WOMENS T20 CHALLENGE VEL VS TRL LIVE SCORE UPDATES VELOCITY WON THE TOSS AND OPTED TO FIELD FIRST SRD
VEL vs TRL : కీలక పోరులో టాస్ నెగ్గిన వెలాసిటీ.. స్మృతి మంధాన జట్టుకు చావోరేవో..
VEL vs TRL
VEL vs TRL : మహిళల టి20 చాలెంజ్ టోర్నమెంట్ లో అసలు సిసలు పోరుకు రంగం సిద్ధమైంది. చావో రేవో మ్యాచులో సర్వ శక్తుల ఒడ్డటానికి రెడీ అయింది స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రయల్ బ్లేజర్స్ జట్టు.
మహిళల టి20 చాలెంజ్ టోర్నమెంట్ లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. వెలాసిటీ (Velocity), ట్రయల్ బ్లేజర్స్ (Trailblazers) జట్ల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. సూపర్ నోవాస్ తో జరిగిన మ్యాచులో ట్రైల్ బ్లేజర్స్ (Trailblazrers) ఓటమి పాలవ్వగా.. అదే జట్టుతో జరిగిన పోరులో వెలాసిటీ సూపర్ విక్టరీ కొట్టింది. ఇక, ఫైనల్ కు చేరాలంటే.. ట్రయల్ బ్లేజర్స్ కు ఇది చావోరేవో మ్యాచ్ లాంటిది. భారీ తేడాతో నెగ్గితేనే ఫైనల్ కు చేరుకుంటుంది స్మృతి మంధాన జట్టు. ఇక, పుణె వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది వెలాసిటీ జట్టు. దీప్తి శర్మ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. మాయ ప్లేసులో సిమ్రాన్ తుది జట్టులో చోటు దక్కించుకుంది. ఇక, ట్రయల్ బ్లేజర్స్ లో సబ్బిన్నేని మేఘన తుది జట్టులో చోటు దక్కించుకుంది.ఒక్కో జట్టు రెండు మ్యాచ్ లను ఆడుతుంది. టాప్ 2లో నిలిచిన రెండు జట్ల మధ్య మే 28న ఫైనల్ జరగనుంది. దీంతో.. టాప్ -2 లో చోటు దక్కించుకోవడానికి హోరాహోరీ తలపడుతున్నారు అమ్మాయిలు.
వెలాసిటీ జట్టు ఫస్ట్ మ్యాచులో అదరగొట్టింది. ఈ మ్యాచులో కూడా గెలిస్తే ఫైనల్ కి చేరుకుంటోంది. జట్టులో ఓపెనర్ గా షఫాలీ వర్మ కీలకం కానుంది. వీరేంద్ర సెహ్వాగ్ లా ధాటిగా ఆడగల సత్తా ఆమె సొంతం. దాంతో ఆమెను లేడీ సెహ్వాగ్ అని కూాడా పిలుస్తారు. లారా వోల్వార్డ్, యస్తిక భాటియా, దీప్తి శర్మ వంటి టాప్ క్లాస్ ప్లేయర్లు వెలాసిటీ జట్టు సొంతం. బౌలింగ్ లో కేట్ క్రాస్, ఖాఖ, రాధా యదవ్, స్నేహ్ రాణ్ కీలకం కానున్నారు.
🚨 Toss Update 🚨
Velocity have elected to bowl against Trailblazers.
ఇక, ఫస్ట్ మ్యాచులో ఘోరంగా ఓడిపోయి.. ఫైనల్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది ట్రయల్ బ్లేజర్స్. స్మృతి మంధాన, హేలీ మాథ్యూస్, జెమీమా రొడ్రిగ్స్ వంటి టాప్ క్లాస్ బ్యాటర్లు ఉన్నప్పటికీ మిగతా వాళ్లు విఫలమవ్వడంతో ఫస్ట్ మ్యాచులో ఘోరంగా ఓడిపోయింది. డంక్లీ, రిచా ఘోష్ బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించాల్సి ఉంది. బౌలింగ్ లో సల్మా కాతూన్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ కీలకం కానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.