Home /News /sports /

WOMENS WORLD CUP 2022 IND W VS AUS W LIVE SCORE UPDATES INDIAN WOMEN TEAM SETS FIGHTING TOTAL ON BOARD SRD

Women's World Cup 2022 - IND W vs AUS W : మిథాలీ, యస్తికా, హర్మన్ అదుర్స్.. ఆస్ట్రేలియా ముందు ఫైటింగ్ టోటల్..

IND W vs AUS W

IND W vs AUS W

IND W vs AUS W : భారత అమ్మాయిలు.. ఈ వరల్డ్ కప్ లో రెండు మ్యాచుల్లో నెగ్గితే.. మరో రెండింటిలో ఓటమి పాలైంది. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సెమీస్ రేస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే.

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకపోరులో టీమిండియా బ్యాటర్లు మెరిశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగుల ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది మిథాలీ సేన. మిథాలీ రాజ్ (96 బంతుల్లో 68 పరుగులు ; 4 ఫోర్లు, 1 సిక్సర్), యస్తికా భాటియా (83 బంతుల్లో 59 పరుగులు ; 6 ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 57 పరుగులు ; 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఆఖర్లో పుజా (28 బంతుల్లో 34 పరుగులు; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో డార్సీ బ్రౌన్ మూడు వికెట్లు, అలానా కింగ్ రెండు వికెట్లతో సత్తా చాటారు.టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న స్మృతి మంధాన (10) పరుగులు చేసి డార్సీ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టింది. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ షెఫాలీ వర్మ(12) కూడా డార్సీ బౌలింగ్ లోనే పెవిలియన్ బాట పట్టింది. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను మిథాలీ రాజ్, యంగ్ బ్యాటర్ యస్తిక బాటియా ఆదుకున్నారు.

    ఈ ఇద్దరు రెండో వికెట్‌కు ఇప్పటివరకు 123 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, యస్తికా బాటియా సూపర్‌ అర్థసెంచరీలతో మెరిశారు. 78 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో మిథాలీ హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకోగా.. యస్తికా 77 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో ఫిప్టీ సాధించింది. అయితే, హాఫ్ సెంచరీ చేసిన తర్వాత యస్తికా బాటియా(59) రూపంలో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. ఆ వెంటనే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(68) రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. అలానా కింగ్‌ బౌలింగ్‌ళో మిథాలీ పెర్రీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత రిచా ఘోష్, స్నేహ్ రాణా విఫలమయ్యారు.


    8 పరుగులు చేసిన రిచా ఘోష్‌ అలానా కింగ్‌ బౌలింగ్‌లో స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగింది. అనంతరం 42వ ఓవర్లో స్నేహ రాణా డకౌట్‌ అయింది. అయితే, ఆఖర్లో హర్మన్ ప్రీత్ కౌర్, పూజా వస్త్రాకర్ మెరుపులు మెరిపించారు. వరుసగా బౌండరీ, సిక్సర్లు బాది టీమిండియాకు మంచి స్కోరు అందించారు. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని.. ఈ మెగా టోర్నిలో తన ఫామ్ ను కంటిన్యూ చేసింది.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    ఇక, హెడ్ టు హెడ్ రికార్డులు టీమిండియాను కలవరపెడుతున్నాయ్. వన్డేల్లో రెండు జట్లు 49 సార్లు తలపడగా.. 39 సార్లు ఆస్ట్రేలియా విజయకేతనం ఎగురవేసింది. భారత అమ్మాయిలు కేవలం 10 మ్యాచుల్లో మాత్రమే నెగ్గారు.

    తుది జట్లు :

    టీమిండియా : స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యష్తికా భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రానా, పూజా వస్త్రాకర్, జులన్ గో స్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్

    ఆస్ట్రేలియా : రాచెల్ హేన్స్, అలీసా హేలీ (వికెట్ కీపర్), మెగ్ లానింగ్ (కెప్టెన్), ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, తహిలా మెక్ గ్రాత్, యాష్లే గార్డెనర్, జెస్ జొనెసెన్, అలానా కింగ్, మేఘన్ స్కట్, డార్సీ బ్రౌన్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, India vs australia, Mithali Raj, Smriti Mandhana, Women's Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు