WOMENS WORLD CUP 2022 IND W VS AUS W LIVE SCORE UPDATES AUSTRALIA WOMEN TEAM WON THE TOSS AND ELECTED TO FIELD FIRST SRD
Women's World Cup 2022 - IND W vs AUS W : డూ ఆర్ డై ఫైట్ లో టాస్ ఓడిన భారత్.. కీలక మార్పుతో బరిలోకి మిథాలీ సేన..
IND W vs AUS W
IND W vs AUS W : భారత అమ్మాయిలు.. ఈ వరల్డ్ కప్ లో రెండు మ్యాచుల్లో నెగ్గితే.. మరో రెండింటిలో ఓటమి పాలైంది. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సెమీస్ రేస్ లో నిలవాలంటే టాప్ 4 లో కచ్చితంగా ఉండాలి.
మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా మరో కీలక పోరుకు రెడీ అయింది. భారత మహిళల జట్టుకు ఇది చావో రేవో మ్యాచ్ లాంటిదే. ఈ వరల్డ్ కప్ లో ఓటమెరుగని ఆస్ట్రేలియా అమ్మాయిలతో అమీతుమీ తేల్చుకోనుంది మిథాలీ సేన. ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా మహిళల జట్టు. ఇక, ఈ మ్యాచులో టీమిండియా కీలక మార్పు చేసింది. ఫామ్ లో లేని దీప్తి శర్మను పక్కన పెట్టింది. డేరింగ్ బ్యాటర్ షెఫాలీ వర్మను జట్టులోకి తీసుకుంది. ఇక, ఆస్ట్రేలియా జట్టులో కూడా ఒక మార్పు చోటు చేసుకుంది. సదర్ ల్యాండ్ ప్లేస్ లో డార్సీ బ్రౌన్ చోటు దక్కించుకుంది. భారత అమ్మాయిలు.. ఈ వరల్డ్ కప్ లో రెండు మ్యాచుల్లో నెగ్గితే.. మరో రెండింటిలో ఓటమి పాలైంది. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సెమీస్ రేస్ లో నిలవాలంటే టాప్ 4 లో కచ్చితంగా ఉండాలి. న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓడినా...పాకిస్తాన్, వెస్టిండీస్‌లపై సాధించిన ఘన విజయాలు టీమిండియాకు మెరుగైన నెట్ రన్ రేట్ అందించాయ్. తొలి రెండు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్ రేసులో ముందుండగా.. తర్వాతి రెండు స్థానాల కోసం భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్ పోటి పడుతున్నాయి.
వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన ఇంగ్లండ్.. భారత్‌పై విజయంతో సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. దీంతో, మిథాలీసేన సెమీస్ చేరాలంటే ఇంక నుంచి ఆడే ప్రతీ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో జరిగే మ్యాచ్‌లో భారత మహిళలు కచ్చితంగా గెలవాలి. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే భారత్‌కు సెమీస్‌కు లైన్ క్లియర్ అవుతోంది. ఇక ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి ఓడి బంగ్లాదేశ్ మహిళలతో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఆసీస్‌పై విజయం సాధిస్తే సెమీస్ బెర్త్‌తో పాటు అమ్మాయిల ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా.. నాలుగింటిలో విజయం సాధించి పాయిట్స్టేబుల్లో టాప్ లో కొనసాగుతోంది.
టీమిండియాలో స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ లు మాత్రమే ఫామ్ లో ఉన్నారు. మిగతా వారు అంతగా రాణించడం లేదు. ముఖ్యంగా సారథి మిథాలీ రాజ్ ఫామ్ కలవర పెడుతోంది. ఆమె పరుగులు సాధించడానికి ఆపసోపాలు పడుతోంది. గత మ్యాచులో టచ్ లోకి వచ్చిన రిచా ఘోష్ తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడాలి. ఇక, జులన్, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్ లతో కూడిన బౌలింగ్ లైనప్ మంచి ప్రదర్శన చేస్తోంది. ఆల్ రౌండర్లు స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్ కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. కానీ.. బ్యాటర్ల వైఫల్యమే టీమిండియా అవకాశాల్ని దెబ్బతీస్తోంది.
ఆస్ట్రేలియా రాచెల్ హేన్స్ బీభత్సమైన ఫామ్ లో ఉంది. 4 మ్యాచుల్లో 277 పరుగులు చేసి టాప్ లో ఉంది. ఇంకా అలీసా హేలీ, ఎల్లీస్ పెర్రీ, మెగ్ లానింగ్ డేంజరస్ ప్లేయర్స్. బౌలింగ్ లో జెస్ జొనెసెన్ డేంజర్ బౌలర్.
హెడ్ టు హెడ్ రికార్డులు :
ఇక, హెడ్ టు హెడ్ రికార్డులు టీమిండియాను కలవరపెడుతున్నాయ్. వన్డేల్లో రెండు జట్లు 49 సార్లు తలపడగా.. 39 సార్లు ఆస్ట్రేలియా విజయకేతనం ఎగురవేసింది. భారత అమ్మాయిలు కేవలం 10 మ్యాచుల్లో మాత్రమే నెగ్గారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.