హోమ్ /వార్తలు /క్రీడలు /

Women's T20 World Cup 2023 : ఈ నెల 10 నుంచి మహిళల టి20 ప్రపంచకప్.. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే

Women's T20 World Cup 2023 : ఈ నెల 10 నుంచి మహిళల టి20 ప్రపంచకప్.. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే

PC : BCCI

PC : BCCI

Women's T20 World Cup 2023 : మరో టి20 మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. మహిళల విభాగంలో దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా టి20 ప్రపంచకప్ 2023 (Women's T20 World Cup 2023)కు తెర లేవనుంది. మొన్న అండర్ 19 విభాగంలో ఇక్కడే టి20 ప్రపంచకప్ తొలిసారిగా జరిగింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Women's T20 World Cup 2023 : మరో టి20 మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. మహిళల విభాగంలో దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా టి20 ప్రపంచకప్ 2023 (Women's T20 World Cup 2023)కు తెర లేవనుంది. మొన్న అండర్ 19 విభాగంలో ఇక్కడే టి20 ప్రపంచకప్ తొలిసారిగా జరిగింది. సరిగ్గా రెండు వారాల తర్వాత సౌతాఫ్రికా వేదికగానే టి20 ప్రపంచకప్ జరగనుంది. ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు జరగనుంది. ఈ క్రమంలో తమ లక్ ను మరోసారి పరీక్షించుకోవడానికి టీమిండియా (Team India) మహిళల జట్టు సిద్ధమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ (HarmanPreet Kaur) నాయకత్వంలోని భారత జట్టు ఇప్పటికే సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది. ప్రపంచకప్ కు సన్నాహకంగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లతో కలిసి ట్రై సిరీస్ ను కూడా ఆడింది.

భారత్ తో పాటు.. మొత్తం 10 (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక, సౌతాఫ్రికా, ఐర్లాండ్, బంగ్లాదేశ్) జట్లు ఈ ప్రపంచకప్ బరిలో నిలిచాయి. 10 జట్లను ఐదు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు.. గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, భారత్, ఐర్లాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. మరోసారి చిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్తాన్ లు ఒకే గ్రూపులో ఉండటం విశేషం. ప్రతి జట్టు కూడా తమ గ్రూపులోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ప్రతి గ్రూపులోనూ టాప్ 2లో నిలిచిన మొత్తం నాలుగు జట్లు సెమీస్ కు చేరుకుంటాయి. ఫైనల్ కేప్ టౌన్ వేదికగా ఫిబ్రవరి 26న జరగనుంది. ఈ మ్యాచ్ లను ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

టీమిండియా షెడ్యూల్

ఎప్పుడుఎవరితోవేదికసమయం
ఫిబ్రవరి 12పాకిస్తాన్కేప్ టౌన్సా.గం. 6.30లకు
ఫిబ్రవరి 15వెస్టిండీస్కేప్ టౌన్సా.గం. 6.30లకు
ఫిబ్రవరి 18ఇంగ్లండ్కెబ్రాసా.గం. 6.30లకు
ఫిబ్రవరి 20ఐర్లాండ్కెబ్రాసా.గం. 6.30లకు

(నోట్ : మ్యాచ్ సమయాలను భారత కాలమానంలో తెలియజేయడమైనది)

టీమిండియా ప్రపంచకప్ జట్టు

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), రిచా ఘోష్, షఫాలీ వర్మ,  అంజలి శ్రావణి, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, రేణుక సింగ్, దీప్తి శర్మ, దేవిక వైద్య, పూాజా వస్త్రాకర్, రాధా యాదవ్

రిజర్వ్ ప్లేయర్స్

సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘనా సింగ్

First published:

Tags: Australia, Icc world cup 2019, IND vs PAK, India vs australia, India VS Pakistan, Pakistan, Smriti Mandhana, Team India, Womens World T20

ఉత్తమ కథలు