WOMENS WORLD CUP 2022 IND W VS AUS W LIVE UPDATES AUSTRALIA WOMEN WON BY SIX WICKETS SRD
Women's World Cup 2022 - IND W vs AUS W : ఆస్ట్రేలియాదే విక్టరీ.. కీలక మ్యాచులో ఓడిన భారత్.. సెమీస్ అవకాశాలు సంక్లిష్టం..
Photo Credit : ICC
Women's World Cup 2022 - IND W vs AUS W : ఆస్ట్రేలియా జైత్రయాత్రకు బ్రేకుల్లేకుండా పోయింది. మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు ఆస్ట్రేలియా అమ్మాయిలు. అయితే, ఈ ఓటమితో టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయ్.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా అమ్మాయిల జైత్రయాత్రకు బ్రేకులు పడటం లేదు. 278 పరుగుల టార్గెట్ ను ఆస్ట్రేలియా మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేజ్ చేసింది. ఆరు వికెట్లతో తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. ఆస్ట్రేలియాకు వరుసగా ఐదో విజయం. ఈ విక్టరీతో తమ టాప్ ప్లేస్ ను మరింత పదిలం చేసుకుంది కంగారూల టీమ్. ఆఖరి ఓవర్లలో 8 పరుగులు అవసరమవ్వగా.. బెత్ మూనీ మూడు బంతుల్లో పది పరుగులు చేసి ఆస్ట్రేలియాకు సూపర్ విక్టరీ అందించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మెక్ లానింగ్ (107 బంతుల్లో 97 పరుగులు ; 13 ఫోర్లు), అలీసా హేలీ (65 బంతుల్లో 72 పరుగులు ; 9 ఫోర్లు) తో సత్తా చాటారు. వీరికి తోడుగా రాచెల్ హేన్స్ (43), ఎలీసా పెర్రీ (28), బెత్ మూనీ (30 పరుగుల నాటౌట్) అద్భుతంగా రాణించారు. టీమిండియా బౌలర్లలో పూజా రెండు వికెట్లతో సత్తా చాటింది. స్నేహ్ రాణా, మేఘనా సింగ్ చెరో వికెట్ తీశారు. జులన్ గోస్వామి, రాజేశ్వరి వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. ఈ ఓటమితో టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టం చేసుకుంది.
278 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. ఆసీస్ ఓపెనర్లు . టీమిండియా బౌలర్లకు చాన్స్ ఇవ్వకుండా దూకుడైన ఆటతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అలిసా హేలీ ధాటిగా ఆడితే.. మరో ఓపెనర్ రాచల్ హెన్స్ ఆమెకు సహకరించింది. ఈ క్రమంలో అలీసా హేలీ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే 121 పరుగుల భాగస్వామ్యం తర్వాత వెంట వెంటనే ఆస్ట్రేలియా ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు.
ఆరంభం నుంచి ధాటిగా ఆడుతున్న ఓపెనర్ అలిస్సా హేలీ 72 పరుగులు చేసి స్నేహ రాణా బౌలింగ్‌లో మిథాలీ రాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ 21వ ఓవర్ ఆఖరి బంతికి పూజా వస్త్రాకర్ 43 పరుగులు చేసిన హేన్స్‌ను ఔట్ చేసి ఆసీస్‌కు షాక్ ఇచ్చింది. వెంటనే వెంటనే వికెట్లు తీసినా ఆనందం టీమిండియా ముందు ఎంతో సేపు నిలవలేదు. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ తన సూపర్ బ్యాటింగ్ తో టీమిండియా బౌలర్ల మీద ఒత్తడి పెంచింది. మెగ్ లానింగ్ కు మరో ఎండ్ లో ఎల్లీస్ పెర్రీ సహకరిచింది.
అయితే.. మధ్యలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం మొదలవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. కానీ, వెంటనే వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ ను ఆరంభించారు. ఆ వెంటనే ఎల్లీస్ పెర్రీ ఔటవ్వడంతో టీమిండియా శిబిరంలో ఆశ మొదలైంది. అయితే, ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్, బెత్ మూనీ టీమిండియా ఆశల మీద నీళ్లు చల్లారు. ఆఖర్లో లానింగ్ ఔటైనా.. మూనీ దూకుడైన ఆటతో ఆసీస్ కు విజయాన్ని అందించింది. ఈ మెగాటోర్నీలో టీమిండియాకు ఇది ఐదో విజయం.
అంతకుముందు, కెప్టెన్ మిథాలీ రాజ్(96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 68తో పాటు యస్తిక భాటియా(83 బంతుల్లో 6 ఫోర్లతో 59), హర్మన్ ప్రీత్ కౌర్(47 బంతుల్లో 6 ఫోర్లతో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో పూజా వస్త్రాకర్(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 34) మెరుపులు మెరిపించింది. దీంతో, టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్స్ స్మృతి మంధాన(10), షెఫాలీ వర్మ(12) దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో డార్సీ బ్రౌన్స్ మూడు, అలన కింగ్ రెండు, జెస్స్ జొనాస్సెన్ ఓ వికెట్ తీసింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.