హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs PAK W : శభాష్ అమ్మాయిలు.. చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. విశ్వ సమరంలో బోణి అదిరింది..

IND W vs PAK W : శభాష్ అమ్మాయిలు.. చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. విశ్వ సమరంలో బోణి అదిరింది..

IND W vs PAK W : పాక్ పై ఉన్న అజేయ విన్నింగ్ రికార్డును కంటిన్యూ చేసింది మిథాలీ సేన. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా అదిరిపోయే విక్టరీతో విశ్వసమరంలో బోణి కొట్టింది.

IND W vs PAK W : పాక్ పై ఉన్న అజేయ విన్నింగ్ రికార్డును కంటిన్యూ చేసింది మిథాలీ సేన. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా అదిరిపోయే విక్టరీతో విశ్వసమరంలో బోణి కొట్టింది.

IND W vs PAK W : పాక్ పై ఉన్న అజేయ విన్నింగ్ రికార్డును కంటిన్యూ చేసింది మిథాలీ సేన. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా అదిరిపోయే విక్టరీతో విశ్వసమరంలో బోణి కొట్టింది.

  మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దాయాదీ పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ప్రత్యర్థి పాకిస్థాన్ చిత్తుగా ఓడించింది. దీంతో, విశ్వసమరంలో అదిరిపోయే బోణితో తమ జైత్రయాత్రను ప్రారంభించింది. 245 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్ 43 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా 107 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో పాక్ పై ఉన్న అజేయ విన్నింగ్ రికార్డును కంటిన్యూ చేసింది మిథాలీ సేన. రాజేశ్వరి గైక్వాడ్ నాలుగు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించింది. జులన్ గోస్వామి, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు.245 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్థాన్ తమ ఇన్నింగ్స్ ను చాలా నిదానంగా ప్రారంభించింది. పాక్ ఓపెనర్లు దూకుడుగా ఆడలేదు. దీంతో ఒత్తిడిలోకి వెళ్లిన దాయాది జట్టు అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. 11 ఓవర్ లో 28 పరుగుల వద్ద పాక్ తమ ఫస్ట్ వికెట్ ను కోల్పోయింది. జవేరియా ఖాన్ (11 పరుగులు) చేసి.. రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టింది.

  ఆ తర్వాత కెప్టెన్ బిస్మా మరూఫ్ మరో ఓపెనర్ సిద్రా అమీన్ తో కలిసి ఇన్నింగ్స్ చక్క దిద్దే ప్రయత్నం చేసింది. అయితే, పాక్ కెప్టెన్ జోరుకు దీప్తి శర్మ బ్రేకులు వేసింది. 15 పరుగులు చేసిన బిస్మా వికెట్ కీపర్ రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టింది. దీంతో 53 పరుగుల వద్ద దాయాది రెండో వికెట్ ను కోల్పోయిందిఇక, ఆ తర్వాత నుంచి వరుస విరామాల్లో పాక్ ను దెబ్బతీశారు భారత బౌలర్లు. 58, 67,70, 87, 98, 113, 114 ఇలా జట్టు స్కోరు వద్ద వరుస విరామాల్లో వికెట్లు తీసి ఆ జట్టుపై ఒత్తిడి పెంచారు. అయితే, ఆఖర్లో డయానా బేగ్ బ్యాట్ ఝళిపించడంతో పాక్ ఈ మాత్రం ఈ స్కోరైనా చేయగలిగింది.

  ఇక, అంతకుముందు.. నిర్ణీత 50ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది టీమిండియా. పూజా వస్త్రాకర్​(67), స్నేహ్​ రానా(53*), స్మృతి మంధాన(52), దీప్తి శర్మ(40) అదరగొట్టారు. కాగా, పాక్​ బౌలర్లలో నిదా దార్​, నష్రా సంధు తలో రెండు, దియానా బాగ్, అనమ్​ అమిన్​, ఫాతిమా సానా తలో వికెట్​ తీశారు. టాస్ గెలిచి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(0) తన పేలవ ఫామ్‌ను కొనసాగించి తీవ్రంగా నిరాశపరిచింది.

  డయానా బౌగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ‌తో ఓపెనర్ స్మృతి మంధాన ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. ఆరంభంలోనే వికెట్ కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన భారత బ్యాటర్లు ఆచితూచి ఆడారు. దాంతో స్కోర్ బోర్డు నెమ్మదిగా ముందుకు కదిలింది. ఇక మంధాన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. దీప్తి శర్మ హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. సంధు బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

  ఆ కొద్దిసేపటికే స్మృతి మంధాన రిటర్న్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్(1), మిథాలీ రాజ్(9) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో టీమిండియా 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్ భారత్‌ను ఆదుకున్నారు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ భారత్‌కు గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు.

  First published:

  Tags: India VS Pakistan, Mithali Raj, Women's Cricket, World cup

  ఉత్తమ కథలు