హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs PAK W : బ్లాక్ బస్టర్ పోరులో టాస్ గెలిచిన టీమిండియా.. అమ్మాయిలు కుమ్మేయండి..

IND W vs PAK W : బ్లాక్ బస్టర్ పోరులో టాస్ గెలిచిన టీమిండియా.. అమ్మాయిలు కుమ్మేయండి..

IND W vs PAK W : గత ఐదారేళ్లలో అమ్మాయిల క్రికెట్‌‌కు ఆదరణ పెరిగింది. మన టీమ్‌‌ ఆట మెరుగైంది. అయితే, 2017 వన్డే వరల్డ్‌‌కప్‌‌తో పాటు 2020 టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో ఫైనల్‌‌ దాకా వచ్చిన అమ్మాయిలు.. కప్పు నెగ్గలేకపోయారు.ఈ నేపథ్యంలో తమ కలను నెరవేర్చుకోవడమే లక్ష్యంగా మిథాలీరాజ్‌‌ కెప్టెన్సీలోని భారత జట్టు మరోసారి వరల్డ్ వార్‌‌కు రెడీ అయింది.

ఇంకా చదవండి ...

  న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లు రంజుగా జరుగుతున్నాయి. కివీస్ గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటికే పలు మ్యాచ్‌లు ముగిశాయి. కాసేపట్లో భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. నిజానికి మహిళల మ్యాచ్‌లకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కాబట్టి ఈ పోరు పట్ల అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా.భారత పురుషుల‌ క్రికెట్‌(Team India)‌ టీమ్‌‌ ఇప్పటికే రెండు వన్డే వరల్డ్ కప్స్‌‌ గెలిచింది. పలువురు లెజెండ్స్‌‌, స్టార్‌‌ ప్లేయర్లు వరల్డ్‌‌ కప్‌‌ను అందుకున్నారు. కానీ, మహిళల‌ జట్టు‌ (Indian Womens Team) మాత్రం ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ప్రపంచకప్ (Women's World Cup) అందుకోలేకపోయింది. దశాబ్దాలుగా పోరాడుతున్న మిథాలీ రాజ్‌ (Mithali Raj)‌, జులన్‌‌ గోస్వామి వంటి లెజెండ్స్‌‌.. స్మతి మంధాన (Smriti Mandhana), హర్మన్‌‌ప్రీత్‌‌ వంటి స్టార్స్‌‌కు ప్రపంచ కప్‌‌ ఓ కలగానే మిగిలింది.

  గత ఐదారేళ్లలో అమ్మాయిల క్రికెట్‌‌కు ఆదరణ పెరిగింది. మన టీమ్‌‌ ఆట మెరుగైంది. అయితే, 2017 వన్డే వరల్డ్‌‌కప్‌‌తో పాటు 2020 టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో ఫైనల్‌‌ దాకా వచ్చిన అమ్మాయిలు.. కప్పు నెగ్గలేకపోయారు.ఈ నేపథ్యంలో తమ కలను నెరవేర్చుకోవడమే లక్ష్యంగా మిథాలీరాజ్‌‌ కెప్టెన్సీలోని భారత జట్టు మరోసారి వరల్డ్ వార్‌‌కు రెడీ అయింది.

  అయితే, మ‌హిళ‌ల క్రికెట్‌లోనూ పాకిస్థాన్‌పై భారత జట్టుకు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వ‌ర‌కు పాకిస్థాన్‌పై 10 వ‌న్డేల్లో భారత మహిళల జ‌ట్టు గెలిచింది. 11 సార్లు జ‌రిగిన టీ20 మ్యాచుల్లోనూ ఒక్కసారి మాత్రమే ఇండియా ఓడిపోయింది. స్మృతి మందాన , షెఫాలీ వర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలతో టీమిండియా స్ట్రాంగ్ గా ఉంది.. ప్రపంచకప్ వార్మప్ మ్యాచుల్లో ద‌క్షిణాఫ్రికా, విండీస్‌తో జ‌రిగిన మ్యాచుల్లో ఇండియా నెగ్గింది. పాకిస్థాన్‌తో జ‌రిగే ఈ మ్యాచ్‌లోనూ ఇండియానే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా మ‌హ‌రూఫ్ ఇటీవ‌లే మెట‌ర్నటీ లీవ్ నుంచి వ‌చ్చేసింది. ఆరు నెలల కూతురు ఉన్న ఆమె భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడనుంది. పాక్ జట్టు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది.

  తుది జట్లు :

  భారత్ : స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రానా, పూజా వట్సేకర్, జులన్ గో స్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్

  పాకిస్థాన్ : జవేరియా ఖాన్, సిద్రా అమీన్, ఓమిమా సోహాలీ, బిస్మా మరూఫ్ (కెప్టెన్), నిదా దార్, ఆలియా రియాజ్, ఫతిమా సనా, సిద్రా నవాజ్ (వికెట్ కీపర్), డయానా బేగ్, నస్రా సంధు, అనమ్ అమీన్

  First published:

  Tags: India VS Pakistan, Mithali Raj, Smriti Mandhana, Women's Cricket, World cup

  ఉత్తమ కథలు