో 67 పరుగులు ; 8 ఫోర్లు), స్నేహ్ రాణా (48 బంతుల్లో 53 పరుగులు నాటౌట్ ; 4 ఫోర్లు), స్మృతి మంధాన (75 బంతుల్లో 52 పరుగులు; 3 ఫోర్లు, 1 సిక్సర్).. హాఫ్ సెంచరీలతో రాణించారు. దీప్తి శర్మ (57 బంతుల్లో 40 పరుగులు ; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది.షెఫాలీ వర్మ (0), మిథాలీ రాజ్(9), హర్మన్ ప్రీత్ కౌర్ (5), రిచా ఘోష్ (1) విఫలమయ్యారు. నిదా దార్, నషారా సంధు చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు.

  భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ(0) ప్రపంచకప్ టోర్నీలోనూ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తోంది. మరోసారి డకౌట్‌గా వెనుదిరిగింది.

  క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మతో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో రెండో వికెట్ కు వీరిద్దరూ 50 పరుగులపైగా భాగస్వామ్యాన్ని జోడించారు. అంతా, ఓకే అనుకునే లోపు.. దీప్తి శర్మ నషారా సంధు బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో 96 పరుగులకు రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా.

  ఇక, అక్కట్నుంచి టీమిండియా కష్టాలు మొదలయ్యాయ్. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసిన స్మృతి మంధాన అనమ్ అమీన్ బౌలింగ్ కౌచ్ అండ్ బౌల్ గా వెనుదిరిగింది. ఆ తర్వాత కాసేపటికే.. హర్మన్ ప్రీత్ నిదా దార్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది.

  ఆ వెంటనే రిచా ఘోష్ నిదా దార్ బౌలింగ్ లోనే క్లీన్ బౌల్డ్ అయింది.ఇక, ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా అనవసరపు షాట్ కు యత్నించి టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టింది. నషారా సంధు బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి డయానా బేగ్ కి క్యాచ్ ఇచ్చి ఔటైంది టీమిండియా కెప్టెన్. 114 పరుగులకే ఆరు వికెట్లు పడి కష్టాల్లో పడ్డ టీమండియాను పూజా, స్నేహ్ రాణాలు ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్ కు 122 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

  తొలిపోరులోనే పాక్‌తో భారత్‌ తలపడుతుండడంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఈ మ్యాచ్‌ను తిలకిస్తున్నారు. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ నేతృత్వంలో బరిలోకి దిగుతున్న భారత జట్టు ఎలాగైనా ఈ సారి కప్పు కొట్టాలని దృఢనిశ్చయంతో ఉంది. వన్డేల్లో భారత్‌కు పాక్‌ జట్టుపై తిరుగులేని రికార్డు ఉంది. పాక్‌తో తలపడిన పదిమ్యాచుల్లో భారత్‌ విజయం సాధించింది.

  వన్డే ప్రపంచకప్‌లోనూ భారత్‌ రెండుసార్లు పాక్‌ను ఓడించింది.కెప్టెన్‌ మిథాలీతో పాటు వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామికి ఇదే చివరి ప్రపంచకప్‌ అయిన నేపథ్యంలో.. కప్పుతో వీళ్లకు వీడ్కోలు పలకాలని జట్టు పట్టుదలతో ఉంది. పాక్‌పై ఘన విజయంతో శుభారంభం చేసి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చూస్తోంది.

  తుది జట్లు :

  భారత జట్టు : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, మిథాలీరాజ్‌, రిచా గోష్‌(వికెట్‌ కీపర్‌), స్నేహ్‌ రాణా, జూలన్‌ గోస్వామి, మేఘన్‌ సింగ్‌, పూజా వస్త్రాకర్‌, రాజేశ్వరి గైక్వాడ్‌

  పాకిస్థాన్ : జవేరియా ఖాన్, సిద్రా అమీన్, ఓమిమా సోహాలీ, బిస్మా మరూఫ్ (కెప్టెన్), నిదా దార్, ఆలియా రియాజ్, ఫతిమా సనా, సిద్రా నవాజ్ (వికెట్ కీపర్), డయానా బేగ్, నషారా సంధు, అనమ్ అమీన్

  First published:

  Tags: India VS Pakistan, Mithali Raj, Smriti Mandhana, Team India, World cup

  ఉత్తమ కథలు